బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 23 హైలైట్స్ : ఈవారం ఎలిమినేషన్స్ లో వీరే!

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 23 హైలైట్స్ : ఈవారం ఎలిమినేషన్స్ లో వీరే!
x
Highlights

బిగ్ బాస్ లో ఈవారం ఎలిమినేషన్ కి నామినేషన్ల ప్రక్రియ జరిగింది. రోహిణి, శివజ్యోతి బిగ్ బాస్ మాటను బేఖాతరు చేసినందుకు ఇద్దరికీ శిక్ష పడింది. హౌస్ లో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు

బిగ్ బాస్ లో సోమవారం అంటే.. ఎలిమినేషన్స్ కి నామినేట్ చేసే రోజు. ఈసారి శ్రీముఖి డైరెక్ట్ గా నామినేట్ అయింది. గత వారంలో జరిగిన గొడవల్లో శ్రీముఖిని బిగ్ బాస్ ఈవారం ఎలిమినేషన్స్ కి నామినేట్ చేసిన సంగతి తెల్సిందే. ఇక అలీ, పునర్నవి గతవారం సీక్రెట్ టాస్క్ లో భాగంగా ఈ వారానికి ఇమ్యునైజేషన్ పొందారు. ఇక మిగిలిన వారి నుంచి ఎలిమినేషన్స్ కోసం ఎంపిక జరిగింది. ఇద్దరిద్దరుగా కన్ఫెషన్ రూమ్ కి పిలిచి వారిలో ఒకరిని పరస్పరం చర్చించుకుని నామినేట్ చేసుకోమని బిగ్ బాస్ చెప్పాడు. ముందుగా రవికృష్ణ వితికలు వెళ్లారు. వారిలో రవి నామినేట్ అయ్యాడు. శివజ్యోతి రోహిణిలలో శివజ్యోతి నామినేట అయింది. తరువాత వరుణ్ మహేష్ లలో వరుణ్ నామినేట్ అయ్యారు. ఇక భాస్కర్ అషు లలో బాబా భాస్కర్ నామినేట్ అయ్యారు. రాహుల్ హిమజలలో రాహుల్ నామినేట్ అయ్యారు.

నామినేషన్ ప్రక్రియలో లోపల ఏం జరిగింది అనేది బయట చెప్పకోడదని బిగ్ బాస్ హెచ్చరించాడు. అయినా, శివజ్యోతి, రోహిణి ఈ విషయమై మాట్లాడారని చెబుతూ వారికి శిక్ష వేశాడు బిగ్ బాస్. రోహిణి ని కూడా ఈవారానికి నామినేట్ చేశాడు. అంతే కాకుండా రోహిణి, శివజ్యోతి ఇద్దర్నీ వచ్చే వారం కూడా ఎలిమినేషన్స్ లో నామినీలుగా ఉంటారని చెప్పి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్

హౌస్ లో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందు అందరికీ వారి కుటుంబ సభ్యుల ఫోటోలను టీవీలో చూపించిన బిగ్ బాస్ తరువాత వారిని పండుగ సంబరాలు చేసుకోమని చెప్పాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories