కొంచెం సరదా.. కొంచెం ఎమోషన్.. బిగ్ బాస్ వినోదం

కొంచెం సరదా.. కొంచెం ఎమోషన్.. బిగ్ బాస్ వినోదం
x
Highlights

భర్త పదవిలోని ఆనందాన్ని అనుభవిస్తున్న భార్య.. సారీతో తమన్నాని కూల్ చేసిన అలీ.. సబ్బులు విరిచి గెలిచిన లగ్జరీ బడ్జెట్.. పునర్నవి తో డేట్ ఆశల్లో...

భర్త పదవిలోని ఆనందాన్ని అనుభవిస్తున్న భార్య.. సారీతో తమన్నాని కూల్ చేసిన అలీ.. సబ్బులు విరిచి గెలిచిన లగ్జరీ బడ్జెట్.. పునర్నవి తో డేట్ ఆశల్లో రాహుల్.. జీవితానుభావాల నుంచి ఒక పేజీ.. ఇలా బిగ్ బాస్ సీజన్ ఎపిసోడ్ 13 సాగింది.

అచ్చం బయట ఆలూమగలు ఎలా ఉంటారో.. అలా.. భర్త హోదాని భార్య ఎంజాయ్ చేస్తుందిగా.. అలానే రితిక షేరు.. తన భర్త వరుణ్ కెప్టెన్సీని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ఇలా చేయండి అలా చేయకండి అని తన భర్తకి చెప్పడమే కాదు.. హౌస్ మేట్స్ కి కూడా ఆర్డర్లు వేస్తోంది.

డేట్ కు వస్తావా?

పునర్నవితో క్లోస్ నెస్ కోసం ప్రయత్నిస్తున్న రాహుల్ ఈ రోజు మరో అడుగు ముందుకు వేశాడు. హౌస్ లోంచి బయటకు వెళ్ళాకా నాతో డేటింగ్ కి వస్తావా అని అడిగాడు. దానికి పునర్నవి నా రిలేషన్ షిప్ స్టేటస్ ఎప్పుడన్నా అడిగావా? అని ప్రశ్నించింది. కొంపదీసి ఎవరితోనైనా రిలేషన్ షిప్ లో ఉన్నావా అని కంగారు పడ్డాడు రాహుల్.. దానికి పునర్నవి అవును అని బాంబ్ పేల్చి రాహుల్ ఆశల్ని చిదిమేసింది. ఎవరా అందగాడని ప్రశ్నించిన రాహుల్ కు నేను చెప్పను అంటూ నవ్వేసింది గ్లామర్ డాల్ పునర్నవి.

బిగ్ బాస్ లగ్జరీ ఫిటింగ్..

ఇప్పటికే లగ్జరీ టాస్క్ పూర్తి చేసిన హౌస్ మేట్స్ కి ఇంకో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బట్టలు ఉతికే సబ్బుల్ని అరగదీసి అందులో ఉన్న కాయిన్స్ ను బట్టి పాయింట్లు వస్తాయని చెప్పాడు. ముగ్గురు ఈ టాస్క్ లో పాల్గోవాలని చెప్పాడు. సబ్బుల్ని ఇరగదీసి మరీ పాయింట్లు పట్టారు హౌస్ మేట్స్.

ఎమోషనల్ టచ్..

లగ్జరీ బడ్జెట్ తీసుకునే సమయంలో బజర్ మోగిన తరువాత కూడా కాఫీ గురించిన ఐటం కరక్షన్ చేశారంటూ లగ్జరీ బడ్జెట్ నుంచి కాఫీని కట్ చేశాడు బిగ్ బాస్. తరువాత వారికి మరో ఎమోషనల్ కార్యక్రమాన్ని అప్పచెప్పాడు.

తమ జీవితంలో ఇలా జరగకుండా ఉంటె బావుణ్ణు అనుకునే సంఘటనల్ని పంచుకోవాల్సిందిగా సూచించాడు. అందరూ తమ తమ జీవితంలో కోల్పోయిన వాటిని గురించి చెప్పారు. బాబా భాస్కర్ తల్లిదండ్రుల గొప్పదనాన్ని తన జీవితంతో అన్వయిస్తూ తనదైన భాషలో చక్కగా చెప్పి అందరూ అమ్మానాన్నలని బాగా చూసుకొండని సందేశం ఇచ్చాడు. ఇలా మిగిలిన వారిలో షూటింగ్ లో కష్టపడి ఇంటికి వచ్చి తమ రూమ్ లోకి వెళ్లి పడుకుతాననీ.. కనీసం తనని పలకరించే వారు కూడా లేని పరిస్థితి ఎంతో బాధాకరమనీ శ్రీముఖి చెప్పింది. అమ్మను మిస్ అవుతున్ననంటూ బాధపడింది.

ఈ రోజు ఎలా వుందంటే..

సాఫీగా.. చక్కని వాతావరణంలో ఎపిసోడ్ నడిచింది. అలీ బేషరతుగా.. తనంత తానుగా తమన్నాకి క్షమాపణలు చెప్పడం.. అదీ చాలా హుందాగా బావుంది. దానికి తమన్నా కూడా చక్కని స్పందన కనపర్చినది. ఇక వరుణ్ ను డామినేట్ చేస్తున్న వితిక.. హౌస్ మేట్స్ మీద పెత్తనం చేలాయిస్తుండడం ఫన్నీగా అనిపిస్తోంది. బయట వినే భార్యా, భర్తల కామెడీకి ఇది సాక్ష్యంలా అనిపిస్తోంది. ఇక తమ జీవితంలోని సంఘటనలు చెప్పాలని బిగ్ బాస్ కోరడం.. హౌస్ మేట్స్ అందరూ దానికి స్పందించి తమ అనుభవాలు చెప్పడం కొంత ఎమోషన్ తెచ్చింది.

మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ కొంత ఫన్నీగా.. కొంత రొమాంటిక్ గా.. మరికొంత ఎమోషనల్ గా సాగిపోయింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories