Bigg Boss3 telugu Episode 65: ఎవరు గొప్ప? బిగ్ బాస్ హాటెస్ట్ కాంటెస్ట్!

Bigg Boss3 telugu Episode 65: ఎవరు గొప్ప? బిగ్ బాస్ హాటెస్ట్ కాంటెస్ట్!
x
Highlights

బిగ్ బాస్ పదో వారం ఎలిమినేషన్స్ కోసం నామినేషన్ ఎవరు అవుతారో తేల్చే ఘట్టం హాట్ హాట్ గా సాగింది. ఎవరి గొప్పలు వారు చెప్పుకోవాలనే ఆట తొ బిగ్ బాస్ నామినేషన్ ఓటింగ్స్ పెట్టాడు. ఈ వారం నలుగురు ఎలిమినేషన్ లో ఉన్నారు.

మొత్తమ్మీద బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ డ్రామాకి ముగింపు పలికారు. ఇక ఎలిమినేషన్స్ కి జరిగే నామినేషన్ లు వేడిగా సాగాయి. తొమ్మిది మంది ఇంటి సభ్యుల్లో నలుగురిని ఎలిమినేషన్ లో ఉంచారు. ఇవీ ఎపిసోడ్ 65 విశేషాలు.

పునర్నవి విరహ బాధ..పులిహోర రాహుల్ రీఎంట్రీ!

రాహుల్ ఎలిమినేట్ అయిపోయాడని (?) అనుకుంటున్న పునర్నవి ఒరేయ్ పందీ ఈ టైం లో ఎం చేస్తుంటావురా.. బోరు కొడితే నిన్ను ఆట పట్టించేదానిని అంటూ రాహుల్ కోసం పరితపించి పోయింది. ఆమె బాధ చూసి బిగ్ బాస్ కు జాలేసినట్టుంది..వెంటనే రాహుల్ ను సీక్రెట్ రూమ్ లోనుంచి హౌస్ లోకి పంపించారు. దాంతో పునర్నవి ఎవరెస్ట్ ఎక్కినంత సంబరపదడిపోయింది. అవకాశం దొరికింది అంతే.. రాహుల్ కి ఓ పే..ద్ద హాగ్ ఇచ్చింది. హౌస్ మేట్స్ అందరూ రాహుల్ వచ్చినందుకు సంబరాలు చెసుకున్నారు. వాళ్లీ సందడిలో ఉండగానే ఎలిమినేషన్స్ కోసం నామినేషన్స్ మొదలెట్టాడు బిగ్ బాస్.

హాట్ సీట్.. ఎవరు గొప్ప ఫీట్!

తొమ్మిది మంది హౌస్ మేట్స్ లో మహేష్ విట్టా హౌస్ కెప్టెన్ గా ఈవారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యారు. ఇక మిగిలిన ఎనిమిది మందిని నాలుగు జంటలు గా చేసి.. ఎవరు గొప్పో తేల్చుకోమని గొడవల మంత్రం వేశాడు బిగ్ బాస్. శివజ్యోతి-శ్రీముఖి, వితిక-రవికృష్ణ, రాహుల్-వరుణ్, పునర్నవి-బాబా భాస్కర్ నాలుగు జంటలుగా ఎవరు గొప్పో తేల్చుకునే పనిలో పడ్డారు.

శ్రీముఖి-శివజ్యోతి దుమారం!

ఎవరు గొప్ప తేల్చుకోవడానికి బరిలో దిగిన శ్రీముఖి, శివజ్యోతి ఒక సందర్భంలో తాము బిగ్ బాస్ లో ఆట ఆడుతున్నామన్న విషయం కూడా మర్చిపోయినంతగా ఇన్వాల్వ్ అయిపోయారు. మెల్లగా మొదలైన వీరి మధ్య వాదన చివరికి దుమరంగా మారింది. ఇద్దరూ ఒకరి ని ఒకరు దూశించుకునే స్థాయికి వెళ్ళిపోయింది ఈ టాస్క్. ఇక ఇద్దరి వాదనలూ విని మిగిలిన హౌస్ మేట్స్ వారిలో ఒకర్ని నామినెట్ చేయాలి. వితికా, పునర్నవి, వరుణ్ శ్రీముఖి కి అనుకూలంగా, మహేష్, రవి, రాహుల్, బాబా భాస్కర్ శివజ్యోతికి అనుకూలంగా ఓటేశారు. దీంతో తక్కువ ఓట్లు వచ్చిన శ్రీముఖి నామినేషన్ లోకి వెళ్ళారు.

వితిక-రవి ల మధ్య పోరులో రవి నామినేషన్ కి వెళ్ళారు. రాహుల్, వరుణ్ మధ్య పోరులో ఇద్దరూ స్నేహపూర్వక పోటీ పడి దోస్త్ మేరా దోస్త్ గీతం వినిపించారు. ఇక పునర్నవి రాహుల్ కు ఓటేసి ప్రేమ కురిపించారు. దీంతో వరుణ్ నామినేషన్ లో నిలిచారు. చివరగా పునర్నవి, బాబా భాస్కర్ మధ్య పోరులో పునర్నవి తనదైన శైలిలో రెచ్చిపోయి లెక్చర్ ఇచ్చారు. బాబా భాస్కర్ భాషను కూడా ఎత్తి చూపిస్తూ మాట్లాదారు. దీంతో బాబా భాస్కర్ సైలెంట్ అయిపోయారు. వీరి మధ్య ఓటింగ్ లో పునర్నవి సేవ్ అయి బాబా భాస్కర్ ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్ళారు. ఇక్కడ రాహుల్ పునర్నవికి ఓటేసి తన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు.

మొత్తమ్మీద ఎపిసోడ్ అంతా రకరకాల వినోదాన్ని ఇచ్చింది. పునర్నవి విరహబాధను చూసే బాధను బిగ్ బాస్ త్వరగా ప్రేక్షకులకు తప్పించాడు. ఎపిసోడ్ ప్రారంభంలో శ్రీముఖి..బాబా భాస్కర్ మధ్య జరిగిన చిలిపి వాదన కొంచెం ఎంటర్టైన్ చేసింది. తరువాత నామినేషన్ ఘట్టం లో ఎవరి ఆట వారు ఆడినట్టు కనిపించినా.. ఆడించిన బిగ్ బాస్ దే పై చేయిగా కనిపించింది. ఎలా ఎవరు ఆడాలో సరిగ్గా ప్లాన్ చేస్తాడుగా మరి! అదే కదా బిగ్ బాస్ అంటే!!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories