Bigg Boss3 telugu Episode 66: పునర్నవి నోటి తీట..అత్తగా శివజ్యోతి ఆట!

Bigg Boss3 telugu Episode 66: పునర్నవి నోటి తీట..అత్తగా శివజ్యోతి ఆట!
x
Highlights

హద్దూ ఆపూలేని పునర్నవి నోరు.. వితిక ఓవర్ రియాక్షన్స్.. అత్తగారిగా శివజ్యోతి, కోడళ్లుగా శ్రీముఖి, వితిక, పునర్నవి నటనా కౌశలం బిగ్ బాస్ ఎపిసోడ్ 66 విశేషాలు.

హద్దూ ఆపూలేని పునర్నవి నోరు.. వితిక ఓవర్ రియాక్షన్స్.. అత్తగారిగా శివజ్యోతి, కోడళ్లుగా శ్రీముఖి, వితిక, పునర్నవి నటనా కౌశలం బిగ్ బాస్ ఎపిసోడ్ 66 విశేషాలు.

వాడు వెధవ!

పునర్నవి బిగ్ బాస్ లో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతోంది. తనకు నచ్చని వారిని నోటికి ఎంత వస్తే అంతగా మాట్లాడేస్తోంది. రవి, వితికల మధ్య నామినేషన్ సందర్భంగా జరిగిన వాదన కు సంబంధించి తీరుబడిగా కూచుని చర్చ మొదలెట్టారు వరుణ్ గ్రూప్. ఇందులో భాగంగా రవిని వాడో వెధవ.. వెకిలిగా నవ్వడం తప్ప మరోటి రాదు. 31 ఏళ్ళు వచ్చాయి బుద్ధి లేదు అంటూ తీవ్ర పదజాలంతో రెచ్చిపోయింది వితిక. మిగిలిన గ్రూపు సభ్యులు ఎవరూ కూడా ఆమె మాటలను ఖండించలేదు.

నా ఆట నేనాడుతా అంతే!

బాబా భాస్కర్ తో మొదట్నుంచీ గ్రూపుగా ఉన్న శ్రీముఖి అలిగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా బాబా మాటలకు హార్ట్ అయ్యానని బాబా కు చెప్పింది. బాబా సర్ది చెప్పినా సరే వెనక్కి తగ్గలేదు. నేను ఇక నుంచి సోలోగా ఆడుతా. అందరూ కల్సి ఆడితే ఇలానే ఉంటుంది అంటూ బాబాతో సుదీర్ఘంగా చర్చించింది.

వారి ప్రేమ పాకాన పడింది!

మొదట్నుంచీ వారిద్దరి మధ్య ఎదో ఉంది అనుకుంటున్న ప్రేక్షకులకు అది నిజమే అనే స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు రాహుల్-పునర్నవి జంట. ఉత్తుత్తి ఎలిమినేషన్ కి వెళ్లి తిరిగి వచ్చిన రాహుల్ తో గతంలో కంటే మరింత దగ్గరగా.. వరుణ్ మాటల్లో చెప్పాలంటే భార్యాభర్తలైన వారిద్దరి కంటే.. రాహుల్ పునర్నవి కెమిస్ట్రీ చాలా బావుంది.

అత్తగారు-కోడళ్లు..

ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా అత్తగారి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. శివజ్యోతి డబ్బున్న అత్తగారు. ఆమెకు ముగ్గురు కొడుకులు. ముగ్గురికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. రవికృష్ణ, శ్రీముఖి పెద్ద కొడుకు కోడలు, వరుణ్, వితిక రెండో కొడుకు కోడలు, రాహుల్, పునర్నవి మూడో కొడుకు కోడలు. ఇక బాబా భాస్కర్ శివజ్యోతి మేనేజర్. ఆయనకు అసిస్టెంట్ మహేష్ విట్టా. ఇవీ పాత్రలు. అసలే నటనలో బిగ్ బాస్ హౌస్ లో అందరూ పీహెచ్డీ చేసేస్తున్నారు. ఇంకేముంది ఇలాంటి పాత్రలు వస్తే వదులుతారా.. జీవిన్చేస్తున్నారు. ఈ పాత్రలకు ఉన్న టాస్క్ ఏమిటంటే.. అత్తగారి దగ్గర వీలునామా కాజేయడం. అత్తగారి ఇటుకల దుకాణం నుంచి ఇటుకలు ఎత్తుకెళ్ళి గోడ కట్టడం. గోడ కట్టడానికి ఇటుకలు తీయకుండా చూసుకోవాల్సింది బాబా, మహేష్ లు. గోడ కట్టిన తరువాత అందులో ఇటుక ఎవరూ తీయకూడదు. ఇంకేముంది. గోడ కట్టడం కంటే వీలునామా కాజేయడం మీద దృష్టి పెట్టిన సభ్యులంతా దానికోసం వెతుకులాట మొదలు పెట్టారు. ఇక అత్తగారిని ప్రసన్నం చేసుకోవలని కోడళ్లుగా శ్రీముఖి, వితిక, పునర్నవి చేస్తున్న చేష్టలు అసలు మామూలుగా లేవు. ఇక భార్యా భర్తలుగా నటించండి బాబూ అని బిగ్ బాస్ చెబితే.. కొత్తగా పెళ్ళయిన జంటలా జీవిన్చేస్తున్నారు పులిహోర్ జంట పునర్నవి-రాహుల్.

మొత్తమ్మీద బిగ్ బాస్ హౌస్ లో ఏవిధంగా హౌస్ మేట్స్ ఉండాలనుకున్నాడో ఆ రకంగా వారిని తయారు చేస్తూ వస్తున్నాడు. ఇక పునర్నవి మాటలకు హద్దు లేకుండా పోతోంది. రాహుల్ ఎలిమినేషన్ డ్రామా ముగిసిన దగ్గరనుంచీ మరింత రెచ్చిపోతోంది. రవిని నోటికి వచ్చినట్టు మాట్లాడిన ఆమె బాబా భాస్కర్ గురించి కూడా తప్పుగా మాట్లాడింది. పాపం బిగ్ బాస్ మాత్రం ఏం చేస్తాడు.. పునర్నవి లేకపోతె పులిహోర స్టోరీ ఆగిపోతుంది. అంతంత మాత్రం లాగుతున్న షో ఆమె రాహుల్ మధ్య ఎదో ఉందన్న భ్రమలతో లాగిస్తున్నారు. ఆ విషయం పున్నూకు అర్థం అయిపోయింది. ఇంకా ప్రేక్షకులు చాలా భరించాల్సి రావచ్చు. బిగ్ బాస్ తరహా వినోదాన్ని చూడాలంటే అన్నిటికీ సిద్ధంగా ఉండాల్సిందే మరి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories