Bigg Boss 3 Telugu Episode 68: బిగ్ బాస్ హౌస్ మేట్స్ వర్ష వినోదం.. వైల్డ్ గా వచ్చిన అలీ.. జ్యోతక్క కన్నీటి వరద!

Bigg Boss 3 Telugu Episode 68: బిగ్ బాస్ హౌస్ మేట్స్ వర్ష వినోదం.. వైల్డ్ గా వచ్చిన అలీ.. జ్యోతక్క కన్నీటి వరద!
x
Highlights

అత్తగారి ఆట మొత్తమ్మీద ముగిసింది. హౌస్ లో గ్రూపులు విదిపోతాయనుకుంటే కొత్త గ్రూపులు ఏర్పడినట్టు కనిపిస్తోంది. పునర్నవి-రాహుల్ జంట ఏకాకిగా మిగిలిపోయింది. హోరు వానలో హౌస్ మేట్స్ తడుస్తూ చిందులేశారు. చొక్కా విప్పి మరీ వైల్డ్ గా వచ్చాడు అలీ రెజా.. అలీని చూసి జ్యోతి ట్యాప్ తిప్పింది. ఇవీ ఎపిసోడ్ 68 విశేషాలు.

అత్తగారి ఆట మొత్తమ్మీద ముగిసింది. హౌస్ లో గ్రూపులు విదిపోతాయనుకుంటే కొత్త గ్రూపులు ఏర్పడినట్టు కనిపిస్తోంది. పునర్నవి-రాహుల్ జంట ఏకాకిగా మిగిలిపోయింది. హోరు వానలో హౌస్ మేట్స్ తడుస్తూ చిందులేశారు. చొక్కా విప్పి మరీ వైల్డ్ గా వచ్చాడు అలీ రెజా.. అలీని చూసి జ్యోతి ట్యాప్ తిప్పింది. ఇవీ ఎపిసోడ్ 68 విశేషాలు.

స్నేహితుల మధ్య ఇటుకల గోడ కట్టేసుకున్నారు..

రెండు రోజుల పాటు సాగిన అత్తగారి ఆట ముగిసింది. విడదీయలేని బంధం మాది. స్నేహమే జీవితం.. టాస్క్ ల కోసం విడిపోయే బంధం కాదు మాది అంటూ మొదట్నుంచీ స్నేహ గీతాలు పాడుతున్న వారు బద్ధ శత్రువులుగా మారిపోయారు. పునర్నవి-రాహుల్ ఓ చోట చేరి వితిక-వరుణ్ ల పై గుసగుసలాడుకుంటూ కాలక్షేపం చేశారు. వరుణ్ లో మగాదితనమే లేదని డిక్లేర్ చెసేశాడు రాహుల్. ఇక పనిలో పనిగా శ్రీముఖినీ నాలుగు మాటలు అనేసుకున్నారు. నేను ఆట ఆడను అన్న రాహుల్ ని ఒప్పించి ఆటాడించింది పునర్నవి. అయితే, వారు ముందు అనుకున్నట్టే ఈ ఇద్దర్నీ మిగిలిన నలుగురూ ఒకటై టార్గెట్ చేశారు.

హోరు వానలో.. జోరు డ్యాన్సులు!

హోరున వాన పడుతుంటే అందరూ బిగ్ బాస్ వినిపించిన పాటలకు అనుగుణంగా తడుస్తూ చిందేశారు. వరుణ్-వితిక, రాహుల్-పునర్నవి, శ్రీముఖి-రవికృష్ణలు జంటలుగా డ్యాన్స్ అదరగొట్టారు. ఇక బాబా భాస్కర్ తన టాలెంట్ తో మరింత జోష్ తెచ్చారు.

శ్రీముఖి రవికృష్ణ పెళ్లిచూపులు!

శివజ్యోతి నా పెద్ద కొడుకు పెళ్లి చూపులకు నేను రాలేదు. అక్కడ ఏం జరిగిందో చూపించండి అని టాస్క్ ఇచ్చింది. బాబా భాస్కర్, రావిక్రిష్ణ పెళ్లి చూపులకు శ్రీముఖి ఇంటికి వెళ్ళారు. మహేష్ శ్రీముఖి అన్నయ్య. ఇక మొదలైంది కామెడీ. పెళ్లిచూపులు అనే సీన్ కామెడీగా చేయాలంటే బోలెడు హాస్యాన్ని పంచవచ్చు. అదే చేశారు. బాబా భాస్కర్ పంచ్ లు.. శ్రీముఖి సిగ్గులేని సిగ్గుల తనం.. మహేష్ వెర్షన్.. రవి అమాయకపు మాటలు.. ఇలా అన్నీ బాగా కుదిరాయి. ఫ్లైట్ లో పెళ్లి చూపుల కోసం వచ్చామని బాబా మొదట్లో మహేష్ కి చెపుతాడు. ఇక చివర్లో మహేష్ కట్న కానుకల విషయం గురించి అడిగితె రవి మా అమ్మకు ఇటువంటివి ఇష్టం ఉండదు అంటాడు. దానికి బాబా అవును అటువంటివి ఆమెకు ఇష్టం ఉండదు కానీ, ఆటో ఖర్చులకు ఓ 500 ఇప్పించండి అని అడిగిన విధానం హైలైట్ గా నిలిచి అందర్నీ నవ్వుల్లో ముంచేసింది.

కెప్టెన్సీ పోటీదారులు వీరే!

అత్తగారి ఆట పెర్ఫార్మెన్స్ ఆధారంగా కెప్టెన్ పోటీదారులుగా శివజ్యోతి, బాబా భాస్కర్, శ్రీముఖి, రవికృష్ణలు నిలిచారు. టాప్ పెర్ఫార్మర్ గా బాబా భాస్కర్ ను అందరూ పేర్కొన్నారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే చొక్కా విప్పి వీరంగామా బాబూ!

ఇక అందరూ అనుకున్నట్టు ఏమాత్రం తేడా లేకుండా అలీ రెజా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే, వీర లెవెల్ లో హడావుడి సృష్టించారు అలీరేజా ఎంట్రీ కోసం. అది పక్కన పెడితే చొక్కా విప్పి రొమ్ము విరుచుకుంటూ.. అలీ రెజా హౌస్ లోకి వచ్చారు. దీంతో హౌస్ మొత్తం ఒక్కసారే సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయింది. అలీ రేజాను అందరూ ఒక రేంజ్ లో ఆహ్వానించారు. శ్రీముఖి అలీ రేజాను హత్తుకుని మురిసిపోయింది. ఇక శివజ్యోతక్క అలీని చూసిన వెంటనే కుళాయి తిప్పింది. బయట కురుస్తున్న వర్షానికి కూడా అసూయ కలిగే రేంజిలో కన్నీటి వరద పారించింది. అలీ ఎత్తుకుని మరీ ఊరదించాలని ప్రయత్నించినా ఆ ప్రవాహాన్ని ఆపలేకపోయాడు. ఆఖరుకి బయట అందరూ అలీ చచ్చిపోలేదు.. ఎలిమినేట్ అయ్యాడంటే అంటూ ట్రోల్ చేస్తున్నారంటూ ఆమె ఏడుపు ఆపించే ప్రయత్నం చేశాడు.

మొత్తమ్మీద బిగ్ బాస్ ప్రీ క్లైమాక్స్ దశలోకి మెల్లగా ప్రవేశిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్ లో కొద్ది సేపు పెళ్లిచూపులు స్కిట్ చాలా రిలీఫ్ ఇచ్చింది. హాయిగా అనిపించేలా చేసింది. అలీ ని ఎంటర్ చేయడం ద్వారా మరింత జోష్ పెంచాలని బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నాడనేది సుస్పష్టం. స్క్రిప్ట్ ఎలా రాసినా.. సీక్రేసీ మెయింటెయిన్ చేయలేకపోతున్నారో.. కావాలనే లీకులిచ్చి ఉత్సుకత పెంచాలని చూస్తున్నారో కానీ దాదాపుగా ఈ సీజన్ అంతా అన్ని విషయాలు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు.. బయటకు వచ్చి వైరల్ అవుతున్న వార్తలకు అనుగుణంగానే జరుగుతుండడం గమనార్హం. ఇక కెప్టెన్ గా ఎవరు ఎంపిక అవుతారు? పునర్నవి-రాహుల్ జంటగా మిగిలిన వారిని ఎలా తట్టుకుంటారు ఇలాంటి సందేహాలు మాత్రం మిగిలాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories