Top
logo

Bigg Boss3 Telugu Episode 54: పునర్నవి 'యు' టర్న్.. వితిక 'ఎ' గ్రేడ్ కెప్టెన్సీ ఆనందం.. బిగ్ బాస్ సూపర్ స్క్రిప్ట్!

Bigg Boss3 Telugu Episode 54: పునర్నవి
Highlights

బిగ్ బాస్ ను నోటికి వచ్చినట్టు తిట్టిన పునర్నవి యూ టర్న్ తీసుకుంది. కెప్టెన్ గా ఎంపికైన వితిక వరుణ్ ని ఎ గ్రేడ్ లెవెల్ లో ముద్దులు పెట్టుకుని ఆనదించింది. ఇవీ బిగ్ బాస్ ఎపిసోడ్ 54 విశేషాలు.

నేనేం తప్పు చేసాను? నేను బూట్లు తుడవడం ఏమిటి? అంటూ రెండు రోజుల పాటు వీరంగం చేసిన పునర్నవి మరి ఏం తప్పు చేశానానుకుందో.. చక చకా బూట్లు తుడిచేసి.. సూపర్ అనిపించేసుకుంది. ఇదీ బిగ్ బాస్ డ్రామా అంటే. వీక్షకులే పాపం అయోమయంలో కొట్టుకోవాలి. పునర్నవి వీరవనితలా తిరుగుబావుటా ఎగురవేసి ముక్కు ఎగరేసే.. తర్జని చూపించి బిగ్ బాస్ ఏమిటీ బుల్ షిట్ అనేసి.. చివరికి అందులోనే పడి కొట్టుకుంది. ఇక వితిక హౌస్ కెప్టెన్ అయింది. ప్రపంచాన్ని గెలిచినంత సంబరపడిపోయింది. బిగ్ బాస్ ఎపిసోడ్ 54 లో ముఖ్యాంశాలు ఇవే.

వంద జతల బూట్లు.. అందరికంటే ముందుగా.. వాటే టాలెంట్ పున్నూ..!

రాహుల్ పులిహోర కలుపుతున్నాడని అందరూ అనుకుంటున్నారు కానీ, పునర్నవి ప్రేక్షకులకి పులిహోర తాలింపు వేసేస్తోంది. టాస్క్ విషయంలో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి బిగ్ బాస్ షో నే దాదాపు బూతులు తిట్టినా పునర్నవి.. ఒకేసారి యూ టర్న్ తీసుకుంది. బిగ్ బాస్ చెప్పినట్టు బుద్ధిగా చెప్పులు తుడిచే పని చేసింది. అది కూడా లా ఇలా కాదు.. ప్రత్యర్థుల కంటే వేగంగా.. మెరిసిపోయేలా షూ క్లీన్ చేసి హౌస్ మేట్స్ అందరితో చప్పట్లు కొట్టించుకుంది. అలా పునర్నవి బిగ్ బాస్ ఫైట్ ఓ కొలిక్కి వచ్చింది.

వితిక కెప్టెన్.. అబ్బా ఏమి ఓవరేక్షన్?

ఇక కెప్టెన్సీ టాస్క్ లో వితిక కెప్టెన్ గా గెలిచేసింది. హౌస్ మేట్స్ ని ముగ్గుర్ని కెప్టెన్సీ టాస్క్ కోసం ఎంపిక చేయమని బిగ్ బాస్ చెప్పాడు. అందరూ కలిసి వితిక, శ్రీముఖి, మహేష్ లను ఎంచుకున్నారు. వారికి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ముగ్గురూ ఒక్కొక్కరూ ఒక్కో ఆటగాడిని ఎంచుకోవాలి. వారిని వీపు మీద పెట్టుకుని ఒక వైపు ఉన్న రంగు జెండాను రెండోవైపుకు మార్చాలి. ఇదీ పిచ్చి టాస్క్. దీనికి ఆడామగా తేడాలేదు. శ్రీముఖి రవిని, మహేష్ శివజ్యోతిని, వితిక వరుణ్ ను ఎంచుకున్నారు. ఇక ఈ ఆటలో వరుణ్ అందరికంటే ఎక్కువ జెండాలు మార్చి వితికను కెప్టన్ చేశాడు. ఇక వితిక కెప్టెన్ అయ్యాకా ఓ పది నిమిషాల పాటు ఆమె ఓవరేక్షన్ చూసిన వారికి కళ్ళు తిరిగాయి. వరుణ్ ను ముద్దులతో ముంచేసింది. దాదాపుగా ఎ సర్టిఫికేట్ సినిమా రేంజ్ లో ఆ ముద్దు సీన్లు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి. నేను కెప్టెన్.. నేను గెలిచాను అంటూ వరల్డ్ కప్ కొట్టిన ఆటగాళ్ళు గ్రౌండ్ చుట్టూ పరిగెత్తినట్టు హౌస్ మొత్తం తిరిగేసి తెగ సంబరపడిపోయింది. మరి ఆ కెప్టెన్సీలో ఏం ఉంటుందో ఏమో వీక్షకులు ఎలానూ అర్థం కాదు. ఆమె చేష్టలు చూసి పేలవంగా నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేం.

మొత్తమ్మీద పునర్నవి యూ టర్న్ ఈ ఎపిసోడ్ హైలైట్ . ఈ ఉదంతం చూస్తుంటే బిగ్ బాస్ షో లో అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని ప్రేక్షకులు అనుకోవడంలో తప్పులేదనిపిస్తుంది. ఆమె శిక్ష ఎందుకు తీసుకోవాలి? అని వీరంగం చేస్తే చూసిన వారు ఏం ఆత్మాభిమానం అనుకున్నారు. శ్రీముఖి ఏమిటి పిచ్చిదానిలా శిక్ష అనగానే వెళ్ళిపోయి చెప్పులు తుడవడం మొదలెట్టేసింది అనుకున్న అమాయక ప్రేక్షకులకు పున్నూ పులిహోర షాక్ అర్థం అయ్యేవుంటుంది. గ్లామర్.. ఒక లవ్ ఎపిసోడ్ తో కొన్ని రోజులు షో కి రేటింగ్స్ ఉండాలి కాబట్టి.. పున్నూతో బిగ్ బాస్ రాజీకి వచ్చాడా.. లేకపోతే బిగ్ బాస్ ను తిట్టిన తరువాత తీరుబాటుగా తన కాంటాక్ట్ విధి విధానాలు గుర్తుచేసుకుందా అనేది మనకెందుకు లెండి. అది బిగ్ బాస్ వాళ్ళిష్టం వచ్చినట్టు వాళ్ళుంటారు. ఓపిక ఉంటె చూద్దాం. లేకపోతే రిమోట్ మన చేతిలోనే ఉంటుందిగా..

ఈవారం బిగ్ బాస్ నుంచి బయటకు ఎవరు వెళతారని మీరనుకుంటున్నారు? ఇక్కడ చెప్పండి..లైవ్ టీవి


Share it
Top