బిగ్ బాస్ ఎపిసోడ్ 21 హైలైట్స్: నాగార్జున రూటు మార్చారు

బిగ్ బాస్ ఎపిసోడ్ 21 హైలైట్స్: నాగార్జున రూటు మార్చారు
x
Highlights

బిగ్ బాస్ 3 తెలుగు క్రమేపీ వేడెక్కుతోంది. ఇప్పటివరకూ సరదాగా ఉంటూ వస్తున్న నాగార్జున ఇప్పుడు హౌస్ మేట్స్ మీద సీరియస్ అయ్యారు. మితి మీరి ప్రవర్తిస్తే, సహించేది లేదంటూ గట్టిగా హౌస్ మేట్స్ అందరికీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

నాగార్జున రూటు మార్చారు. గత రెండు వారాల్లోనూ బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున హౌస్ మేట్స్ ని పల్లెత్తు మాట కూడా అనకుండా.. నవ్వుతూ, నవ్విస్తూ ఎపిసోడ్స్ నడిపించారు. అయితే, ఈ వారం అయన తన రూటు మార్చారు. హౌస్ మేట్స్ లో క్రమశిక్షణ లోపించడం.. ఒకరిని ఒకరు వ్యక్తిగతంగా దూషణలు చేసుకోవడం వంటి పనులతో హౌస్ లో ఉద్రిక్తతలు రేపారు. ముఖ్యంగా.. తమన్నా, రాహుల్ ఇద్దరూ పలు సందర్భాల్లో నోటికి పనిచెప్పారు. తమన్నా పూర్తిగా లిమిట్స్ దాటి మాట్లాడింది. ఇక అలీ అయితే, హిమజ జేబులో చెయ్యి పెట్టడమే కాకుండా ఆమెను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. శనివారం నాగార్జున ఈ మూడు విషయాల మీద సీరియస్ గానే క్లాస్ పీకారు. అందరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తమన్నా జర్నలిజం మీద చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. జర్నలిస్టులు సపోర్ట్ చేస్తేనే మీకీ స్థాయి వచ్చిందని గుర్తుంచుకోండి అని కోపంగానే చెప్పారు. ఆమెతో జర్నలిస్టులందరికీ క్షమాపణలు చెప్పించడమే కాకుండా.. మళ్ళీ ఇటువంటివి చోటుచేసుకుంటే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు అంటూ తీవ్రంగా హెచ్చరించారు.

ఇక రాహుల్ శ్రీముఖిని ఫాల్తూది అంటూ మాట్లాడిన మాటల పై నాగ్ సీరియస్ గా రియాక్టయ్యారు. తప్పుడు మాటలు. .ఆడవారి మీద మాట్లాడటం తగదని హెచ్చరించారు. ఇక ముందు ఇలాంటివి చోటు చేసుకోకుండా చూసుకోవాలని చెప్పి, శ్రీముఖి, రాహుల్ చేతులు కలుపుకోవాలని సూచించారు.

ఇక అలీ ని తీవ్రంగా మందలించారు. ఒక ఆడపిల్లతో ఎలా ప్రవర్తించాలో తెలీదా అంటూ ఆయన అలీని గట్టిగా మందలించారు. అసలు ఆడపిల్ల మీద చేయివేయడమే తప్పు. ఆ తప్పుకు ఆడపిల్లలు కాలితో తన్నడంలో తప్పు లేదు. కచ్చితంగా ఎవరైనా అదేపని చేస్తారు. కానీ, నీ తప్పు ఉంచుకుని తిరిగి నువ్వు హిమజను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు అని తీవ్ర స్వరంతో మందలించారు. ఇదే సందర్భంలో హౌస్ మేట్స్ వ్యవహరించిన శైలిని నాగార్జున తప్పుపట్టారు. తమ మధ్యలో ఓ అమానుషం జరుగుతున్నపుడు స్పందించకుండా ఉండడం చాలా పెద్ద నేరం అంటూ ఆయన అందర్నీ ఒక రేంజిలో వేసుకున్నారు. అయితే, ఈ సంఘటనలో.. తమన్నా వ్యవహరించిన విధానాన్ని అయన మెచ్చుకున్నారు. ఆమె అలీని హిమజ విషయంలో నీ ప్రవర్తన తప్పు అంటూ కచ్చితంగా చెప్పడం.. అతనిని హిమజ పై ఎక్కువ మాట్లాడకుండా ఆపాలని ప్రయత్నించడం బావుందని కితాబిచ్చారు.

ఇక ఈ వారం సేఫ్ జోన్ లో ఎవరున్నారన్నది ప్రకటించలేదు. మీరే ఆదుకుంటారా? అపుడప్పుడు బిగ్ బాస్ కూడా ఆడుకుంటాడు అంటూ ఆదివారం ఎవరు బయటకు వెళతారో తేలుతుంది అని చెప్పారు.

తమన్నా ఎలిమినేట్ అవుతుందా?

తమన్నా కచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని ఇప్పటివరకూ తెలుస్తున్న సమాచారం. అయితే, ఇంకో రకమైన వాదన కూడా బలపడుతోంది. ఈ వారం ఎవరి ఎలిమినేషన్ ఉండకపోవచ్చనీ అనుకుంటున్నారు. కారణంగా మొత్తం ఓట్లలో బాబా భాస్కర్ ఒక్కరికే 81 శాతం ఓట్లు వచ్చాయని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో మిగలిన 19శాతం ఓట్లలో వచ్చిన తేడాతో ఒకరిని బయటకు పంపించడం కరెక్ట్ కాదని భావిస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఎవరు బయటకు వెళ్ళేది కొద్ది గంటల్లో తేలనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories