Bigg Boss 3 telugu Episode 59: 'ప్రేమ పావురాల'కు త్యాగ పరీక్ష.. 'లవ్వాలజీ' సూక్తులు చెబుతున్న బాబా టీచర్!

Bigg Boss 3 telugu Episode 59: ప్రేమ పావురాలకు త్యాగ పరీక్ష.. లవ్వాలజీ సూక్తులు చెబుతున్న బాబా టీచర్!
x
Highlights

బిగ్ బాస్ లో తొమ్మిదో వారం ఎలిమినేషన్స్ కోసం నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. హలో..హలో.. టాస్క్ తో ఎలిమినేషన్ నామినేషన్స్ ప్రారంభించాడు బిగ్ బాస్. ఫోన్ లో ఒక్కొక్కరినీ పిలిచి వారు ఎలిమినేట్ కాకుండా ఉండాలంటే మరొక హౌస్ మెట్ ఏదో ఒక త్యాగం చేయాలి. ఈ ఎపిసోడ్ లోనూ ఇది కొనసాగింది.

బిగ్ బాస్ లో తొమ్మిదో వారం ఎలిమినేషన్స్ కోసం నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. హలో..హలో.. టాస్క్ తో ఎలిమినేషన్ నామినేషన్స్ ప్రారంభించాడు బిగ్ బాస్. ఫోన్ లో ఒక్కొక్కరినీ పిలిచి వారు ఎలిమినేట్ కాకుండా ఉండాలంటే మరొక హౌస్ మెట్ ఏదో ఒక త్యాగం చేయాలి. దీనిలో భాగంగా పునర్నవి కోసం పులిహోర రాహుల్ కాకరకాయ రసం గటగటా తాగేశాడు. వరుణ్ కోసం శ్రీముఖి బిగ్ బాస్ టాటూ వేయించుకుంది. శివజ్యోతి కోసం మహేష్ విట్టా జుట్టు రంగు తెల్లగా మార్చుకున్నాడు. శ్రీముఖి కోసం బాబా భాస్కర్ తన గెడ్డం త్యాగం చేశాడు. ఇక వరుణ్ అయితే, హిమజ కోసం పేడతో నిండి ఉన్న టబ్ లో పడుకున్నాడు. ఇక ఆ టాస్క్ ఈ ఎపిసోడ్ లో కంటిన్యూ అయింది.

నువ్వు ఎలిమినేట్ అయితే నేనుండలేను..

పులిహోర రాహుల్ పాపం ఏకంగా 20 గ్లాసుల కాకరకాయ రసం తాగేసి పునర్నవి కోసం త్యాగం చేసి ఆమెను సేవ్ చేశాడు. రాహుల్ సేవ్ అవ్వాలంటే..పునర్నవి తరువాతి వారాలన్నిటిలో డైరెక్ట్ గా నామినేట్ అవుతుందని బిగ్ బాస్ చెప్పాడు. ఒకవేళ దానికి ఆమె ఒప్పుకోకపోతే రాహుల్ ఈవారం నామినేట్ అవుతాడని బిగ్ బాస్ చెప్పాడు. ఈ విషయంలో ఈ ప్రేమపావురాల మధ్య పెద్ద చర్చే జరిగింది. పునర్నవి బిగ్ బాస్ కండిషన్ కి ఒప్పుకుంటాననీ, రాహుల్ కోసం తరువాతి వారాల్లో నామినేషన్స్ లో ఉండడానికి సిద్దమనీ చెప్పింది. అయితే, ''నేను నీకోసం కాకరకాయ జ్యూస్ తాగానని నువ్ నాకోసం నామినేట్ కావాల్సిన అవసరం లేదు. సీజన్ మొత్తం నామినేట్ కావడం అంటే చిన్న విషయం కాదు. చాల రిస్క్ వద్దు పున్నూ.. నా ఫైట్ నేను చేసుకుంటా.. నేను ఫైట్ మంచిగా చేస్తే ఉంటా లేదంటే పోతా. అయినా నువ్ ఈవీక్ సేవ్ చేసినా.. నెక్స్ట్ వీక్ ఉంటాననే గ్యారంటీ లేదు. ఇంకా ఆరు వారాలు ఉన్నాయి.. ఒక వారం కాకపోతే ఇంకో వారమైనా నేను పోవచ్చు. నేను నీకోసం ఏం త్యాగం చేయడం లేదు. నాకంటే నీకు మంచి అవకాశం ఉంది. నీ ప్లేస్‌లో ఇంకొకకు ఉన్నా నేను ఇలాగే చెప్తా'' అంటూ పునర్నవికి చెప్పాడు రాహుల్. దీనికి ససేమిరా అంది పునర్నవి.

''రాహుల్ మరి నువ్ నామినేట్ అయ్యి హౌస్ నుండి వెళిపోతే నా పరిస్థితి ఏంటి? నాకు నిన్ను సేవ్ చేయడమే బెస్ట్ అనుకుంటున్నా. నిన్ను నామినేషన్ నుండి తప్పించకుండా ఉండటం నా వల్ల కావడం లేదు. నాకు నచ్చలేదు. నువ్ నన్ను కన్వెన్స్ చేయొద్దు. నువ్ నా ప్లేస్‌లో ఇంకొకరు ఎవరైనా ఉంటే కూడా ఇలాగే చేస్తా అంటున్నావ్.. నా ప్లేస్ నీకు ఇంకొకరు ఉండరు రాహుల్ నీనే ఉంటా. నువ్ ఎలిమినేట్ అయితే నేను ఉండలేను'' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది పునర్నవి. చివరికి రాహుల్ చెప్పిన దానికి పునర్నవి కన్వెన్స్ అవడంతో బిగ్ బాస్ రాహుల్ ఈవారం ఎలిమినేషన్‌ని రాహుల్ నామినేట్ అయినట్టు ప్రకటించాడు.

నీకోసం ఈ పని చేయడం నాకు ఆనందమే!

రవి నామినేషన్ నుంచి బయట పడాలంటే శివజ్యోతి తన జుట్టుని షోల్డర్ వరకూ కట్ చేసుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. దానికి శివజ్యోతి వెంటనే ఓకే చెప్పేసింది. అయితే, రవి ఆమెను అక్కా మరోసారి ఆలోచించు అని చెప్పాడు. దానికి శివజ్యోతి ''ఏందిరా.. నెక్ వరకే కదా.. నాకు పెళ్లైపోయింది.. ఆడపిల్లని.. పైగా నాకు నువ్ కెప్టెన్ అప్పుడు హెల్ప్ చేశావు. నిన్ను కెప్టెన్‌ని చేస్తానో లేదో నాకు తెలియదు కాని.. అలీకి ఏం చేయలేకపోయా నీకోసమైనా ఇది చేస్తా. మా ఆయన అయితే ఇలాంటివి పట్టించుకోడు'' అంటూ జుట్టు కత్తిరించుకుంది శివజ్యోతి. దీంతో రవి నామినేషన్ నుంచి బయట పడ్డాడు.

మా అయన కష్టానికి కారణం నువ్వు..

తన భర్త వరుణ్ పేద తొట్టెలో పడుకోవడాన్ని వితిక జీర్ణించుకోలేక పోయింది. అందుకే కెప్టెన్ గా తనకు వున్న అవకాశాన్ని ఉపయోగించుకుని ఆమెను నేరుగా నామినేట్ చేసింది.

దీంతో మొత్తమ్మీద మహేష్ విట్టా, రాహుల్, హిమజ ఈవారం నామినేషన్స్ లో ఉన్నట్టు బిగ్ బాస్ ప్రకటించాడు.

పునర్నవికి వరుణ్ క్లాస్..

నువ్వు చేసిన పని చాలా బావుంది. హిమజ కోసం భలే త్యాగం చేశావు అంటూ తన భర్త వరుణ్ ని వెటకారం చేసింది వితిక. అయితే, వెంటనే కల్పించుకున్న పునర్నవి..హిమజ మీద తనకున్న ద్వేషాన్ని వెళ్ళగక్కింది. దానికి వరుణ్ గట్టిగా పునర్నవికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. ''నాకోసం శ్రీముఖి పచ్చబొట్టు పొడుపించుకుంది.. అది లైఫ్ లాంగ్ ఉంటుంది. నేను పేడలో పడుకుంటే నష్టం ఏమిటి?'' అని వరుణ్ అనడంతో.. ''చేయడం ఓకే కాని.. ఎవరి కోసం చేస్తున్నామన్నదీ ముఖ్యమే కాదా'' అని పునర్నవి అనడంతో రాహుల్‌కి కోపం వచ్చింది. ''నీ ఒపీనియన్ నీకు ఉంటుంది నా ఒపీనియన్ నాకు ఉంటుంది. హిమజను సేవ్ చేసిన దగ్గర నుండి యాటిట్యూట్ చూపిస్తున్నావ్.. పేడలో పడుకుంది నేను కదా.. నువ్ కాదు కదా.. నువ్ ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్'' అంటూ క్లాస్ పీకారు వరుణ్.

నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఇంకో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అది బిగ్ బాస్ కాలేజీ.. దానిలో బాబా మాస్టర్ లవలజీ టీచర్.. వితిక గసిపాలజీ టీచర్, వరుణ్ కూల్ టీచర్. మిగతావారు ఉపాధ్యాయులు. ఈ టాస్క్ లో బాబా, వితిక మంచి కామెడీ పండించారు. ఈ టాస్క్ ఇంకా కొనసాగుతోంది. తరువాతి ఎపిసోడ్ లో ఈ టాస్క్ లో ఏం జరగబోతోందో చూడాలి.

మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ ఆసక్తి కరంగా సాగింది. గత ఎపిసోడ్ లో జరిగిన విషయాలతో ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఉండదని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ముగ్గురిని నామినేట్ చేసి.. ఓటింగ్ ప్రారంభించారు. ఇక బిగ్ బాస్ కాలేజే అంటూ పెట్టిన టాస్క్ బాగుంది. పునర్నవి..రాహుల్ ప్రేమాయణం ఇంకా కొనసాగేలా ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వారిద్దరి మధ్య జరిగే సన్నివేశాలే ఆసక్తి కరంగా అనిపిస్తుండడం విశేషం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories