నా ఫేసే అంత.. నా మాటే అంత! బిగ్‌బాస్‌ హౌస్ లో బిగ్ ఫైట్!

నా ఫేసే అంత.. నా మాటే అంత! బిగ్‌బాస్‌ హౌస్ లో బిగ్ ఫైట్!
x
Highlights

"ఏయ్..మీదికొస్తున్నావేంటి? కొడతావా.. కొట్టు! నీకసలు మర్యాద తెలుసా? నువ్వు మనిషివేనా?" ఇదీ వరుణ్ సందేశ్ యాక్షన్. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. బిగ్‌బాస్‌...

"ఏయ్..మీదికొస్తున్నావేంటి? కొడతావా.. కొట్టు! నీకసలు మర్యాద తెలుసా? నువ్వు మనిషివేనా?" ఇదీ వరుణ్ సందేశ్ యాక్షన్. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. బిగ్‌బాస్‌ షో లో గురువారం ఎపిసోడ్ లో వరుణ్ సందేశ్ మహేష్ విట్టాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బ్యాటరీలు మార్చుకునేందుకు వెళ్తున్న తనతో మహేష్ విట్టా అమర్యాదగా మాట్లాడాడంటూ వితికా షేరు ఆరోపించింది.

ఆ సమయంలో మహేష్ విత్తా బ్యాటరీ రూమ్ డోర్ దగ్గర అడ్డుగా నిలుచుని ఉన్నాడు. వితికా కేకలకు అక్కడకు వచ్చిన వరుణ్ సందేశ్ ఒక్కసారిగా మహేష్ విట్టా మీద ఫైర్ అయ్యాడు. వేలెత్తి చూపుతూ నా భార్యకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అంటూ కోపంగా మీదకి వెళ్ళాడు. దీంతో మహేష్ కూడా ఎన్టీ.. వేలెత్తి చూపిస్తున్నావ్ అంటూ వరుణ్ మీదకు వచ్చాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ సీన్ మారిపోయింది. అక్కడే ఉన్న రాహుల్‌, మహేష్‌కు సర్ది చెప్తుండగా.. అతని మీద కూడా మహేష్ సీరియస్ అయ్యాడు. దీంతో పరిస్థితి విషమించింది. మహేష్ నేను చెప్పేది విను అంటూ చెప్పబోయాడు.. కానీ వరుణ్ వినలేదు. ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకో.. సిగ్గులేనోడా అంటూ కోపంగా విసుక్కున్నాడు.

ఇక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తయింది. కానీ.. గొడవ పూర్తి కాలేదు. మరి ఈరోజు ఎపిసోడ్ కి సస్పెన్స్ కావాలి కదా! అయితే, ఈ ఎపిసోడ్ ప్రోమోలో మహేష్, వరుణ్ మళ్ళీ ఒకరినొకరు తిట్టుకున్తున్నట్టున్న సన్నివేశం ఒకటి కనిపిస్తోంది. నా ఫేసే అంత అని వరుణ్ అంటే.. నా మాటే ఇంత అంటూ మహేష్ కౌంటర్ ఇస్తున్నాడు అందులో!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories