Top
logo

మొత్తానికి ఆరో ఎపిసోడ్ లో వినోదం దొరికింది బిగ్‌బాస్!

మొత్తానికి ఆరో ఎపిసోడ్ లో వినోదం దొరికింది బిగ్‌బాస్!
X
Highlights

బిగ్ బాస్ షో ఆరో ఎపిసోడ్ కొంచెం వేడిగా... కొంచెం చల్లగా.. కొంచెం హుందాగా నడిచింది.. బహుశా శనివారం నాగార్జున...

బిగ్ బాస్ షో ఆరో ఎపిసోడ్ కొంచెం వేడిగా... కొంచెం చల్లగా.. కొంచెం హుందాగా నడిచింది.. బహుశా శనివారం నాగార్జున వచ్చేసరికి ఇబ్బందులు ఉండకూడదని అనుకున్నట్టున్నారు నిన్నటి గొడవను చల్లార్చే ప్రయత్నం మొత్తం ఇంటి సభ్యులు అందరూ చేశారు. వరుణ్ సందేశ్, మహేష్ విట్టాల మధ్య రేగిన వివాదాన్ని మొత్తమ్మీద చల్లార్చగలిగారు. మహేష్ వరుణ్ కు క్షమాపణలు చెప్పడంతో ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడింది. ఈ విషయంలో బాబా భాస్కర్ చాలా హుందాగా ప్రవర్తించారు. ఇద్దరితో మాట్లాడి కొంత వరకూ వాతావరణం తేలికయ్యేలా చేశారు.

గొడవ సర్డుకోవడానికీ ఎంత గొడవో..

జరిగిన గొడవ చల్లారడానికి మహేష్‌ క్షమాపణ చెబుతానని చెప్పాడు. అయితే అందరూ కలిసి చర్చించేందుకు కూచున్నారు కానీ, అది మళ్లీ కొత్త రగడకు దారితీసింది. మహేష్ బాబా భాస్కర్ కు అన్నీ చెప్పను ఆయన చెబుతాడని చెప్పాడు. దీంతో వరుణ్ కూడా నేనూ శ్రీముఖికి చెప్పాను తాను చెబుతుంది అంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఇలా పెరుగుకుంటూ వెళ్తూ ఉన్న గొడవను ఇంటి సభ్యులందరూ కలిసి తగ్గించే ప్రయత్నం చేశారు. తన తప్పులేకపోయినా.. సారీ చెబుతున్నానని మహేష్ అన్నాడు. దానికి అటువంటి క్షమాపణ తనకు అక్కరలేదని చెప్పింది. దీనికి అయితే వెళ్ళిపొండి అని మహేష్ వితికను అనడంతో మళ్లీ గొడవ పెద్దదైపోయింది. ఆఖరుకు బేషరతుగా మహేష్ వచ్చి వరుణ్ ను కల్సి క్షమాపణలు చెప్పాడు. దీనితో గొడవ ముగిసిపోయింది.

తిండి దగ్గర తింగరి గోల!

ఇక హౌస్ లో ప్రతి రోజూ డైనింగ్ టేబుల్ వద్ద ఎదో గొడవ జరుగుతూనే ఉంది. లగ్జరీ బడ్జెట్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో.. ఆహార పదార్థాలు తక్కువైపోయాయి. దీనితో చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారిపోతున్నాయి. శ్రీముఖి బాబా భాస్కర్ ఏమీ తినలేదని చెబుతూ పెద్ద కథ చెప్పింది. ఇది వివాదానికి దారితీసింది.

రెండుగా చేసి వినోదానికి బాట!

బాబా భాస్కర్ లీడర్ గా ఓ టీం, శ్రీముఖి లీడర్ గా ఓ టీం ఏర్పాటుచేశాడు బిగ్‌బాస్‌. వాళ్ళని చెరో స్కిట్ చేయమని చెప్పాడు. దీని కోసం చేసిన రిహార్సల్స్ లో బబా భాస్కర్, జాఫర్ లు కామెడీని పండించారు. ఇక రెండు టీములు చెరో స్కిట్ చేశారు. దానితో వినోదాత్మకంగా ఆరో ఎపిసోడ్ ముగిసింది.

ఇలా ఉంది..

ప్రశాంతమైన పరిస్థితులు తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు.. దానిలో మళ్లీ జరిగిన గోల ఇలా చాలా వరకూ ఎపిసోడ్ సాగింది. తరువాత బిగ్‌బాస్‌ టాస్క్ తో వాతావరణం మారిపోయింది. బాబాభాస్కర్ టీం, శ్రీముఖి టీం స్కిట్ ల కోసం చేసిన రిహార్సల్స్ తో ప్రారంభమైన వినోదం స్కిట్ ల ప్రదర్శనతో పీక్స్ కి చేరింది. శ్రీముఖి ఒక దొంగతనం కాన్సెప్ట్ ని ఎంచుకుని.. రోమాన్స్ మిక్స్ చేసి స్కిట్ చేసింది. తరువాత బాబా భాస్కర్ టీం రైతు ప్రాధాన్యత ఉన్న స్కిట్ తో మంచి ప్రయోగం చేశారు. ఇందులో బాబా భాస్కర్ చెప్పిన డైలాగ్స్ కూడా బావున్నాయి. మహేష్ విట్టా కూడా బాగా చేశాడు. రెండు స్కిట్ లలో బాబా స్కిట్ కే ఎక్కువ మార్కులు పడినట్టే.

మొత్తమ్మీద శనివారం సేఫ్ పొజిషన్ లో ఎవరు ఉన్నారో తేలడానికి రిహార్సల్ టాస్క్ పూర్తయింది. ఇక నాగార్జున వచ్చేసరికి టీం మేట్స్ ఉత్సాహంగా ఉండేట్టుగా పరిస్త్తితులు చక్కదిద్దారు. శనివారం ఎవరు సేఫ్ జోన్ లోకి వెళతారో తెలుస్తుంది.

బిగ్‌బాస్ పై hmtv ఇతర కథనాలు..

కొద్దిసేపట్లో బిగ్‌బాస్..ఫైనల్ గా లోపలి వెళ్లేది వీరేనా?

అదరగొట్టిన నాగార్జున ఎంట్రీ.. తీన్మార్ సావిత్రి మొదటి గెస్ట్

బిగ్‌బాస్ లోకి ఈ ముగ్గురూ వెళ్లారు.. టాస్క్ కూడా ఇచ్చేశాడు!

బిగ్‌బాస్3 లోకి మరో ముగ్గురు.. ఎవరి తెలుసా?

బిగ్‌బాస్3 లోకి నటి రోహిణి, కొరియో గ్రాఫర్ బాబా భాస్కర్

బిగ్‌బాస్3 లోకి పునర్నవీ భూపాలం, హేమ

శ్రీముఖి బిగ్‌బాస్ ఇంట్లోకి.. వరుణ్, వితిక కూడా..

బిగ్‌బాస్3 అంతా అనుకున్నట్టే..


బిగ్‌బాస్ బిగించాడుగా..

హేమకు బిగ్‌బాస్ షాక్!

బిగ్‌బాస్ లోకి మరో హాట్ బ్యూటీ!

బిగ్‌బాస్ ఎంతమంది బావుందన్నారో తెలుసా?

బిగ్‌బాస్ లో వంటింటి మంటలు!

బిగ్‌బాస్ లో ఆకలి కేకలు!

నా ఫేసే అంత..నా మాటే అంత! బిగ్‌బాస్ హౌస్ లో బిగ్ ఫైట్

మొత్తానికి ఆరో ఎపిసోడ్ లో వినోదం దొరికింది బిగ్‌బాస్!


Next Story