logo

Bigg Boss 3 Telugu Episode 80: బిగ్ బాస్ లో సోగ్గాడు.. పండగ పటాస్!

Bigg Boss 3 Telugu Episode 80: బిగ్ బాస్ లో సోగ్గాడు.. పండగ పటాస్!
Highlights

బిగ్ బాస్ షో కి పండగ టచ్ ఇచ్చారు. దసరా వంటకాల స్పెషల్స్ చేయమని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చాడు. పండుగ ప్రత్యేకం అంటూ సోగ్గాడు నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే హడావుడి మొదలు పెట్టారు. దసరా పండగ సందడి బిగ్ బాస్ హౌస్ లో ఏ ఎపిసోడ్ ప్రత్యేకం.

బిగ్ బాస్ షో కి పండగ టచ్ ఇచ్చారు. దసరా వంటకాల స్పెషల్స్ చేయమని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చాడు. పండుగ ప్రత్యేకం అంటూ సోగ్గాడు నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే హడావుడి మొదలు పెట్టారు. దసరా పండగ సందడి బిగ్ బాస్ హౌస్ లో ఏ ఎపిసోడ్ ప్రత్యేకం.

ఎవరు బాగా వంట చేస్తారు..

వంటల పోటీ ఇచ్చాడు బిగ్ బాస్. రెండు గ్రూపులుగా ఇంటి సభ్యుల్ని విడగొట్టాడు. ఒకదానికి వరుణ్, మరో గ్రూపుకి వితిక లీడర్స్.. మూడు రౌండ్లుగా ఈపోటీ జరిగింది. వరుణ్ గ్రూప్ లో బాబా భాస్కర్, అలీ, మహేష్ విట్టా ఉండగా, వితిక గ్రూప్ లో శివజ్యోతి, శ్రీముఖి, రాహుల్ ఉన్నారు. ఇక మొదటి రౌండ్ లో చైనీస్ వంటకాలు చేయమన్నారు. వీటిని గ్రూప్ లీడర్లు రుచి చూసి మార్కులు వేయాలి. వరుణ్ మా వంటలే బావున్నాయి అన్నాడు. వితిక కూడా అలానే అంది. దీంతో రెండు గ్రూపులకు పాయింట్లు రాలేదు. తరువాతి రౌండ్ ఆంధ్రా వంటకాలు. ఇందులో భాగంగా వితిక గ్రూప్ ప్రాన్ కర్రీ చేస్తే, బాబా భాస్కర్ నెల్లూరు చేపల పులుసు చేశారు. ఇద్దరు గ్రూపు లీడర్లూ రెండు వంటకాలు బావున్నాయని చెప్పడంతో ఇద్దరికీ చెరో పాయింట్ ఇచ్చారు. ఇక మూడో రౌండ్ కి స్పెషల్ గెస్ట్ వస్తారని, సువీత్ చేయాలనీ చెప్పారు. ఇద్దరూ స్వీట్ తయారుచేశారు.

సోగ్గాడి సందడి..

బిగ్ బాస్ హౌస్ లోకి కింగ్ నాగార్జున అకస్మాతుగా పండుగ అతిథిగా వచ్చేశారు. దీంతో హౌస్ మేట్స్ సంబరాలకు అంతు లేకుండా పోయింది. నాగార్జున వస్తూనే స్పెషల్ గా అలంకరించి ఉన్న నులకమంచం చూసి.. నాకోసమే మంచం కూడా ఉంచారు.. అన్నారు. వెంటనే వెరీస్ రమ్య అంటూ పంచ్ పేల్చారు. వితిక ను వరుణ్ ని బాగా చూసుకుంటున్నావా అన్నారు. అందరిని పేరు పేరుపేరునా పలకరించి వారందరూ తనకు బాగా అలవాటైపోయారని చెప్పారు. ఇంటి దగ్గర కూడా బిగ్ బాస్ హౌస్ మేట్స్ గురించి చర్చ జరుగుతుందనీ, ఇంట్లో వాళ్లందరికీ కూడా హౌస్ మేట్స్ బాగా దగ్గర అయిపోయారని చెప్పి హౌస్ మేట్స్ లో జోష్ నింపారు. ఇక నాగార్జున ఎంట్రీ అయితే అయింది కానీ, ఎగ్జిట్ కాలేదు. ఈ హడావుడి రేపు కూడా కొనసాగుతుంది.

మొత్తమ్మీద బిగ్ బాస్ లో దసరా వేడుక నిర్వహించి.. నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ కి కొంత ఎంజాయిమెంట్ కల్పించారు.

ఈవారం బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళ్ళిపోతారని మీరు భావిస్తున్నారు?




లైవ్ టీవి


Share it
Top