Bigg Boss 3 telugu: హిమజ సేఫ్ జోన్ లో.. ఈరోజు శిల్ప వెళ్ళిపోతుందా?

Bigg Boss 3 telugu: హిమజ సేఫ్ జోన్ లో.. ఈరోజు  శిల్ప వెళ్ళిపోతుందా?
x
Highlights

ఎప్పటికప్పుడు వీక్ కంటెస్టెంట్ గా భావించిన హిమజ వారం వారం నిలదొక్కుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచింది. ఈ వారం ఎలిమినేషన్ నుంచి ఆమె సేఫ్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. ఇక ఈరోజు శిల్ప హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతుందని భావిస్తున్నారు.

ఈసారి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్లు అంత కలిసిరాలేదనిపిస్తోంది. ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన హిమజ, పునర్నవి, శిల్ప, మహేష్ విట్టా, శ్రీముఖి లలో హిమజ సేఫ్ జోన్ లో ఉన్నట్టు నాగార్జున చెప్పారు. ఇక మిగిలిన వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ప్రశ్నగా మిగిలింది. దీనికి జవాబు ఈ సాయంత్రం దొరుకుతుంది.

అయితే, బిగ్ బాస్ సీజన్ 3 మొదట్నుంచీ ఒక రకంగా జరుగుతోంది. దాదాపుగా ప్రతివారం ఎలిమినేషన్ లో ఎవరు ఉన్నారనేది రెండు రోజుల ముందుగానే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. దానికి తగ్గట్టుగానే అవే ఫలితాలు ప్రతి ఆదివారం రాత్రీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా శిల్ప హౌస్ నుంచి బయటకు వెళ్లిపోనుందని చెబుతున్నారు. బిగ్ బాస్ లో శిల్ప చక్రవర్తి రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ముందుగా తమన్నా సింహాద్రి హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా వచ్చింది. వచ్చిన ఒక్క రోజులోనే రచ్చ మొదలు పెట్టింది. రెండో వారం ఆమె హౌస్ నుంచి వెళ్ళిపోయింది. ఇక ఈసారి కూడా శిల్ప వచ్చినదగ్గర నుంచి హౌస్ లో పెద్దగా అందరితో కలవడం లేదు. ఆమె హౌస్ లో ఆడే విధానం కూడా చాలా మంది ప్రేక్షకులకు నచ్చటం లేదని తెలుస్తోంది. అందుకే ఓటింగ్ లో అతి తక్కువ ఓట్లు ఆమెకి వచ్చాయన్తున్నారు.

ఇక పునర్నవి బిగ్ బాస్ ను గట్టిగా తిట్టినా.. ఆమె ను నాగార్జున సున్నితంగా మందలించి వదిలేశారు. నిజానికి షో చూసిన వారంతా పునర్నవి బిగ్ బాస్ టాస్క్ లపై మాట్లాడిన మాటలకు ఈ వారం నాగార్జున గట్టిగా ఆమె పై కోప్పదతారని భావించారు. కానీ..అటువంటిది ఏమీ జరగలేదు. పైగా రాహుల్, పునర్నవి ల మధ్య బ్రేకప్ లాంటి సీను ఒకటి క్రియేట్ చేశారు శనివారం ఎపిసోడ్ లో సో, ఆమె బయటకు వెళ్ళకపోవచ్చు. మహేష్ విట్టా ను గట్టిగా మందలించారు నాగార్జున. షూ పాలిష్ విషయంలో మహేష్ చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పడానికి తానె స్వయంగా షూ పాలిష్ చేసి మరీ ప్రపంచంలో ఏ పనీ తప్పు కాదు అంటూ క్లాసు పీకారు. అంత కష్టపడి అతన్ని మందలించి.. బయటకు పొమ్మని గేట్ తీయిన్చినా చివరికి నువ్వు రియలైజ్ అయిన విధానం నాకు నచ్చింది అంటూ చెప్పి కూల్ చేసారు. అందువల్ల మహేష్ కి కూడా ఎలిమినేషన్ ఇబ్బంది లేనట్టే అనిపిస్తోంది.

ఇక మిగిలింది శ్రీముఖి.. ఆమెను ఏకంగా గాడిద తొ పోలుస్తూ మరీ నాగార్జున చాలా గట్టిగా తిట్టారు. దీనితో ఆమె కూడా ఎలిమినేషన్ నుంచి సేఫ్ అని అనుకుంటున్నారు.

ఎలా లెక్కలు వేసినా.. అందుతున్న లీకులు.. సోషల్ మీడియాలో చెలరేగుతున్న వార్తలు.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ పరిస్థితులూ లెక్క వేస్తె శిల్పా చక్రవర్తి ఈరోజు ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ విషయం తేలాలంటే కొద్ది గంటలు వేచి చూడాల్సిందే!

ఈ రోజు బిగ్ బాస్ నుంచి ఎవరు వెళ్లిపోతారని అనుకుంటున్నారు?



Show Full Article
Print Article
More On
Next Story
More Stories