Top
logo

Bigg Boss 3 Telugu Episode 95: పోటీదార్ల సరదా తీరుస్తున్న బిగ్ బాస్!

Bigg Boss 3 Telugu Episode 95: పోటీదార్ల సరదా తీరుస్తున్న బిగ్ బాస్!
Highlights

బిగ్ బాస్..తెలుగు సీజన్ 3 చివరి దశకు చేరుకుంటోంది. ఆరుగురు సభ్యులు ఉన్న హౌస్ లో నుంచి ఈ వారం ఒక్కరు వెళ్ళిపోతారు.

వరల్డ్ ఫేమస్ రియాల్టీ షో బిగ్ బాస్.. తెలుగు సీజన్ 3 చివరి దశకు చేరుకుంటోంది. ఇంకొక్క వారమే ఎలిమినేషన్ ఉంటుంది. ఆరుగురు సభ్యులు ఉన్న హౌస్ లో నుంచి ఈ చివరి వారం ఒక్కరు వెళ్ళిపోతారు. మిగిలిన ఐదుగురు వచ్చే వారం టైటిల్ కోసం పోరాటం చేస్తారు. అయితే, ఇప్పటికే ఈ వారం ఆరుగురిలో రాహుల్ టికెట్ టు ఫినాలే గెల్చుకుని సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాబా భాస్కర్, శివజ్యోతి, శ్రీముఖి, అలీ రెజా, వరుణ్ సందేశ్ ల మధ్య ఎలిమినేషన్ కోసం పోటీలు జరుగుతున్నాయి. వీరిలో ఈ వారం ఒకరు వెళ్ళిపోతారు. ఇక ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి కష్టతరమైన పరీక్షలే పెట్టాడు. వాటిని విజయవంతంగా పూర్తి చేసి అందరూ అందరే అనిపించుకున్నారు హౌస్ మేట్స్.

శివజ్యోతి, శ్రీముఖి, బాబా భాస్కర్.. మధ్యలో కాకరకాయ!

శివజ్యోతి, శ్రీముఖి, బాబా భాస్కర్ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. దానిలో అంశం కాకరకాయ కూర. కొంత సేపటికి అదే కూర కోసం వాగ్యుద్ధం నడిచింది. బాబా భాస్కర్, శ్రీముఖి కాకర కాయ ఫ్రై చేసుకుని తేనేశారని శివజ్యోతి వాళ్ళపై మండిపడింది. అసలు నాకిష్టమైన కాకరకాయ కూర నాకు పెట్టకుండా మీరెలా తినేస్తారు అంటూ వాదనకు దిగింది. పడి పీసులే వచ్చాయి.. అయినా బాగోలేదు కూడా అంటూ బాబా నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా శివజ్యోతి తగ్గలేదు. రకరకాలుగా మాట్లాడి రచ్చ్ చేసింది. దీంతో శ్రీముఖి కాకరకాయలు తీసి మళ్లీ కూర చేయడానికి సిద్ధం అయింది. అయితే, ఈసారి శివజ్యోతి వద్దు.. సాయంత్రం నేను చేసుకుంటా అంటూ చెప్పింది. దీంతో శ్రీముఖికి కోపం వచ్చి కాకరకాయలు అక్కడ విసిరేసి వెళ్ళిపోయింది.

ఇదిలా నడుస్తుండగా బిగ్ బాస్ అందరికీ కొత్త టాస్క్ ఇచ్చాడు. నామినేట్ బాక్స్ లో అందర్నీ నిలబడమని.. ఒక్కో బజర్ కు ఒక్కో టాస్క్ చెబుతూ.. ఎవరికిష్టమైనది వారు ఎంచుకోవచ్చన్నాడు. దానితో వరుణ్, బాబా, శివజ్యోతి, అలీ, శ్రీముఖి ఈ వరుసలో వచ్చిన టాస్క్ లు ఎంచుకున్నారు.

రింగ్ ఛాలెంజ్..వరుణ్ ఎంపిక!

గార్డెన్ ఏరియాలో ఒక రింగ్ పెట్టారు. దానితో పాటు ఒక పోల్ కూడా ఇచ్చారు. రింగ్‌కు మంట పెట్టారు. పోల్ ఒకవైపు మంట అంటించాలి. అయితే, పోల్ మంట అంటుకున్న వైపు రింగుకు తాకించకుండా దాని లోపల పెట్టి పోల్ మరో చివరన పట్టుకోవాలి. ఒకవేళ రింగుకు పోల్ తాకినట్టయితే రింగు మొత్తానికి మంట అంటుకుంది. ఈ పోటీని వరుణ్ ఎన్నుకున్నారు.

పోలెక్కి నిలబడాలి..బాబా రెడీ!

రెండో ఛాలెంజ్‌ గార్డెన్ ఏరియాలో ఉన్న లావుపాటి పోల్‌‌ని ఎక్కి టాస్క్ ముగిసే వరకు కాలుని కింద పెట్టకుండా పట్టుకుని ఉండాలి. దానికి కాళ్లు పెట్టుకునే వీలుండేలా రెండు చిన్న మెట్లులా ఇచ్చారు. ఒక్కో మెట్టుపై ఒక్కో కాలు పెట్టి ఆ పోల్‌ని రెండు చేతులతో కౌగిలించినట్టు పట్టుకోవాలి. బాబా భాస్కర్ ఈ ఛాలెంజ్ కు సై అన్నారు.

కోడిగుడ్డు-పాలు కలిపి తాగాలి.. శివజ్యోతి సిద్ధం!

గ్లాసుడు పాలలో ఒక కోడిగుడ్డు పగలగొట్టి వేసుకుని బాగా కలిపి దాన్ని తాగాలి.. ఇదీ ఈ టాస్క్. ఎండ్ బజర్ మోగేంత వరకు అలా తాగుతూనే ఉండాలి. చాలా కష్టతరమైన ఈ ఛాలెంజ్‌ను శివజ్యోతి తీసుకుంది.

ఇసుక మూతలు తాళ్ళతో మోయాలి.. సరైనోడు అలీనే!

ఒక పోల్‌కి వేలాడదీసి ఉన్న రెండు ఇసుక మూటలు రెడ్ కలర్ లైన్ కిందికి రాకుండా చూసుకుంటూ తాళ్లను చేతులతో పట్టుకోవాలి. టాస్క్ ముగిసే సమయం వరకు ఇలానే ఉండాలి. అంతేకాదు, ఈ ఛాలెంజ్‌ను నిలబడి మాత్రమే చేయాలి. దీనికి సరైనోడిని నేనే అంటూ అలీ ఎంపిక చేసుకున్నాడు.

చేప తో కల్సి మౌతార్గాన్ సంగీతం.. శ్రీముఖికి తప్పలేదు!

శ్రీముఖికి చేపతో ఛాలెంజ్ వచ్చింది. ఒక పెద్ద చేప నోటిలో మౌతార్గాన్ తో ఉంది. ఆ మౌత్ ఆర్గాన్ కదపకుండా శ్రీముఖి ఊదాలి. అంటే, మౌత్ ఆర్గాన్ చేప, శ్రీముఖి ఇద్దరి నోళ్లలో ఉండాలి. శ్రీముఖి కాస్త అసహ్యం పడుతూనే తప్పక చేపను ఒళ్లో పెట్టుకుని మౌత్ ఆర్గాన్ ఊదింది.

మొత్తమ్మీద ఈ అన్ని టాస్క్ లు అన్నీ విజయవంతంగా ఎక్కడా సమస్యలు రాకుండా పూర్తి చేశారు హౌస్ మేట్స్. దీంతో అందరూ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు కనిపించారు. ఎవరూ కూడా కష్టానికి భయపడలేదు. అన్నీ కష్టంతో కూడిన ఆటలు అయినప్పటికీ, వాటిని సరదాగా తీసుకుని పూర్తి చేశారు. ప్రేక్షకులకు మాత్రం కావలసినంత వినోదం అందిందనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు ఆసక్తి కలిగించింది. ఎవరైనా టాస్క్ చేయలేక ఆగిపోతారేమో అనేంత ఉత్సుకత నింపింది. మరి ఇప్పుడు ఎవరిని బయటకు పంపేందుకు ఒతేస్తారో ప్రేక్షకులు చూడాల్సిందే!


Next Story