Bigg Boss Telugu 7: నామినేషన్స్‌లో 8 మంది.. ఈ వారం ఎలిమినేషన్‌ అయ్యేది ఎవరంటే? ఉల్టా-పల్టాతో ఊహించని ట్విస్ట్..!

Bigg Boss Telugu 7 Week 1 Nominations: బిగ్ బాస్ తెలుగు 7 సరికొత్త సీజన్ సెప్టెంబర్ 3న 14 మంది కంటెస్టెంట్లతో ఉల్టా-పల్టా హౌస్ సెటప్‌లోకి ప్రవేశించడంతో ప్రారంభమైంది.

Arun Chilukuri
Updated on: 7 Sept 2023 7:31 PM IST
Bigg Boss Telugu 7 No Elimination in Week 1 Nominations
X

Bigg Boss Telugu 7: నామినేషన్స్‌లో 8 మంది.. ఈ వారం ఎలిమినేషన్‌ అయ్యేది ఎవరంటే? ఉల్టా-పల్టాతో ఊహించని ట్విస్ట్..!

Bigg Boss Telugu 7 Week 1 Nominations: బిగ్ బాస్ తెలుగు 7 సరికొత్త సీజన్ సెప్టెంబర్ 3న 14 మంది కంటెస్టెంట్లతో ఉల్టా-పల్టా హౌస్ సెటప్‌లోకి ప్రవేశించడంతో ప్రారంభమైంది. అయితే, మొదటి వారమే బిగ్ బాస్ నామినేషన్లతో హౌస్‌లో ఉత్కంఠ పెంచేశాడు. హౌస్‌లో సెటిల్ అవుతున్న హౌస్‌మేట్స్ మధ్య వాడివేడి వాదనల మధ్య మొదటి వారం నామినేషన్లు మరింత ఊపందిస్తున్నాయి.

1వ వారంలో బిగ్ బాస్ తెలుగు 7 నామినేట్ అయిన పోటీదారులు.. రతిక, ప్రిన్స్ యావర్, షకీలా, దామిని, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, గౌతం కృష్ణ, కిరణ్ రాథోడ్‌లను మొదటి వారంలో హౌస్ నుంచి బయటకు పంపడానికి నామినేట్ అయ్యారు.

రియాలిటీ షో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి వారంలో కిరణ్ రాథోడ్, షకీలా, గౌతం కృష్ణ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు ఫ్యాన్ పేజీల్లో సమాచారం అందుతోంది. అయితే, ఎటువంటి ఎలిమినేషన్ ఉండకపోవచ్చని చాలా మంది అంచనా వేస్తున్నారు. ఎందుకంటే బలమైన కారణం లేకుండా కంటెస్టెంట్లు తొలగించడం కుదరదు. అయితే, మేకర్స్ ఈ సీజన్‌ను మరింత ఉత్కంఠగా మార్చి ఉల్టా-పల్టాగా ప్రచారం చేసినందున, నామినేట్ చేయబడిన పోటీదారులలో నిజంగా ఎలిమినేషన్ ఉండకపోవచ్చని అంటున్నారు. లేదా బిగ్ బాస్ మదిలో ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయోమో చూడాలి.

అసలు విషయం తెలియాలంటే వారాంతపు ఎపిసోడ్‌లు ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే. బిగ్ బాస్ 7 తెలుగు షో కంటెస్టెంట్ల ఎలిమినేషన్ కార్యక్రమం వీకెండ్స్‌లో జరుగుతుంది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నామినేషన్లు ఉంటాయా, లేదా మరికొంతమంది యాడ్ అవుతారా అనేది కూడా ఆదివారం తెలియనుంది. మరి ప్రచారంలోకి తీసుకొచ్చిన ఉల్టా పల్టా తో ఆడియోన్స్‌కు ఎలాంటి ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తారో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story