Bigg Boss3 Telugu Episode 71: చేదు లడ్డూలు తినిపించి రవికృష్ణ వెళ్ళిపోయాడు.. తీపిలడ్డూ తిని మరీ గుక్కపట్టిన శివజ్యోతి!!

Bigg Boss3 Telugu Episode 71: చేదు లడ్డూలు తినిపించి రవికృష్ణ వెళ్ళిపోయాడు.. తీపిలడ్డూ తిని మరీ గుక్కపట్టిన శివజ్యోతి!!
x
Highlights

బిగ్ బాస్ చివరి అంకానికి సమాయత్తం అవుతోంది. ఇక ఐదు వాలే మిగిలి ఉండడంతో మెల్లగా ఆసక్తికరంగా తీర్చిదిద్దటానికి ప్రయత్నిస్తున్నారు. వారాంతపు ఎపిసోడ్ లు బిగ్ బాస్ స్పెషల్. శనివారం అందర్నీ ఒక రౌండ్ క్లాస్ పీకి సీరియస్ గా షో నడిపించిన నాగార్జున.. సన్ డే ఫన్ డే.. అంటూ సరదాగా ఈ ఎపిసోడ్ నడిపించారు.

బిగ్ బాస్ చివరి అంకానికి సమాయత్తం అవుతోంది. ఇక ఐదు వాలే మిగిలి ఉండడంతో మెల్లగా ఆసక్తికరంగా తీర్చిదిద్దటానికి ప్రయత్నిస్తున్నారు. వారాంతపు ఎపిసోడ్ లు బిగ్ బాస్ స్పెషల్. శనివారం అందర్నీ ఒక రౌండ్ క్లాస్ పీకి సీరియస్ గా షో నడిపించిన నాగార్జున.. సన్ డే ఫన్ డే.. అంటూ సరదాగా ఈ ఎపిసోడ్ నడిపించారు. ఇక అందరూ అనుకున్నట్టే రవికృష్ణ ఎలిమినేట్ అయ్యారు. ఫన్నీ స్కిట్స్.. రవి ఎలిమినేషన్ బ్యాలెన్సింగ్ గా ఎపిసోడ్ నడిచింది. ఇక ఆ విశేషాలు మీకోసం..

ఫన్నీగా ఇరగదీశారు..!

పది మంది సభ్యులను ఐదు టీములు గా విడదీశారు నాగార్జున. ఈ ఐదు టీములు ఫన్నీ స్కిట్ లు చేసి పెర్ఫార్మెన్స్ చేయాలని చెప్పారు. శివజ్యోతి-మహేష్ విట్టా బిగ్ బాస్ టీవీ వ్యాఖ్యాతలుగా న్యూస్ చెప్పాలి. అదీ బిగ్ బాస్ కు సంబంధించిన విశేషాలతో. ఇక శివజ్యోతికి ఇది అలవాటైన పనే కదా. తీన్మార్ బయటకు తీసింది. మహేష్ తో కలిసి అందరు హౌస్ మేట్స్ గురించి ఫన్నీగా చెప్పించి ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచింది. తరువాత వితిక-అలీ ఇద్దరూ

భార్యా భర్తలుగా నటించారు. తన అనుమానంతో వేధించే భార్యగా వితిక జీవించేస్తే.. అమాయకపు భర్తగా అలీ ఆకట్టుకున్నాడు. ఇక వరుణ్-రవి ఇద్దరిదీ టీవీ స్కిట్. వరుణ్ అప్పుడే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి రవికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. కామెడీగా ఇద్దరి మధ్య మంచి సంభాషణ నడిచింది. తరువాతి స్కిట్ కు కూడా రవి ఏంకర్ గా ఉండాలని నాగార్జున సూచించారు. బాబా భాస్కర్- శ్రీముఖి ఇద్దరూ డ్యాన్స్ షో స్కిట్ చేశారు శ్రీముఖి కాళ్ళు కోల్పోయి వచ్చిన డ్యాన్సర్ గా.. బాబా భాస్కర్ జడ్జిగా చేశారు. ఇద్దరూ మార్కుల విషయంలో ఒకరితో ఒకరు గొడవ పడటం.. బ్రేక్ లో కల్సి మాట్లాడుకోవడం.. మధ్యలో రవి యాంకర్ గా ఎంట్రీ ఇలా టీవీ రియాల్టీ షో లపై పంచ్ లు వేస్తూ నవ్వించారు. ఇక చివరికా ప్రేమ జంట.. పునర్నవి-రాహుల్ ఇద్దరి వంతు. ఇద్దర్నీ పేరడీ పాటలు పాడాలని కోరారు నాగార్జున. రాహుల్ ఇంటి సభ్యులందర్నీ కలుపుతూ పేరడీ పాట పాడాడు. పునర్నవి మాత్రం రాహుల్ పైనే పేరడీ పాట పాడి నవ్వించింది. ఈ ఇద్దరే బెస్ట్ Teluguపెర్ఫార్మర్స్ గా నిలిచారు.

కిస్సండి..కిల్లండి..

ఇదేమిటి అనుకోకండి. హౌస్ మేట్స్ కి ఇచ్చిన సరదా టాస్క్ ఇది ఒక్కో సభ్యుడికి ఒక కిస్ లేబుల్.. ఒక కత్తి ఇచ్చారు. అందరి ఫోటోలు ఓ బోర్డు పై ఉంచారు. ఎవరిని కిస్ చేస్తారో.. ఎవరిని కిల్ చేస్తారో చెప్పాలి. అదీ ఆట.

ఇక ఇందులో రాహుల్ - బాబా భాస్కర్‌కు కత్తి, వరుణ్ సందేశ్‌కు కిస్ ఇచ్చారు. మహేష్ - అలీకి కిస్, శ్రీముఖికి కత్తి.. శివజ్యోతి - అలీ, రవికి కిస్, పునర్నవికి కత్తి.. అలీ రెజా - శివజ్యోతికి కిస్, బాబా భాస్కర్‌కు కత్తి..శ్రీముఖి - అలీకి కత్తి, వితికాకు కిస్.. రవికృష్ణ - పునర్నవికి కత్తి, శివజ్యోతికి కిస్.. బాబా భాస్కర్ - అలీకి కత్తి, శ్రీముఖికి కిస్.. వరుణ్ సందేశ్ - రాహుల్‌కి కిస్, పునర్నవికి కత్తి.. వితికా షెరు - రాహుల్‌కి కత్తి, శ్రీముఖికి కిస్.. పునర్నవి - మహేష్‌కు కిస్, రవికి కత్తి ఇచ్చి తమ అభిప్రాయాలు చెప్పారు.

రవికృష్ణ ఎలిమినేట్..

ఇక ఆదివారం ఎలిమినేషన్స్ లో భాగంగా నామినేషన్స్ లో ఉన్న శ్రీముఖి, బాబా భాస్కర్, రవికృష్ణలలో టాస్క్ ల మధ్యలో శ్రీముఖి సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు నాగార్జున. తరువాత ఎపిసోడ్ చివర్లో రవికృష్ణ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. దీంతో శివజ్యోతి తన ఏడుపు సీన్ మొదలు పెట్టేసింది. వెక్కి వెక్కి ఏడ్చింది. బాబా భాస్కర్ కూడా ఎమోషన్ అయ్యారు. మిగిలిన సభ్యులు కొంత ఎమోషన్స్ దాచుకున్నా అలీ, శివజ్యోతి కన్నీరు పెట్టుకున్నారు. శివజ్యోతి కన్నీటి వరద మాత్రం ఎపిసోడ్ పూర్తయ్యేవరకూ కొనసాగుతూనే ఉంది.

చేదు లడ్డూలు..

ఒకటి నుంచి తొమ్మిది అంకెలతో బోర్డు పెట్టారు. ఆ నెంబర్స్ ఎదురుగా రవికృష్ణ తన అభిప్రాయంతో ఒక హౌస్ మెట్ బొమ్మ పెట్టాలి. ఆరు నుంచి తొమ్మిది వరకూ వచ్చిన వారికి చేదు లడ్డూలు ఎన్ని అంకెలుంటే అన్ని తినాలి. ఒకటి నుంచి ఐదు వచ్చిన వారికి తీపి లడ్డూలు దక్కుతాయి. ఇక ఆలస్యం లేకుండా పునర్నవికి తొమ్మిది చేదు లడ్డూలు ఇచ్చేశాడు రవి. వితికా ఎనిమిది, మహేష్ కు ఏడు, రాహుల్ కు ఆరు చేదు లడ్డూలు తినిపించాడు రవి. ఇక శివజ్యోతికి టాప్ ర్యాంక్ ఇచ్చారు. తరువాత అలీ, వరుణ్ మూడు, శ్రీముఖి నాలుగు, బాబా భాస్కర్ 5 తీపి లడ్డూలు తిన్నారు. ఇక బిగ్ బాంబ్ పునర్నవి మీద వేశారు రవికృష్ణ. ఈవారం బిగ్ బాస్ చెప్పేవరకూ హౌస్ మేట్స్ బట్టలన్నీ పునర్నవి ఉతకాల్సి ఉంటుంది.

మొత్తమ్మీద ఎపిసోడ్ సరదాగా సాగింది. రాబోయే ఎలిమినేషన్స్ కి లీడ్ లా కూడా అనిపించింది. ఇక ఫన్నీ స్కిట్ లన్నీ ఎంటర్టైన్ చేశాయి. ఆదివారం ఎపిసోడ్ లలో రమ్యకృష్ణ వచ్చిన ఎపిసోడ్ పక్కన పెడితే.. ఈ ఎపిసోడ్ ఇప్పటివరకూ వచ్చిన అన్నిటిలోనూ సరదాగా సాగిందని చెప్పవచ్చు. ఇక ఐదు వారాలే మిగిలి ఉన్న ఈ తరుణంలో బిగ్ బాస్ హౌస్ లో ఏం జరగబోతుంది అనేది చూస్తూ ఉండాల్సిందే!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories