Bigg Boss3 Telugu Gossip: లీకు వీరులకు బిగ్ బాస్ 'బిగ్ షాక్'..ఈరోజు ఎలిమినేషన్ ఆమేనా?

Bigg Boss3 Telugu Gossip: లీకు వీరులకు బిగ్ బాస్ బిగ్ షాక్..ఈరోజు ఎలిమినేషన్ ఆమేనా?
x
Highlights

బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్ లో ఎవరు బయటకు వెళ్ళిపోతారో లీకులు వచ్చేసేవి. ఆ లీకులు.. సోషల్...

బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్ లో ఎవరు బయటకు వెళ్ళిపోతారో లీకులు వచ్చేసేవి. ఆ లీకులు.. సోషల్ మీడియాలో శుక్రవారం నుంచే చక్కర్లు కొట్టేవి. అయితే.. ఆదివారం సరిగ్గా అలానే జరిగేది. ఈవారం కూడా ఎలిమినేషన్స్ లో నలుగురు ఉన్నారు. వరుణ్, పునర్నవి, రాహుల్, మహేష్ వీరిలో శనివారం రాహుల్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు. అదే సమయంలో హౌస్ లో ఎవరు భారం అని అడిగిన ప్రశ్నకు ఎక్కువ మంది మహేష్ పేరు సూచించారు. దీంతో మహేష్ ఈవారం బయటకు వెళ్ళిపోతారని అందరూ కచ్చితంగా భావించారు. లీకులూ.. సోషల్ మీడియా ఇదే భావిస్తూ వచ్చింది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పునర్నవి ని బయటకు పంపిస్తున్నారని అంటున్నారు. రాహుల్, పునర్నవి ల మధ్య పులిహోర గురించి అందరికీ తెలిసిందే. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చనీ, అప్పుడు రాహుల్, పునర్నవీ వెళ్ళిపోతారనీ అనుకున్నారు. అయితే, ఆ ఊహాగానాలకు శనివారం తెరపడిపోయింది. రాహుల్ సేఫ్ ఉన్నాడని తెలియగానే ఇక ఆ ఎపిసోడ్ లో జరిగిన సంఘటనలు బేరీజు వేసుకుని మహేష్ వెళ్ళిపోతాడని ఫిక్స్ అయిపోయారందరూ. కానీ ఓటింగ్ లో పునర్నవికి వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. అంటే పునర్నవికి ఓట్లు తక్కువగా వచ్చాయట. దీని ప్రకారం పునర్నవి వెళ్ళిపోవాలి. అయితే, బిగ్ బాస్ మీద ఇప్పటి వరకూ ప్రచారం లో ఉన్న వార్తలు.. బిగ్ బాస్ లో జరుగుతున్న విశేషాల్లో పునర్నవి.. రాహుల్ ఒక ప్రత్యేకంగా ఉన్నారు. అందువల్ల ఇప్పుడు రాహుల్ సేవ్ అవడం తో పునర్నవి సేఫ్ అయిపోతుందని అనుకున్నారందరూ.

ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం పునర్నవి ఈరోజు సూట్ కేస్ సర్దేసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే 76 ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న తరుణం లో ప్రేక్షకులలో ఉన్న అపోహల్ని తొలగించడానికి పునరాన్విని బయటకు పంపిస్తున్నట్టు విశ్వసనీయంగా అందుతున్న సమాచారం..

ఇంకొద్ది గంటల్లో ఏ విషయం తేలిపోతుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories