logo

Bigg Boss3 telugu Episode 58: త్యాగాల మలుపులో ప్రేమ కహానీ!

Bigg Boss3 telugu Episode 58: త్యాగాల మలుపులో ప్రేమ కహానీ!
Highlights

బిగ్ బాస్ 58 వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. త్యాగాల టాస్క్ లో అందరూ త్యాగాలు చేశారు. పులిహోర రాహుల్, కూల్ వరుణ్ చేసిన త్యాగాలు ఆకట్టుకున్నాయి.

శ్రీముఖిని నామినేట్ చేయాలని అందరూ అనుకున్నారు.. కానీ జరిగింది మరోటి. త్యాగాల ఎపిసోడ్ గా నడిచిన బిగ్ బాస్ ఎపిసోడ్ ఎంటర్టైన్ చేసింది. తొమ్మిదో వారంలోకి విజయవంతంగా అడుగుపెట్టిన బిగ్ బాస్ 3 నామినేషన్ ప్రక్రియ కొంత వెరైటీగా సాగింది.

తన కోసం త్యాగం చేయగలరా?

ఇదే నామినేషన్ కోసం టాస్క్.. గార్డెన్ ఏరియాలో ఓ టెలిఫోన్ బూత్ ఉంచారు. దానికి వచ్చిన కాల్ లో మాట్లాడిన వారికి టాస్క్ ఇచ్చారు. మొదట ఫోన్ మోగిన వెంటనే శ్రీముఖి పరుగున వెళ్ళింది. బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. చెప్పకుండా వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసినందుకు తనను డైరెక్ట్ గా ఎలిమినేషన్ లో పెడుతున్నట్టు ప్రకటించారు. అయితే, వెంటనే ట్విస్ట్ ఇచ్చారు. బాబా భాస్కర్ గడ్డం తీసేస్తే.. శ్రీముఖి ఎలిమినేషన్ నుంచి తప్పిన్చుకోవచ్చాన్నాడు. దానికి బాబా ఒప్పుకున్నారు. దీంతో రాహుల్ ఆయనకు క్లీన్ షేవ్ చేసి కొత్త గెటప్ లోకి మార్చేశాడు.

ఇక రాహుల్ కోసం శ్రీముఖి బిగ్ బాస్ టాటూ వేయించుకుంది. తరువాత రవి తన షూస్ ఎర్ర రంగులో ముంచేసి బాబా భాస్కర్ కోసం త్యాగం చేశాడు. శివజ్యోతి కోసం మహేష్ తన జుట్టుకు ఎర్ర రంగు వేయించుకున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాహుల్..పునర్నవి, వరుణ్..హిమజల మధ్య వచ్చిన టాస్క్ లు ఒక ఎత్తు..

నీ కోసం విషమైనా తాగేస్తా..!

ఈ రేంజిలో పులిహోర రాహుల్ త్యాగం చేశాడు. పునర్నవి ఫోన్ కాల్ ఎటెండ్ కాగానే బిగ్ బాస్ నువ్వు నేరుగా ఎలిమినేషన్ కి ఎంతరయ్యావు.. తప్పించుకోవాలంటే రాహుల్ 20 గ్లాసుల కాకరకాయ రసం తాగాల్సి ఉంటుంది అని చెప్పాడు. పునర్నవి రాహుల్ దగ్గరకు వచ్చి విషయం చెప్పింది. రాహుల్ కాకరకాయ రసం తాగడానికి సిద్ధమయ్యాడు. అయితే, పునర్నవి మాత్రం వద్దులే నువ్వు చేయలేవు వదిలేయ్ అంది. కానీ, రాహుల్ వాంతులు చేసుకుంటూనే.. కాకరకాయ రసం తాగేశాడు. దీంతో పునర్నవి ఒక్కసారిగా రాహుల్ ను హాగ్ చేసుకుని హాట్ కిస్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఇక రాహుల్ ఆనందం చూడాల్సిందే.

చెల్లీ నీకోసం ఏమైనా చేస్తా...!

అన్నిటికన్నా పెద్ద త్యాగం ఇదే అని చెప్పాలి. ఇది హిమజ కోసం వరుణ్ చేసింది. పేడతో ఉన్న టబ్ లో వరుణ్ షర్ట్ తీసి పడుకుంటే హిమజ సేవ్ అవుతుందని బిగ్ బాస్ చెప్పాడు. దానికి సిద్ధం అయ్యాడు వరుణ్. వితిక ఇష్టపడక పోయినా హిమజ అన్నయ్యా నాకోసం ఆ పని చేస్తావా అనడంతో చెల్లి కోసం చేస్తానంటూ ముందుకు వచ్చాడు వరుణ్. అయితే, పేద కంపుకు వాంతులు చేసుకున్నాడు. వితిక భర్తకు సేవలు చేసింది. ఈ హడావుడిలో హౌస్ లోనుంచి కవర్ తీసుకువస్తూ జారిపడింది వితిక. గట్టి దెబ్బ తగలడంతో లేవలేకపోయింది. రాహుల్ ఆమెను ఎత్తుకుని తీసుకువెళ్ళి మంచం మీద పడుకోపెట్టాడు. మరో పక్క హిమజ ఈ టాస్క్ నువ్వు చేయొద్దు వరుణ్ అన్నా.. నేను నేరుగా ఎలిమినేట్ అయిపోతా అంటూ కన్నీరు పెట్టుకుంది. అయినా సరే వరుణ్ మొండిగా టాస్క్ కంప్లీట్ చేశాడు.

మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ ఆసక్తి కరంగానూ.. ఎంటర్టైనింగ్ గానూ సాగింది.



లైవ్ టీవి


Share it
Top