Bigg Boss3 telugu Eliminations: నామినేట్ అయిన మొదటిసారే ఎలిమినేట్ కాబోతున్నాడా?

Bigg Boss3 telugu Eliminations: నామినేట్ అయిన మొదటిసారే ఎలిమినేట్ కాబోతున్నాడా?
x
Highlights

బిగ్ బాస్ ఎడో వారం ఎలిమినేషన్ అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటివరకూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టే ఎలిమినేషన్స్ జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సారి బిగ్ బాస్ నుంచి అలీ రెజా వెళ్లిపోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏం జరగబోతోందో మరి కొద్ది గంటల్లో తేలనుంది.

బిగ్ బాస్ లో సంచలనం నమోదు కాబోతోందా? అంటే అవుననే సమాధానం దొరుకుతోంది. ఇంత వరకూ బిగ్ బాస్ షోలో సోషల్ మీడియాలో హల్ చల్ చేసినట్టే ప్రతివారం ఎలిమినేషన్ జరుగుతోంది. ఇప్పుడు కూడా అదే జరిగితే ఈ సీజన్ లో తొలి సంచలనం నమోదు అయినట్టే. బిగ్ బాస్ హౌస్ సీజన్ 3 లో ఇప్పటివరకూ సాదాసీదాగా సాగిపోతోంది. దాదాపు సగం రోజులు పూర్తి కావస్తున్నాయి. హౌస్ మేట్స్ అందరూ తమ పరిధిలో చక్కని గేమ్ ఆడుతున్నారు. ప్రతి వారం ఒకరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేస్తారనే సంగతి తెలిసిందే. అయితే, పోయిన వారంలో అనూహ్యంగా ఎవర్నీ ఎలిమినేట్ చేయలేదు. దీంతో ఏడో వారం అయిన ఈ వారం ఎవర్ని ఎలిమినేట్ చేస్తారనే అంశం ఉత్సుకతని కలిగిస్తోంది.

ఈవారం ఎలిమినేషన్స్ కి రాహుల్ సిప్లిగంజ్, మహేష్ విట్టా, శ్రీముఖి, రవికృష్ణ, అలీరేజా నామినేట్ అయ్యారు. శనివారం ఎపిసోడ్ లో రాహుల్ సిప్లిగంజ్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు. ఇక నలుగురు మహేష్ విట్టా, శ్రీముఖి, రవికృష్ణ, అలీరేజా నలుగురు మిగిలారు. వీరంతా గట్టిగా పోటీ పడుతున్నవారే కావడంతో ఎవరు ఈవారం ఎలిమినేట్ కానున్నారనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది.

వెళ్ళిపోయేది అతనేనా?

ప్రస్తుతం నడుస్తున్న అంచనాల ప్రకారం మహేష్ విట్టా లేదా అలీ రెజా హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానిలోనూ అలీ రెజా కచ్చితంగా ఈరోజు ఎలిమినేట్ కాబోతున్నాడని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి అలీ రెజా బిగ్ బాస్ లో మొదటి నుంచి స్ట్రాంగ్ కాంటెస్టంట్ గా వున్నాడు. గత ఆరువారాల్లోనూ అతను ఒక్కసారి కూడా ఎలిమినేషన్ కి చేరుకోలేదు. కానీ, అనూహ్యంగా అదేకారణంతో ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యాడు. ఇప్పుడు మొదటి సారి నామినేట్ అయిన అలీ నేరుగా హౌస్ నుంచి వేల్లిపోనున్నాడని బలంగా వినిపిస్తోంది. ఎగ్రేసివ్ గా ఆడుతున్న అలీకి అదే ఎలిమినేషన్ కి కూడా కారణం కాబోతోంది. మొన్న జరిగిన దొంగల టాస్క్ లో హౌస్ మేట్స్ తో ఆటను ప్రవర్తించిన విధానానికి ప్రేక్షకులు కూడా కొంత అసహనానికి లోనయ్యారు. అదేవిధంగా కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా అతను వితిక, శిల్ప లతో గొడవ పడిన విషయంలోనూ ఎవరూ సంతృప్తిగా లేరు. దీంతో అతనికి ఓట్లు తక్కువ వచ్చినట్టు తెలుస్తోంది. అదీ కాకుండా బిగ్ బాస్ రెండో సీజన్ లో ప్రిన్స్ ఒక్కసారి కూడా ఎలిమినేషన్ లోకి వెళ్ళలేదు. కానీ, వెళ్ళిన ఒక్కసారే ఎలిమినేట్ అయిపోయాడు. ఇదే సెంటిమెంట్ అలీ విషయంలో రిపీట్ అయ్యే అవకాశాలు భారీగానే కనిపిస్తున్నాయని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.

మొత్తమ్మీద ఇప్పటివరకూ ప్రచారంలో ఉన్నవారే ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇప్పుడు అలీ రెజా పేరు ఒక్కటే గట్టిగా నిన్నటి నుంచి ప్రచారంలో నిలిచింది. దీంతో అలీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, అసలు విషయం తేలాలంటే కొద్దిగంటలు వేచి చూడాల్సిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories