బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 22 హైలైట్స్ : ఆడుతూ పాడుతూ అంతా అనుకున్నట్టే జరిగింది..

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 22 హైలైట్స్ : ఆడుతూ పాడుతూ అంతా అనుకున్నట్టే జరిగింది..
x
Highlights

అంతా అనుకున్నట్టే. బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ సాగింది. లీకుల పుణ్యమా అని ఆదివారం బిగ్ బాస్ మజా పోతోంది. తమన్నా ఎలిమినేట్ ఖాయం అని నిన్ననే ఇంకా చెప్పాలంటే శుక్రవారమే తెలిసిపోయింది. అది అధికారికంగా ప్రకటించారు.

ఆదివారం నాగార్జున బిగ్ బాస్ లోకి వచ్చారు. వస్తూనే వస్తూనే హౌస్ మేట్స్ తో ఆట మొదలు పెట్టేశారు నాగార్జున.. అంకితం అనే ఆట ఆడించాడు. 14 కవర్లలో ఒక్కో సాంగ్ పెట్టి ఆ సాంగ్ కి యాప్ట్ ఎవరో చెప్పమన్నారు. ఆట పాటలతో సందడిగా షో నడుస్తుండగా మధ్యలో ఒకర్ని సేఫ్ చేస్తున్నట్టు చెప్పారు. అషును స్టోర్ లో ఉన్న సూట్ కేస్ తెచ్చి ఎవరి పేరు వుంటే వారి వెనుక పెట్టమన్నారు. ఈలోపు ఎవరు సేఫ్ లో ఉన్నారో చెప్పండని హౌస్ మేట్స్ ని అడిగారు. ఎక్కువమంది బాబా భాస్కర్ పేరు చెప్పారు. కానీ, రాహుల్ సేఫ్ జోన్ లో ఉన్నట్లు ప్రకటించారు. తరువాత మళ్ళీ ఆటను కొనసాగించారు. తిరిగి మధ్యలో పునర్నవి సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు.

ఈ అంకితం ఆట పూర్తవుతూనే.. స్పెషల్ గెస్ట్ ను తీసుకువచ్చారు. వెన్నెల కిషోర్ వచ్చారు. కాసేపు సందడి చేశారు. అందర్నీ పేరు పేరునా పలకరించి వారెలా ఆడుతున్నారో చెప్పారు వెన్నెల కిషోర్. సరదాగా సందడి చేశారు. మన్మధుడు 2 సినిమా ట్రైలర్ చూపించారు. ఆ సినిమాలో డైలాగ్ చెప్పి అందర్నీ నవ్వించి అలరించారు. తరువాత నాగార్జున వెన్నెల కిషోర్ మన్మధుడు 2లో వెన్నెల కిశోర్ కామెడీకి తనకు నవ్వు ఆగలేదన్నారు. ఇక కిషోర్ వెళుతూ వెళుతూ బాబా భాస్కర్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు. ఇక వితిక, తమన్నా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్నవిషయంపై కొంత సస్పెన్స్ నడిచినా.. తమన్నా ఎలిమినేట్ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.. నాగ్ ఎలా చెబుతారు అన్న మాట గురించే వేచి చూశారు. బిగ్ బాస్ ఈ సీజన్ లో అన్నీ ముందే లేకవుతున్నాయి. నిన్నటి నుంచి తమన్నా ఎలిమినేట్ అవుతుంది అని చెబుతూ వచ్చిన వార్తల్ని నిజం చేస్తూ చివరికి తమన్నాని ఎలిమినేట్ చేశారు.

వెళుతూ వెళుతూ తమన్నా అందరి గురించి తాను ఏమనుకుంటుందో చెప్పింది. మహేష్ నా తమ్ముడు అంది.. ఆడపిల్లలన్దర్నీ మంచివారనే చెప్పింది. రవిని కూడా పొగడడం కొసమెరుపు. ఇక బాబా భాస్కర్ గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడింది. బాబా భాస్కర్ ను తన తండ్రి.. గురువు.. దైవం అని చెప్పింది. అంతే కాదు ఆయన కడుపున పుట్టలేకపోయినందుకు బాధగా ఉందని చెప్పింది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories