Bigg Boss 3 telugu Episode 67: అదుపు తప్పిన అత్తగారి ఆట.. బిగ్ బాస్ లో రాహుల్-వరుణ్ బిగ్ ఫైట్!

Bigg Boss 3 telugu Episode 67: అదుపు తప్పిన అత్తగారి ఆట.. బిగ్ బాస్ లో రాహుల్-వరుణ్ బిగ్ ఫైట్!
x
Highlights

అత్తగారి ఆట అదుపు తప్పింది. స్నేహితులని తన్నుకునేలా చేసింది. శత్రువులనుకునే వారిని దగ్గర చేసింది. బిగ్ బాస్ హౌస్ లో గ్రూపులు కట్టి.. వాటిలో సభ్యుల...

అత్తగారి ఆట అదుపు తప్పింది. స్నేహితులని తన్నుకునేలా చేసింది. శత్రువులనుకునే వారిని దగ్గర చేసింది. బిగ్ బాస్ హౌస్ లో గ్రూపులు కట్టి.. వాటిలో సభ్యుల నుంచి మద్దతు కూడగడుతూ వస్తున్న వరుణ్-వితికా జంట మరో కొత్త స్ట్రాటజీ స్టార్ట్ చేశారు. ఒక్క గంట ముందు వరకూ కూడా స్నేహబంధమూ అంటూ రాహుల్ తో పాటలు పాడి చిందులు వేసిన ఈ జంట ఒక్కసారిగా పాత గొడవలు తవ్వి.. బిగ్ బాస్ లో ఇలానే ఆటాడాలి అని చూపించేశారు..

వీలునామా దొరికేలా లేదు..

జ్యోతి అత్తగారు వీలునామా ఎక్కడో దాచేసింది.. దానిని దొరక్పుచ్చుకునే చాన్స్ ఎవరికీ దక్కడం లేదు. దీంతో మిగిలిన హౌస్ మేట్స్ కి ఫస్ట్రేషన్ పెరిగిపోయింది. ఆ వేడిలో అందరూ తప్పని సరి పరిస్థితిలో శివజ్యోతి ఏది చెబితే అది చేశారు. ఇక జంటలుగా ఉన్నవారి గురించి చెప్పక్కర్లేదు. మరోవైపు బాబా భాస్కర్, మహేష్ లు తమ బాస్ శివజ్యోటికి వెన్నుపోటు పొడవాలని విశ్వప్రయత్నం చేశారు. శివజ్యోతి కూడా బాబా కు మిగిలిన వారికీ మధ్య గొడవలు పెట్టడానికి తన వంతు ప్రయత్నాలు చేసింది. ఇలా వీలునామా కథ కొనసాగుతూనే ఉంది.

గోడలు కట్టండి రా బాబూ అంటే గొడవలు పెట్టుకున్నారు!

ఇక ఆటలో ముఖ్యమైన టాస్క్ ఇటుకలతో గోడలు కట్టడం. దానికోసం శివజ్యోతి దగ్గర నుంచి ఇటుకలు సంపాదించుకొని వాటితో గోడ కట్టాలి. మధ్యలో ఒకరి దగ్గర ఇటుకలు ఒకరు లాక్కోవచ్చు. అయితే, గోడలో పెట్టిన ఇటుకలు మాత్రం ముట్టుకోకూడదు. ఇక మొదలైంది అసలు ఆట. బాహా బహీకి.. ఇటుకల సంపాదన కోసం ఇంతులతో కలిసి కీచులాట్లకు తెర లేపారు వరుణ్, రాహుల్, రవి. ముగ్గురూ ఒకర్ని ఒకరు నెట్టుకుంటూ, ఒకరిని ఒకరు తోసుకుంటూ.. ఇలా ఎలా వీలయితే అలా ఇష్టం వచ్చినట్టు యాక్షన్ సన్నివేశాల్ని సృష్టించారు. ఈ క్రమంలో రాహుల్ వరుణ్ వద్ద ఉన్న ఇటుకలు లాక్కోవడానికి ప్రయత్నిచారు. వరుణ్ నడుం పట్టుకుని ఇటుకలు లాక్కొనే క్రమంలో వరుణ్ కూడా ఎగిరెగిరి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో సీన్ లోకి వరుణ్ భార్య వితిక ఎంటర్ అయింది. అంతే, రచ్చ మొదలైంది. రాహుల్ కి కితకితలు పెట్టాలనే ప్రయత్నంలో గట్టిగా గిచ్చింది. రాహుల్ ఈ విషయంలో వితిక తో వాదనకు దిగాడు. నన్నెందుకు గిల్లావు? అంటూ అడిగాడు. మరి వితికను ఏమైనా అంటే వరుణ్ ఊరుకోడుగా.. రాహుల్ తో గట్టిగా గొడవ పడ్డారు. పాత విషయాలు ఎత్తి మరీ రాహుల్ ను కార్నర్ చేశారు. దీంతో పెద్ద యుద్దమే జరిగింది.

వరుణ్ కూడా ఇలా చేస్తాడనుకోలేదు..

వితికను ఏదైనా అంటే వరుణ్ ఊరుకోడు.. వరుణ్ కి ఏదైనా ప్రోబ్లం వస్తే వితిక దూసుకు వచ్చేస్తుంది. మరి ఆ రేంజ్ కాకపోయినా.. తామూ జంటే కదా.. అందుకే రాహుల్ ని వరుణ్ తిట్టదాన్ని పునర్నవి భరించలేకపోయింది. నేను అనుకుంటూనే ఉన్నాను నీ ఎగరేసివ్ నెస్ ని టార్గెట్ చేస్తారని. కానీ, ఆ పని వరుణ్ చేస్తాడని అనుకోలేదు అంటూ పునర్నవి రాహుల్ మంటకి తాలింపు వేసింది.

సందట్లో సడేమియా..

ఇంత గొడవ జరుగుతుంటే రవికృష్ణ-శ్రీముఖి మాత్రం తమ గోడ పనిలో పడ్డారు. జాగ్రత్తగా తమ పని తాము చేసుకుని ఆటలో ముందుకు పోయారు. ఇక శ్రీముఖి కి సహజంగా ఉన్న పెదరాయుడి లక్షణం మరోసారి నిద్ర లేచింది. పునర్నవిని ఏం జరిగిందని అడిగింది. ఆమె నాకు తెలీదు అంది. దాంతో వరుణ్, వితికల దగ్గర చేరి గొడవ సర్దుబాటు(?) చేసే ప్రయత్నం చేస్తోంది.

మొత్తమ్మీద బిగ్ బాస్ లో బిగ్ ఫైట్ మొదలైంది. గ్రూపులుగా ఆటాడుతున్న వారిని విడగొట్టి ఎవరికీ వారుగా ఆడించడానికి బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టు ఎపిసోడ్ సాగింది. ఇంత వరకూ ఒకే మాట.. ఒకే తీరు అన్నట్టుగా ఉన్న వరుణ్-వితిక, రాహుల్-పునర్నవి ల మధ్య వార్ మొదలవడం కొంత ఆశ్చర్యమనిపించినా ఇది తప్పనిసరి తతంగమే. ఇక భార్యాభర్తలుగా నటించమంటే.. ఈ చాన్స్ మళ్లీ రాదేమో అన్నట్టు రాహుల్-పునర్నవి జంట అసలు జీవిన్చేస్తున్నారు. నిజమైన భార్యాభర్తలు కూడా వారిని చూసి అమ్మో ఇలా ఉండాలా.. మాకు తెలీక మరోలా ఉంటున్నామే అనుకునేంతగా జీవించేశారు. ఇక ఈ గొడవ ఎలా సర్దు మనుగుతుందో ఎవరు ఎలా మారిపోతారో చూడాల్సిందే మరి!




Show Full Article
Print Article
More On
Next Story
More Stories