Bigg Boss 3 Telugu Updates: అలీకి ఛాన్స్ దొరికింది.. బాబా భాస్కర్ ను కుమ్మేస్తున్నాడు!

Bigg Boss 3 Telugu Updates: అలీకి ఛాన్స్ దొరికింది.. బాబా భాస్కర్ ను కుమ్మేస్తున్నాడు!
x
Highlights

బిగ్ బాస్ 3 లో కండలతో మొదట్నుంచీ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నాడు అలీ. ఒకసారి ఎలిమినేట్ అయి మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి వచ్చాడు. వచ్చిన...

బిగ్ బాస్ 3 లో కండలతో మొదట్నుంచీ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నాడు అలీ. ఒకసారి ఎలిమినేట్ అయి మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి సరైన ఫిజికల్ టాస్క్ ఒక్కటీ తగల్లేదు. పైగా, సేఫ్ గేమ్ ఆడే ఛాన్స్ దొరకడంతో ఆ దిశలో ఆడుతూ.. అందరితోనూ పాట ఆట చూపించు అనిపించుకుంటూ వస్తున్నాడు.

ఇక మరో రెండు వారాల్లో బిగ్ బాస్ పూర్తి కాబోతోంది. 17 మందితో మొదలైన షో లో ఇప్పడు ఆరుగురు మిగిలారు. ఆరుగురిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. పరిస్థితిలో ఫైనల్స్ వరకూ ఉండే ఆ ఐదుగురు ఎవరో తేల్చడానికి బిగ్ కొత్త ఆట మొదలెట్టించాడు. దీని ప్రకారం హౌస్ మేట్స్ కి బ్యాటరీలు ఇచ్చాడు. ఆబ్యాటరీలు చార్జ్ కావాలంటే టాస్క్ ఆడాలి. దానికి ఇద్దరు గంట కొట్టాలి. గంట కొట్టిన ఇద్దరికీ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. ఈ టాస్క్ గెలిచిన వారికి బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయేసరికి ఎవరి బ్యాటరీ ఎక్కువ చార్జి లో ఉంటే వాళ్ళు ఫినాలేకి డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. మిగిలిన ఐదుగురు ఎలిమినేషన్ కి నామినేట్ అవుతారు.

ఇందులో భాగంగా నిన్నటి(21.10.2019) ఎపిసోడ్ లో బాబా భాస్కర్, అలీలు ఒక దశలో పోటీ పడే పరిస్థితి వచ్చింది. ఒక తొట్టిలో ఇద్దరూ పూలను నాటాలి. ఒకరి పూలు ఒకరు పీక్కోవచ్చు. బజర్ మొగేసరికి ఎవరి పూలు ఎక్కువ తొట్టిలో ఉంటాయో వారు గెలిచినట్టు. ఇదీ టాస్క్. పూర్తి ఫిజికల్ స్టామినా ప్రదర్శించాల్సిన ఈ టాస్క్ ఆలీకి సరిగ్గా సమయానికి దొరికింది.

ఇక అలీ రెచ్చిపోతున్నాడు. పూలు నాటుతున్న బాబా ను తోసి పూలన్నీ లాగి బయటకు విసిరేసాడు. తరువాత బాబా కూడా శ్రమించి అలీ పూలను లాగేశాడు. ఇప్పుడు బాబా మళ్లీ తన పూలను రక్షించుకునే ప్రయత్నం లో ఉన్నాడు. కానీ, ఈ క్రమంలో అలీ బాబా మీద తన ప్రతాపాన్ని తీవ్ర స్థాయిలో చూపించాడు. రెండోసారి షో లోకి వచ్చిన దగ్గర నుంచి బాబా భాస్కర్ మీద పీకలదాకా కోపంతో రగిలిపోతున్న అలీ కి సరైన సమయం ఇదే అనిపించినట్టుంది. ఇదే సందుగా భావించాడో.. లేకపోతె టాస్క్ కంప్లీట్ చేయాలనే కసితో ఆడుతున్నాడో కానీ, బాబా భాస్కర్ ని మాత్రం ఓ ఆట ఆడేసుకుంటున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో ఈ పోరాటాన్ని కొద్దిగా చూపించి ఆపారు.

ఇప్పుడు ఈరోజు పోరాటం మరింత భీకరంగా ఉండేలా కనిపిస్తోంది. ప్రోమోలో ఈ విషయం స్పష్టం అయింది. ఒక పక్క మిగిలిన వారు వారిస్తున్నా అలీ వినకుండా బాబా మీద విరుచుకు పడుతున్నాడు. అలీ ఎంతగా మీద పడిపోతున్నా, బాబా కూడా పట్టువదల కుండా ప్రయత్నిస్తున్నాడు. ఒక దశలో బాబాను అలీ తన తలతో బలంగా కుమ్మేయడం ప్రోమోలో స్పష్టంగా కనిపించింది. మరి అది ఎంత వరకూ నిజమో తేలాలంటే కొద్ది సేపట్లో 22.10.2019 రాత్రి 9:30 వరకూ వేచి చూడాల్సిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories