Bigg Boss 3 Telugu Sunday Episode : అనుకున్నట్టే వితికను పంపించేశారుగా..

Bigg Boss 3 Telugu Sunday Episode : అనుకున్నట్టే వితికను పంపించేశారుగా..
x
Highlights

ఆదివారం ఆటవిడుపు ప్రేక్షకులకు.. బిగ్ బాస్ ఇంటి విడుపు ఇంటి సభ్యుల్లో ఒకరికి.. ఒక పక్క భార్యా భర్తల కన్నీరు.. మరోపక్క సరదాల జోరు.. అనుకున్నట్టే ఈవారం వితిక షేరు బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఇవీ ఆదివారం బిగ్ బాస్ ఎపిసోడ్ 92 విశేషాలు.

ఆదివారం ఆటవిడుపు ప్రేక్షకులకు.. బిగ్ బాస్ ఇంటి విడుపు ఇంటి సభ్యుల్లో ఒకరికి.. ఒక పక్క భార్యా భర్తల కన్నీరు.. మరోపక్క సరదాల జోరు.. అనుకున్నట్టే ఈవారం వితిక షేరు బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఇవీ ఆదివారం బిగ్ బాస్ ఎపిసోడ్ 92 విశేషాలు.

నాగార్జున వచ్చేశారు. జోష్ తెచ్చేశారు. వస్తూనే ఆటలు మొదలెట్టేశారు. ఎవరికి వారు తమ గురించి పాటతో చెప్పుకోవాలని నాగార్జున హౌస్ మేట్స్ ని కోరారు. వాటికి మిగిలిన వారు మార్కులు వేయాలని చెప్పారు. బిల్లా పాటతో అలీ, ఎవరైనా చూశారా నడిచే నక్షత్రాన్ని పాటతో శ్రీముఖి, అగ్గిపుల్లలాంటి ఆడ పిల్ల నేను అంటూ వితిక, ఈపాటకు నేనే మేస్త్రీ అంటూ రాహుల్, చందమామ నేనే, నడిచే బాపూ బొమ్మ అని శివజ్యోతి, జులాయి టైటిల్ సాంగ్ తొ బాబా భాస్కర్ ఆదరగోట్టేశారు. ముఖ్యంగా రాహుల్ పాట కి అందరూ ఫుల్ మార్క్ లు వేశేసారు. ఈ సందర్భంగా నాగార్జున పునర్నవి వెళ్లిపోయాకా నీ ఆట మారిపోయింది.. తిట్టేవారు లేకపోతె ఎదగడం ఈజీ అని పంచ్ వేశారు. తరువాత పిగ్గీ పాట్‌లను పగలకొడితే అందులో సేవ్ అయినవారి పేరు ఉంటుందని నాగార్జున చెప్పారు. వితికా, వరుణ్ సందేశ్, అలీ రెజా, శివజ్యోతి వరుసగా వారి పిగ్గీ పాట్‌లను పగలగొట్టారు. అయితే, శివజ్యోతి పగలకొట్టిన పాట్‌లో ఆమె పేరు ఉంది. దీంతో ఆమె ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యింది.

కళ్ళకు గంతలు..

కళ్ళకు గంతలు కట్టి వెరైటీ ఆటలు ఆడించారు నాగార్జున. మొదట వీతిక, వరుణ్ లకు గంతలు కట్టి బంతులతో ఆడించారు. తరవాత అలీ, రాహుల్‌లకు గంతలు కట్టి చేతులకు బాక్సింగ్ గ్లౌజులు తొడిగి కొట్టుకోమన్నారు. వాళ్లిద్దరూ సరదాగా కొట్టుకున్నట్టు యాక్ట్ చేశారు. శివజ్యోతి ఒక్కరికే టాస్క్ ఇచ్చారు. ఒక గాడిద బొమ్మను బోర్డుపై ఉంచి ఆమె ముందు పెట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని ఆ గాడిద తోకను శివజ్యోతి అతికించాలి. శివజ్యోతి మొత్తమ్మీద పెట్టేసింది. బాబా భాస్కర్ కళ్లకు గంతలు కట్టి నిలబెట్టారు. ఆయన్ని అస్సలు కదలకూడదు. ఒక్కొక్కరు వెళ్లి ఆయన్ని గిచ్చాలి. ఆ గిచ్చింది ఎవరో బాబా చెప్పాలి. అలా బాబా ఒక్క శ్రీముఖి పేరును మాత్రమే కరెక్ట్‌గా చెప్పారు. శ్రీముఖికి ఆమె స్టైల్లో వెరైటీగా టాస్క్ ఇచ్చారు నాగార్జున. నీళ్లున్న గాజు గ్లాసులను చుట్టూ పెట్టి మధ్యలో శ్రీముఖిని డ్యాన్స్ చేయమన్నారు. ఆమెకు గంతలు కట్టారు. శ్రీముఖి బాగానే చేసింది.. అయితే, మధ్యలో మిగిలిన కంటెస్టెంట్లు గ్లాసులను లోపలికి జరిపేశారు. దీంతో ఒక్కో గ్లాసును తన్నుకుంటూ డ్యాన్స్ చేసింది శ్రీముఖి. ఈ పర్ఫార్మెన్స్ చాలా సరదాగా సాగింది.

తర్వాత మరో ఎలిమినేషన్ సేఫ్ నిర్వహించారు. అలీ, వితికా, వరుణ్‌లకు కొన్ని కార్డులు ఇచ్చారు. ఒక్కొక్కరూ ఒక్కో కార్డు తీసి టేబుల్‌పై వేయాలి. ఎవరి ఫేస్ ఆ కార్డుల్లో వస్తే వాళ్లు సేఫ్. అలా ఒక్కొక్కటీ వేయగా వరుణ్ వేసిన కార్డులో అలీ ఫొటో వచ్చింది. దీంతో అతను సేవ్ అయ్యాడు.

వితిక వెళ్ళిపోయింది..

ఇక ఎలిమినేషన్ కి మిగిలింది వరుణ్, వితికలే. వీరిద్దరినీ నిలబెట్టి నాగార్జున కొద్దిసేపు వారి జర్నీ గురించి.. అట గురించి మాట్లాడారు. తరువాత వితిక ఎలిమినేట్ అయి నట్టు ప్రకటించారు. దీంతో వితిక ధైర్యంగా ఉన్నా వరుణ్ భోరున ఏడ్చాడు. వితిక అతనిని సముదాయించింది. ఇక అక్కడ నుంచి బయటకు వచ్చిన వితిక కు బిగ్ బాస్ లో తన జర్నీ వీడియో చూపించారు. ఇప్పటివరకూ బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిన వారందరి వీడియోల కంటే ఈ వీడియో చాలా బాగా వచ్చింది. ఈ 90 రోజుల్లో ఇన్ని ఎమోషన్స్ తాను ఫీలయ్యానని స్క్రీన్ మీద చూస్తే కానీ తెలియలేదని వితిక అంది. ఈ ప్రయాణాన్ని తన మనవళ్లు మనవరాళ్లకు చూపించుకోవచ్చని సరదాగా చెప్పింది. తరువాత బిగ్ బాంబ్ రాహుల్ మీద వేసి వెళ్ళిపోయింది. ఈ బిగ్ బాంబ్ ప్రకారం మళ్లీ బిగ్ బాస్ చెప్పేవరకూ అన్ని టాయిలెట్ లూ రాహుల్ కడగాలి.

మొత్తమ్మీద అనుకున్నట్టే వితికను పంపించేశారు. డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని అనుకున్నా.. చివరికి ఒక్కరే బయటకు వెళ్లారు. ఎపిసోడ్ సరదాగా సాగింది. వితిక వెళ్ళినపుడు వరుణ్ భావోద్వేగాన్ని నిలుపుకోవడం చక్కగా ఉంది. సరదా సరదాగా ఎపిసోడ్ సాగింది. కీలకమైన చివరి దశలో వితిక వెళ్లిపోవడంతో వరుణ్ ఎలా ఆడుతాడు అనేది చూడాల్సి ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories