Bigg Boss 3 telugu Gossips: బిగ్ బాస్ 'నామినేషన్లు రద్దు.. రీఎంట్రీ ముద్దు' అనబోతున్నాడా?

Bigg Boss 3 telugu Gossips: బిగ్ బాస్ నామినేషన్లు రద్దు.. రీఎంట్రీ ముద్దు అనబోతున్నాడా?
x
Highlights

బిగ్ బాస్ సీజన్ 3 రసకందాయంలో పడింది. 9 వ వారంలోకి అడుగుపెట్టిన ఈ వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో లో ఈ వారం సంచలనాలు చోటు చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఎలిమినేషన్స్ లేకుండా.. ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన వారిలో ఒకరు లేదా ఇద్దర్ని రీ ఎంట్రీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పుడు తెలుగులో మూడో సీజన్ సందడి చేస్తోంది. ఈ షో లో ప్రతి వారం ఒకర్ని హౌస్ నుంచి బయటకు పంపించే ప్రక్రియ జరుగుతుంది. దానికోసం ప్రతి సోమవారం నామినేషన్స్ లోకి కొంత మందిని పంపిస్తారు. తరువాత ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఇంటినుంచి ఆదివారం సాగనంపుతారు. ఇదంతా తెలిసిందే కదా. కానీ, ఈ సోమవారం నామినేషన్ ల ప్రక్రియ మంగళవారమూ కొనసాగనుంది. హలో..హలో.. పేరుతొ త్యాగాల ఎపిసోడ్ నడిపించిన బిగ్ బాస్.. దానిని ఇంకా మంగళవారమూ నడిపిస్తారు. ఎందుకంటే, సోమవారం అందరి తోనూ హలో హలో ఆట పూర్తి కాలేదు.

ఈ హలో హలో రాహుల్, పునర్నవిల ప్రేమ పులిహోర కి ముద్దులు, హగ్గుల తాలింపు వేశారు. ఇక చెల్లెమ్మ సెంటిమెంట్ తో హిమజ, వరుణ్ ల అన్నచెల్లెల్ల అనుబంధాన్ని పంచేశారు. దీంతో ఎపిసోడ్ పూర్తయిపోయింది. ఎపిసోడ్ చివరికి వచ్చేసరికి మహేష్ విట్ట ఒక్కడే నామినేషన్ లో ఉన్నాడు. ఇక సోమవారం తెరుచుకోవాల్సిన ఓటింగ్ ప్రారంభం కాలేదు.

ఈ వారం ఎలిమినేషన్స్ లేవా?

పరిస్థితి అలానే అనిపిస్తోంది. ఈవారం హౌస్ నుంచి ఒక్కరు కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేవు. నామినేషన్ లో ఇప్పటికి ఒక్కరే ఉన్నారు. పరిస్థితి చూస్తే మంగళవారం ఇంకొకరు మాత్రమె నామినేషన్ లిస్టు కేక్కేలా ఉన్నారు. ఇద్దరి మధ్య ఓటింగ్ పెట్టె సంప్రదాయం బిగ్ బాస్ కి లేదు. సొ, ఈ వారం ఎలిమినేషన్ లేనట్లే అని బిగ్ బాస్ గురించి తెల్సిన ప్రతిఒక్కరూ అంటున్నారు.

ఇద్దరు రీ ఎంట్రీ?

ఇక పొతే, ఈ వారంలో హౌస్ నుంచి ఇప్పటికే బయటకు వెళ్ళినవారిలో ఒకరు, లేదా ఇద్దరు తిరిగి హౌస్ లోకి వచ్చే అవకాశాన్ని కల్పించేలా ఉన్నారు. దానికోసం ఈరోజు ఓటింగ్ ప్రక్రియ మొదలు పెడతారని అనుకుంటున్నారు. గత సీజన్ లో నూతన్ నాయుడు, శ్యామల ఇద్దరినీ హౌస్ లోకి ప్రేక్షకుల ఓటింగ్ తో రీ ఎంట్రీ కల్పించారు. ఇప్పుడు కూడా అదే తరహాలో రీ ఎంట్రీ ఉంటుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అదే కనుక నిజమైతే, అలీ రెజా, రోహిణి ఇద్దరికీ తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. కొంత వరకూ అదే నిజం కూడా. ఓటింగ్ పెడితే కచ్చితంగా అలీ రెజా టాప్ ఓట్లు సాధిస్తాడు. ఆ విషయంలో అనుమానమే లేదు. ఇక రెండో వ్యక్తీ విషయంలో ఎక్కువ అవకాశాలు రోహిణి కే ఉన్నాయి. ఆమె ఎలిమినేషన్ ఎవరూ ఊహించని విధంగా జరిగింది. అందుకే ఆ సెంటిమెంట్ తో ఆమెకు ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని ఓ అంచనా.

మొత్తమ్మీద తొమ్మిదో వారం లో బిగ్ బాస్ లో ఎదో ఒక సంచలనం కచ్చితంగా చోటుచేసుకునే అవకాశాలను కొట్టి పాదేయాలెం. విషయం తేలాలంటే ఈరోజు రాత్రి 9:30 వరకూ వేచి చూడాల్సిందే!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories