Bigg Boss 3 Telugu Updates: శ్రీముఖి కోసం బిగ్ బాస్ బాబా భాస్కర్ ని టార్గెట్ చేశాడా?

Bigg Boss 3 Telugu Updates: శ్రీముఖి కోసం బిగ్ బాస్ బాబా భాస్కర్ ని టార్గెట్ చేశాడా?
x
Highlights

బిగ్ బాస్ రియాల్టీ షో మూడో సీజన్ ఇప్పుడు వేడెక్కింది. 17 మంది తో ప్రారంభమైన ఈ షో ప్రస్తుతం 6 గురు సభ్యులతో క్లైమాక్స్ కి చేరుకుంటోంది. ఒక్కో వారం ఒక్కోరు ఎలిమినేట్ కావడం.. మధ్యలో ఒకరిద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం.. వెళ్ళిన వారిలో కూడా ఒకరిద్దరు మళ్లీ రావడం ఇలా నడుస్తూ వందరోజుల పాటు సాగుతుంది బిగ్ బాస్.

బిగ్ బాస్ రియాల్టీ షో మూడో సీజన్ ఇప్పుడు వేడెక్కింది. 17 మంది తో ప్రారంభమైన ఈ షో ప్రస్తుతం 6 గురు సభ్యులతో క్లైమాక్స్ కి చేరుకుంటోంది. ఒక్కో వారం ఒక్కోరు ఎలిమినేట్ కావడం.. మధ్యలో ఒకరిద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం.. వెళ్ళిన వారిలో కూడా ఒకరిద్దరు మళ్లీ రావడం ఇలా నడుస్తూ వందరోజుల పాటు సాగుతుంది బిగ్ బాస్. ఈ సీజన్ లో ఇప్పటికే 90 రోజుల పైన పూర్తయిపోయాయి. ఇక ఒక ఎలిమినేషన్ వారం మాత్రమె ఉంది. తరువాతి వారం ఫైనల్స్.

బిగ్ బాస్ సీజన్ 3 లో హౌస్ మేట్స్ అందరూ గట్టిగానే కనిపించారు. వారికి అడ్డు అనుకున్న వారిని.. పోటీ అనుకున్న వారినీ గ్రూపులుగా ఏర్పడి వరుసగా బయటకు పంపారు. ఈ క్రమంలోనే అలీ ని కూడా బయటకు పంపారు. అయితే, మళ్లీ వైల్డ్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటివరకూ నడిపిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ 3 లో ఫేవరేట్ ఎవరంటే.. ఇంటా, బయటా కూడా సీజన్ ప్రారంభం నుంచీ శ్రీముఖి పేరే వినిపించింది. పైగా బిగ్ బాస్ కూడా శ్రీముఖి కచ్చితంగా ఫైనల్ కి వస్తుంది అన్నట్టుగానే గేమ్స్ ప్లాన్ చేస్తూ వచ్చిన విషయం చాలా సార్లు స్పష్టం అయింది. శ్రీముఖి ఫిజికల్ టాస్క్ ల విషయంలో మొదటి నుంచి కచ్చితమైన స్టాండ్ తోనే ఉంది. ఒకటి రెండు సందర్భాలలో ఫిజికల్ టాస్క్ ల సమయంలో అలీ వ్యవహార శైలిని, రాహుల్ వ్య్వహారాల్నీ తీవ్రంగా ఖండించింది కూడా. ఇక ఆమెతో పోటీ పడగల హౌస్ మెట్ గా బాబా భాస్కర్ మెల్లగా ఎదిగారు. ఇప్పుడు బాబా భాస్కర్ శ్రీముఖికి గట్టి పోటీదారుగా మారిపోయారు. శ్రీముఖి తొ కలిసి ఆడుతున్నట్టు కనిపిస్తున్నా.. అవసరం అయితే, శ్రీముఖిని దాటి పోవడానికి ఏదైనా చేస్తారనే అభిప్రాయం బిగ్ బాస్ కి వచ్చేసినట్టు కనిపిస్తోంది.

బిగ్ బాస్ శ్రీముఖి కి అనుకూలంగా ఉన్నాడు. ఇప్పుడు శ్రీముఖి కోసం బాబా భాస్కర్ ను నిలువరించాలని చూస్తున్నాడనిపిస్తోంది. అందుకే బాబా భాస్కర్ ను బాబ్ మాస్కర్ గా ప్రాజెక్ట్ చేయడానికి చాలానే ప్రయత్నాలు జరిగాయి. కానీ, అన్నిటిని తప్పించుకుని ఆయన ఇప్పటివరకూ వచ్చారు. బయట ప్రేక్షకులు కూడా బబ్బ భాస్కర్ కి అభిమానులు పెరిగిపోయారు. బాబా భాస్కర్, శ్రీముఖి లకు మద్దతుగా వస్తున్న ఓట్లలో తేడా పెద్దగ లేకపోవడం బిగ్ బాస్ ను కలవరపెడుతోందని తెలుస్తోంది. ఇప్పడు టాప్ 5 లో బాబా ఉంటె కనుక శ్రీముఖి, బాబా భాస్కర్ ల మధ్య ఓట్లు చీలిపోయి మధ్యస్తంగా వేరే హౌస్ మేట్ కి లాభం చేకూర్చే అవకాశం ఉందని బిగ్ బాస్ దర్శకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా బాబా భాస్కర్ ని బయటకు పంపించే దిశలో బిగ్ బాస్ టీం పావులు కలుపుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు అలీ, బాబాల మధ్య ఫిజికల్ టాస్క్ కూడా అందులో భాగమే అని వినిపిస్తోంది.

ఇదే కథనాన్ని ఇంగ్లీష్ లోనూ చదవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పటివరకూ బయటకు వస్తున్న పుకార్ల ప్రకారం బిగ్ బాస్ నుంచి బాబా భాస్కర్ ను బయటకు పంపించే టాస్క్ లో బిగ్ బాస్ టీం ఉందని తెలుస్తోంది. అదే నిజమైతే వచ్చే వారం బాబాను బయటకు పంపించేందుకు భారీ ప్రణాళికే ఈ రెండురోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా బాబా భాస్కర్ ని మోసగాడిగా.. ముసుగు వేసుకున్న వాడిగా నిలబెట్టే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం. మరి ఏం జరగనుందో రాబోయే ఎపిసోడ్ లలో తేలిపోతుంది. అంత వరకూ షో చూస్తూ ఎంజాయ్ చేయడమే మన పని ఏమంటారు? ఎందుకంటే, బిగ్ బాస్ లో ఏదైనా జరగోచ్చు మరి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories