Bigg Boss3 Telugu Gossip: అదుగో అలీ వస్తున్నాడు.. ఇక చూస్కోండి!

K V D Varma
Updated on: 26 Sept 2019 1:32 PM IST
Bigg Boss3 Telugu Gossip: అదుగో అలీ వస్తున్నాడు.. ఇక చూస్కోండి!
X

బిగ్ బాస్ ప్రేక్షకులతో ఆడుకుంటున్నాడు. హౌస్ మేట్స్ తో ఆడించడం కొంచెం కష్టం అనిపించినట్టుంది.. ఇక లాభం లేదనుకుని వారం రోజులుగా ప్రేక్షకులతో ఆడుకుంటున్నాడు. మొన్నటికి మొన్న రాహుల్ ఎలిమినేట్ అని ప్రకటించి.. తూచ్ ఇదంతా ఫన్ కోసం.. ఇది ఉత్తుత్తి ఎలిమినేషన్ అంటూ మళ్లీ రాహుల్ ను లోపలి తోసేశాడు.. ఇక ఇప్పుడు ఆ మధ్య బయటకు గెంటేసిన స్ట్రాంగ్ కాంటెస్టెంట్ అలీ రేజాను తిరిగి షోలో కి తీసుకురాబోతున్నాడు.

ఏదైనా బిగ్ బాస్ అంటే బోలెడంత హంగామా ఉండాలి కదా. అలీ వేల్లిపోయినాకా అది కాస్తా తగ్గిపోయింది. ఇక ఈ వారం రవికృష్ణ వెళ్లిపోతాడని అందరూ అనుకుంటున్నారు. ఆ లోటు బ్యాలెన్స్ చేయాలంటే అలీరేజా లాంటి వారుండాలని ఫిక్స్ అయినట్టున్నాడు బిగ్ బాస్. ఈరోజు అలీరేజా ను తిరిగి హౌస్ లోకి తీసుకువస్తున్నాడు. ఈ మేరకు స్టార్ మా ప్రోమో రిలీజ్ చేసింది. వచ్చే వ్యక్తి స్పష్టంగా వీడియోలో కనపడకుండా జాగ్రత్తపడినా.. ఆ నడక.. ఫిజిక్ అన్నీ చూస్తె ఆలీరేజా అని స్పష్టంగా తెలుస్తోంది.

అయినా, సస్పెన్స్ లో ఉంచాలని బిగ్ బాస్ అనుకుంటే.. మనం ఎందుకు అలీ అని ఫిక్స్ అవ్వాలి? కొద్దిసేపు ముసుగు వేసుకుందాం. రాత్రికి ఎటూ తేలిపోతుంది కదా.

అయితే, చిన్న ట్విస్ట్ ఏమిటంటే.. ప్రోమోలో ఉన్నది అలీ అని ప్రేక్షకులు అందరూ భావిస్తున్నారు. ఈ వీడియో స్టార్ మా రిలీజ్ చేసిన వెంటనే అందరూ కామెంట్లు తెగ పెడుతున్నారు. కొందరేమో ఓట్లేసి బయటకు పంపిస్తే.. నీ షో ఎవరూ చూడటం లేదని లోపలి తీసుకు వస్తావా అంటూ మంది పడుతున్నారు. కొందరేమో అపుడు అలీని అన్యాయంగా పంపించారు. మంచి కంటెస్టెంట్ ని మళ్లీ తీసుకు వచ్చి షో కి మంచి కలరింగ్ ఇస్తున్నారంటున్నారు. మొత్తమ్మీద అలీ అని అందరూ ఫిక్స్ అయ్యారు. చూద్దాం రాత్రికి ఏం జరుగుతుందో?



K V D Varma

K V D Varma

Next Story