Top
logo

Bigg Boss 3 Telugu News: పునర్నవి బాడీ డ్యామేజ్ అంటోంది.. ఎందుకబ్బా?

Bigg Boss 3 Telugu News: పునర్నవి బాడీ డ్యామేజ్ అంటోంది.. ఎందుకబ్బా?
X
Highlights

పునర్నవి భూపాలం.. ఇప్పుడు ఈ పేరు తెలీని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 3 లో మొన్నటి వరకూ ఆమె ఓ గ్లామర్ డాల్. అసలు ఆట ఆడకుండా.. కేవలం గ్లామర్ తో.. తన తెలివి తేటల్తో పదకొండు వారాలు హౌస్ లో నెగ్గుకువచ్చింది.

పునర్నవి భూపాలం.. ఇప్పుడు ఈ పేరు తెలీని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 3 లో మొన్నటి వరకూ ఆమె ఓ గ్లామర్ డాల్. అసలు ఆట ఆడకుండా.. కేవలం గ్లామర్ తో.. తన తెలివి తేటల్తో పదకొండు వారాలు హౌస్ లో నెగ్గుకువచ్చింది. ఎన్నోసార్లు ఎలిమినేషన్స్ కి నామినేట్ అయినా ఆమె తన ఆటిట్యూడ్ తోనూ , బిగ్ బాస్ కి కావాల్సిన కంటెంట్ ఇచ్చే విధంగా వ్యవహరించడం తోనూ షో లో తాను ఓ ముఖ్యమైన వ్యక్తి లా నిలిచింది. ప్రేక్షకులు ఆమె వ్యవహార శైలితో ఎంత విసిగిపోయి ఓట్లేసిన.. చివఱికి ఆమె ఎలిమినేషన్ నుంచి బయటకు వచ్చేసేది. ఇక రాహుల్ తో ఎదో ఉండనే ప్రచారం తో పాటు.. బిగ్ బాస్ కూడా అదేవిధంగా ఎపిసోడ్ లు వదలడంతో పునర్నవి చివరి వరకూ ఉంటుందని భావించారు. అయితే, అనుకోకుండా.. పదకొండో వారంలో ఆమెను బయటకు పంపించేశారు.

ఇదిలా ఉంటె, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వారంతా ఇంటర్వ్యూలు.. ఇతర షోలతో బిజీ అయిపోవడం సహజంగా జరుగుతుంటుంది. కానీ, పునర్నవి మాత్రం తనకు విశ్రాంతి కావాలంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది. ఆమె షో నుంచి బయటకు వచ్చి రెండు రోజులు గడిచి పోయినా బయట ఎవరికీ అందుబాటులో లేదు. అయితే, తాజాగా ఆమె తన సోషల్ మీడియా స్నేహితులకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్ట్ చేసింది. మామూలుగా అయితే ఇందులో చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ.. ఆమె ఆ పోస్టులో వాడిన పదాలే ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.

''నా మనసు, శరీరానికి జరిగిన డ్యామేజీ నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్నా.. బట్.. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ పండుగ ముందు ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది'' అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు ఆమె అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఆమె మనసుకు కలిగిన డ్యామేజీ వరకూ అందరూ కొంతవరకూ పట్టించుకునే పని లేదు. ఎందుకంటే.. హౌస్ లో కొన్ని ఎపిసోడ్ లలో ఆమె రిలేషన్స్ షిప్ కి సంబంధించిన చర్చలు జరగడం వంటివి ఎప్పుడన్నా ఆమె మనసును గాయపరిచి ఉండొచ్చు. కానీ, శరీరానికి డ్యామేజీ అనే పదమే అందరికీ మింగుడు పడడం లేదు. ఎందుకంటే.. ఆమె ఎంత పెద్ద ఫిజికల్ టాస్క్ ఇచ్చినా లైట్ గానే తీసుకుంది. నామినేషన్ కి వెళ్ళడానికి సిద్ధపడింది కానీ, ఎప్పుడూ పది శాతం కూడా ఎఫర్ట్ పెట్టలేదు. నిజానికి ప్రేక్షకులకు విసుగు తెప్పించింది కూడా ఆ విధానమే. ఎప్పుడూ ఆడటానికి సిద్దము గా లేకుండా.. నన్నెలా బయటకు పంపిస్తారో చూద్దాం అన్నట్టుగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్ తో ఆమె ఎలా శారీరకంగా ఇబ్బంది పడింది అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బిగ్ బాస్ లో ఇంకేమైనా జరిగిందా అనే అనుమానాలో తలెత్తుతున్నాయి.

ఏది ఏమైనా పునర్నవి ఈ పోస్ట్ తో మళ్ళీ అందరిలోనూ పెద్ద కుతూహలాన్ని రేకెత్తించింది. అన్నట్టు పునర్నవి ఈపోస్ట్ కు జత చేసిన ఫోటో చూస్తే.. ఆమె గ్లామర్ ఏమైపోయిందబ్బా అనిపించేలా ఉండడం కొసమెరుపు.

ఈవారం బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళతారని మీరు భావిస్తున్నారు?Next Story