Bigg Boss3 telugu Episode 60: గాసిప్ గాథల్లో వితిక విలవిల.. జ్యోతక్క ఏడుపుతో గోల గోల..

Bigg Boss3 telugu Episode 60: గాసిప్ గాథల్లో వితిక విలవిల.. జ్యోతక్క ఏడుపుతో గోల గోల..
x
Highlights

కొనసాగిన జ్యోతక్క రోదన.. బిగ్ బాస్ కాలేజీ.. పరీక్షలు.. పాసు మార్కులూ.. ప్రేమ కథలూ అబ్బో ఎపిసోడ్ 60 రకరకాల ఎమోషన్స్ తొ నడిచింది. ఒక్కోరిలో ఒక్కో కోణం బయట పడింది.

కొనసాగిన జ్యోతక్క రోదన.. బిగ్ బాస్ కాలేజీ.. పరీక్షలు.. పాసు మార్కులూ.. ప్రేమ కథలూ అబ్బో ఎపిసోడ్ 60 రకరకాల ఎమోషన్స్ తొ నడిచింది. ఒక్కోరిలో ఒక్కో కోణం బయట పడింది.

కొళాయి తిప్పిన జ్యోతక్క..

బాబా భాస్కర్ నాన్ను అందరిలోనూ ఎదో అనేశారు అంటూ శివజ్యోతి కన్నీటి గంగను బయటకు తీసింది. బాబా, హిమజ, రవి ఆమెను ఓదార్చే కొద్దీ ఆమె కడవల కొద్దీ కన్నీరు కార్చి.. అబ్బా అనిపించింది. చివరికి బాబా భాస్కర్ నా భాష సమస్య వల్ల ఇది వచ్చింది. నన్ను క్షమించు అనే వరకూ ఆ కుళాయి ఆగలేదు. ఇక బిగ్ బాస్ హౌస్ మేట్స్ రెండు గ్రూపులుగా స్పష్టంగా విడిపోయి ఆట మొదలెట్టారు. వరుణ్, వితిక, రాహుల్, మహేష్ విట్టా ఒక గ్రూపుగా.. బాబా, శ్రీముఖి, శివజ్యోతి, రవికృష్ణ హిమజ ఒక గ్రూపుగా మాట్లాడుకోవడం మొదలెట్టారు. మొదట్నుంచీ అలా ఉన్నా.. ఈసారి అది మరింత స్పష్టంగా కనిపించింది.

దుప్పట్లో ఏం చేస్తున్నారో..

నిన్నటి బిగ్ బాస్ కాలేజీ లెవెల్ 2 ఈ ఎపిసోడ్ లో కొనసాగింది. ఇందులో భాగంగా విద్యార్థులకు పరీక్షలు పెట్టారు. వీటిక గాసిప్ లెక్చరర్ గా మూడు రౌండ్ల పరీక్ష పెట్టింది. శివజ్యోతిని పిల్చి అసలు గాసిప్ అంటే ఏమిటి? అది ఎలా పుడుతుంది అని అడిగింది. దానికి శివజ్యోతి వితికను వీధిన పడేసే సమాధానం చెప్పింది. ''పుకార్లు పుట్టించడం మేడమ్.. అన్నీ అటలే ఉంటాయి గాసిప్‌లో. ప్రస్తుతానికి ఈ గాసిప్‌లో మిమ్మల్ని వాడుకుంటా ఏం అనుకోవద్దు.'' గాసిప్ అంటే ఎలా ఉంటుందంటే.. ''వరుణ్ సందేశ్, వితికా బిగ్ బాస్ హౌస్‌లో రాత్రి లైట్లు బంద్ చేసిన తరువాత లోపల బిగ్ షీట్‌లో ఏమోనట అంటూ చేతిలో ఉన్న పెన్‌కి కేప్ పెడుతూ.. వితికా వరుణ్‌‌ని బాగా డబ్బులున్నాయనే చేసుకుందట'' అని తనదైన శైలిలో గాసిప్ అల్లేసింది శివజ్యోతి. అంతే దెబ్బతో వితిక కి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తమాయించుకుని ఓకే నువ్వు వెళ్ళొచ్చు అంటూ శివజ్యోతిని సాగనంపింది. దాదాపుగా అందరూ ఇటువంటి గాసిప్స్ చెప్పి వితిక తొ ఆడుకున్నారు.

ప్రేమతో రెక్సోనా..

రెక్సోనా సబ్బు యాడ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒక్కో మేల్ హౌస్ మేట్.. ఒక్కో ఫిమేల్ హౌస్ మేట్ ని ఎంచుకుని ఆమెకి ప్రపోజ్ చేయాలి ఆ ప్రపోజల్ లో రెక్సోనా మృదువైన చర్మం అనే కాన్సెప్ట్ రావాలి ఇదీ టాస్క్. ఇక హిమజ, రాహుల్ మధ్య ఈ రొమాంటిక్ జంట టాస్క్ నడిచింది. రాహుల్ హిమజ కు ప్రపోజ్ చేస్తున్నట్టు చెప్పడం.. తరువాత వారిద్దరి డ్యాన్స్ చూస్తున్న పునర్నవి రకరకాల భంగిమలు.. అటు తరువాత మహేష్ విట్టా, పునర్నవికి ప్రపోజల్ చేశాడు. స్పాంటేనియస్ గా రెక్సోనా యాడ్ ని కలుపుతూ తను అల్లిన కథనం.. స్కిట్ చాలా బాగా వచ్చాయి. పునర్నవి.. ఆలస్యంగా తనకోసం వచ్చిన ప్రియుడు మహేష్ ని చాడా మాడా తిట్టింది. అన్ని తిట్టినా విన్న మహేష్ ఆమెకు ప్రపోజ్ చేస్తున్నట్టు దగ్గరగా వచ్చి.. నీ కోపం కతినంగా ఉన్న నువ్వు లోపల ఎంతో స్మూత్ అన్నాడు. తరువాత నీ మాటలు గట్టిగా ఉన్నా నువ్వెంతో సున్నితం.. ఐ లవ్యూ అని ప్రపోజ్ చేశాడు. దానికి పునర్నవి ఐ టూ అంటూ రెస్పాండ్ అయింది.. అయితే, వెంటనే మహేష్ ఎహ్ ఇది నీకేవడు చెప్పాడు.. రెక్సోనా సబ్బుకి చెప్పను.. ఐ లవ్ రెక్సోనా అని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ స్కిట్ అందర్నీ ఆకట్టుకుంది.

మొత్తమ్మీద బిగ్ బాస్ ఎపిసోడ్ 60 శివజ్యోతి ఏడుపు తొ ప్రారంభం అయి.. కామెడీ స్కిట్ లతో పూర్తయింది. బిగ్ బాస్ లో ఎవరు గాసిప్స్ ఎలా పుట్టిస్తుంటారో కొంతవరకూ బయట పడింది. ఈ టాస్క్ అందరి మధ్యలో పుల్ల పెట్టినట్టే ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories