Bigg Boss 3 Telugu Episode 93 : ఫినాలే కి టికెట్ ఎవరికో.. అసలు హంగామా మొదలైంది!

Bigg Boss 3 Telugu Episode 93 : ఫినాలే కి టికెట్ ఎవరికో.. అసలు హంగామా మొదలైంది!
x
Highlights

బిగ్ బాస్ లో అసలు కథ మొదలైంది. షో చివరి దశకు చేరుకోవడంతో టాస్క్ లు కూడా కష్టతరంగా మారుతున్నాయి. ఈ ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేషన్ కి నామినేట్ అవుతారు.. ఎవరు నేరుగా ఫినాలేకి అర్హత పొందుతారు అనే దానిపై టాస్క్ లు ఇచ్చారు.

బిగ్ బాస్ లో అసలు కథ మొదలైంది. షో చివరి దశకు చేరుకోవడంతో టాస్క్ లు కూడా కష్టతరంగా మారుతున్నాయి. ఈ ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేషన్ కి నామినేట్ అవుతారు.. ఎవరు నేరుగా ఫినాలేకి అర్హత పొందుతారు అనే దానిపై టాస్క్ లు ఇచ్చారు. వితిక ఒక్కసారిగా దూరం కావడంతో దిగాలుగా ఉన్న వరుణ్ ను హౌస్ మేట్స్ ఓదార్చారు. అతని దిగులు పోగొట్టే ప్రయత్నం చేశారు. ఇవీ ఈ ఎపిసోడ్ విశేషాలు.

టికెట్ తో ఫినాలే!

ఇది మెయిన్ టాస్క్.. దీనిలో ఆరు టాస్క్ లు ఉంటాయి.. దీనికోసం బిగ్ బాస్ ఆరుగురు ఇంటి సభ్యులకు బ్యాటరీ బ్లాక్ లు ఇచ్చారు. వారిలో శివజ్యోతికి 60% ఉన్న బ్లాక్, వరుణ్ తీసిన బ్లాక్‌పై 40%, శ్రీముఖి తీసిన బ్లాక్‌పై 50%, అలీ తీసిన బ్లాక్‌పై 70%, బాబా భాస్కర్ బ్లాక్‌పై 40%, రాహుల్ బ్లాక్‌పై 50% ఉన్నాయి. వీటి ఆధారంగా తరువాతి ఆటలు డిజైన్ చేశారు. రెండు గంటలు గార్డెన్ ఏరియాలో ఉంచారు. ఆరు సార్లు బజర్ మోగుతుంది. బజర్ మొగినపుడు ఎవరు ముందు వెళ్లి గంట కొడతారో వారిద్దరూ టాస్క్ ఆడతారు. బజర్ మొగినపుడల్లా బ్యాటరీ 10 శాతం తగ్గిపోతుంది. టాస్క్ లో గెలిస్తే 10 శాతం చార్జ్ అవుతుంది. ఒకసారి గంట కొట్టిన వారు రెండోసారి కొట్టడానికి లేదు. ఇదీ మొత్తంగా ఆట.

మొదటి బజర్..

మొదటి బజర్ మోగిన వెంటనే అలీ, శివజ్యోతి బెల్స్‌ను ముందుగా మోగించారు. వీరికి బిగ్ బాస్ అరటిపండ్ల టాస్క్ ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కో అరటిపండ్ల గెల ఇచ్చి నిర్దిష్ట సమయంలో ఎవరు ఎక్కువ అరటిపండ్లు తింటే వారు విజేత అని తేల్చారు. ఈ టాస్క్‌లో అలీ 21 అరటిపండ్లు తిన్నాడు. శివజ్యోతి 15 అరటిపండ్లు తినగలిగింది. ఈ టాస్క్‌లో గెలిచి తన బ్యాటరీని 10 శాతం పెంచుకున్నాడు అలీ.

రెండో బజర్..

ఈసారి వరుణ్, రాహుల్ బెల్‌ను మోగించారు. దీంతో వాళ్లకు వెరైటీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఒక్కొక్కరికి ఒక్కో దర్మోకోల్ బాల్ బ్యాగును ఇచ్చారు. ఇద్దరూ ఆ బ్యాగ్‌లను ఓపెన్ చేసి బ్యాక్‌ప్యాక్‌లా తగిలించుకోవాలి. బజర్ మోగగానే ఒకరి బ్యాగును ఇంకొకరు ఖాళీ చేయడానికి ప్రయత్నించారు. ఎవరైతే ఎదుటివారి బ్యాగు ముందుగా ఖాళీ చేస్తారో వారు గెలిచినట్టు. ఈ టాస్క్‌లో వరుణ్ బాగానే కష్టపడ్డాడు. రాహుల్‌ బ్యాగును ఖాళీ చేయడానికి అతన్ని కింద మీద పడేసి దొర్లించేశాడు. అయినప్పటికీ రాహులే గెలిచాడు.

మూడో బజర్..

ఈ రౌండ్లో శ్రీముఖి, బాబా భాస్కర్ బెల్స్‌ను మోగించారు. అయితే వీళ్లకి వెరైటీ టాస్క్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో ఒక పిండి తొట్టె, ఒక ఈకల తొట్టె ఉంచారు. పిండి, ఈకల మధ్య ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. మొదట పిండి తొట్టెలోని పది ఆల్ఫాబెట్స్‌ను శ్రీముఖి, బాబా భాస్కర్ నోటితో ఒక్కొక్కటిగా తీసి పక్కనే ఉన్న బౌల్‌లో వేయాలి. అలాగే, ఈకల తొట్టెలో కూడా చేయాలి. ఇలా తీసిన ఆల్ఫాబెట్స్ మ్యాచ్ అవ్వాలి. ఎవరైతే ముందుగా నోటితో ఆల్ఫాబెట్స్‌ను బయటికి తీస్తారో వారు విజేత. ఈ టాస్క్‌లో బాబా భాస్కర్ గెలిచారు.

నాలుగో బజర్..

ఈ బజర్ అందరూ మోగించవచ్చు. అర్థరాత్రి అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఈ బజర్ మోగించారు. దీనిలో అందరి కంటె ముందుగా అలీ, బాబా భాస్కర్ లు గంట కొట్టారు. వీరిద్దరికీ గట్టి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒక మట్టి తొట్టి.. రెండు రంగుల పూలు.. ఇచ్చారు. ఇద్దరూ ఆ తొట్టెలో పూలు నాటాలి. అన్నీ నాటిన తరువాత పక్క వారి పూలను తీసేయవచ్చు. చివరికి ఎక్కువ పూలు ఎవరివి మిగిలితే వాళ్ళు గెలిచినట్టు. అలీ, బాబాలు పూలను నాటారు. పూర్తిగా పూలను నాటి వాటిని సర్దుకుంటున్న సమయంలో అలీ అకస్మాత్తుగా బాబా నాటిన పూలలో కొన్నిటిని లాగి విసిరేశాడు. దీంతో బాబా కూడా గట్టిగా అలీని తోసి అలీ పూలను కూడా లాగి విసిరేశాడు. ఈ టాస్క్ పూర్తీ ఫిజికల్ టాస్క్ లా మారిపోయింది. ఇద్దరి మధ్య గట్టి ఫైట్ జరుగుతోంది. ఎవరు గెలిచారో ఇప్పుడే చెప్పినా..చూపించినా మజా ఏముంటుంది? తరువాతి ఎపిసోడ్ లో అలీ, బాబా ల మధ్య ఏం జరిగిందో.. ఎవరు గెలిచారో.. టికెట్ ఎవరికీ దక్కిందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే!

మొత్త్తంమీద అదృష్టం.. శారీరక కష్టం, మెదడుకు పదును అన్నిటినీ కలిపి టికెట్ టు ఫినాలే రూపొందించారు. ఆద్యంతం ఆసక్తి కరంగా సాగడమే కాకుండా తరువాతి ఎపిసోడ్ లో ఎం జరగబోతోందనే ఉత్సుకతను రేకెత్తించింది ఈ ఎపిసోడ్!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories