logo

Bigg Boss 3 Episode 52: దెయ్యాల ఆటా.. ఇదేమి చెత్త..బిగ్ బాస్ పై పునర్నవి ఫైర్!

Bigg Boss 3 Episode 52: దెయ్యాల ఆటా.. ఇదేమి చెత్త..బిగ్ బాస్ పై పునర్నవి ఫైర్!
Highlights

బిగ్ బాస్ రియాల్టీ షో లో మరో సాదా సీదా ఎపిసోడ్ ఇది. పునర్నవి ఈ ఎపిసోడ్ లో గేమ్ పై చిరాకు పడడమే కాకుండా బిగ్ బాస్ ను తీవ్రంగా దూషించింది.

ఒక్కోసారి బిగ్ బాస్ లో ఇచ్చే టాస్క్ లు అసలు విషయం హౌస్ లో ఉండేవాళ్లకు అర్థం కావు. వాళ్లకు అర్థం అయినట్టు చేస్తారు. వీక్షకులకు విసుగు తెప్పిస్తారు. ఈ ఎపిసోడ్ లో అదే జరిగింది. చిన్నపిల్లల ఆట లాంటి దెయ్యాల టాస్క్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ గా ఇచ్చాడు బిగ్ బాస్. రెండు గ్రూపులు.. ఒక గ్రూపు దెయ్యాలు.. రెండో గ్రూప్ మనుషులు.. దెయ్యలకి చెత్త టాస్క్ లు.. ఆ టాస్క్ పూర్తి చేస్తే ఆ దెయ్యం మనిషిగా.. టాస్క్ కి బలి అయిన వారు దెయ్యంగా మారతారు. నవ్వొస్తోంది కదూ.. పునర్నవికి కోపమే వచ్చింది. ఎంతలా అంటే.. బిగ్ బాస్ ని బుల్ షిట్ అంటూ తిట్టేంతగా.. ఆడుతున్న వాళ్ళకే అంత చికాకు వస్తే ఇక చూసే వాళ్లకు ఎంత చికాకు వస్తుందో చెప్పక్కర్లేదు. ఈ ఎపిసోడ్ గురించి పెద్దగా చెప్పుకోఅదానికి ఏమీ లేదు. మొదట్లో శ్రీముఖి..బాబా భాస్కర్ ల మధ్య రాజీ చర్చలు జరగడం ఒక్కటే చెప్పదగినది. ఇక టాస్క్ గురించి మాట్లాడాల్సింది ఏమీ లేదు. దానిని పునర్నవి ఎలాలైజ్ చేసి తేల్చి పారేసింది.

మొత్తమ్మీద మరో సదా సీదా ఎపిసోడ్ ముగిసింది.

ఈవారం బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళేది ఎవరని మీరు అనుకుంటున్నారు?

మీ అభిప్రాయం ఇక్కడ చెప్పండి.




లైవ్ టీవి


Share it
Top