Bigg Boss 3 Telugu: మహేష్ ఇంటికి భారమట.. అందుకే ఈ వారం ఎలిమినేట్?

Bigg Boss 3 Telugu: మహేష్ ఇంటికి భారమట.. అందుకే ఈ వారం ఎలిమినేట్?
x
Highlights

మోసం చేసినా ఫర్వాలేదు.. గెలవాలి అంతే. బిగ్ బాస్ న్యాయం అది. దానిని స్మార్ట్ ప్లే అంటారట నాగార్జున చెప్పారు. నువ్వు చేరిన పనేమిటమ్మా అని అడుగుతూనే.....

మోసం చేసినా ఫర్వాలేదు.. గెలవాలి అంతే. బిగ్ బాస్ న్యాయం అది. దానిని స్మార్ట్ ప్లే అంటారట నాగార్జున చెప్పారు. నువ్వు చేరిన పనేమిటమ్మా అని అడుగుతూనే.. మోసం చేసి తోసేసి గెలిచినా వితిక కు మెడల్ ఇచ్చి పండగ చేశారు. ఇదంతా పక్కన పెడితే అసలు ఈ సీజన్ లో బిగ్ బాస్ లో ఏం జరగబోతోందో.. ముందే తెలిసిపోతోంది. ఇప్పపుటికీ ప్రతి వారం ఎలిమినేటి అయ్యేది ఎవరో స్పష్టంగా తెలిసిపోతోంది రెండు రోజుల ముందే. సరిగా ఆదివారం నాగార్జున వచ్చి కూడా అటు తిప్పి, ఇటు తిప్పి అదే చెబుతున్నారు. ఇక ఈ వారం కూడా ఎవరు ఎలిమినేటి అయిపోతారో తెలిసిపోయింది.

ఈ వారం నామినేషన్స్ లో వరుణ్ , పునర్నవి, రాహుల్, మహేష్ నలుగురూ ఉన్నారు. అయితే శనివారం ఎపిసోడ్ లో హౌస్ లో ఎవడు భారం అనే చిన్న టాస్క్ ఇచ్చి దాదాపుగా ఎవరు ఎలిమినటె అయిపోతారో చెప్పేశారు నాగార్జున. హౌస్ మేట్స్ లో ఎక్కువ మంది మహేష్ విట్టా భారం అని తేల్చేశారు. తర్వాత నాగార్జున రాహుల్ సేఫ్ లో ఎలా ఉన్నారో చెప్పారు. ఇక మిగిలిన వారిలో వరుణ్ ఎలిమినటె అయ్యే అవకాశం ఎలానూ లేదు. అది సుస్పష్టం. ఇక మిగిలిన వారిలో పునర్నవి.. పులిహోర కలిపి.. షో రక్తి కట్టించాలి కదా.. పైగా రాహుల్ ఉన్నంతవరకూ ఆమె లేకపోతె కుదరదు. ఇక మిగిలింది మహేష్ ఒక్కడే. ఎలానూ భారం అని చెప్పేశారు. మరి ఈ వారం మహేష్ ఎలిమినేటి అవడం ఖాయం అని అందరూ భావిస్తున్నారు.

మహేష్ ఎలిమినేటి అవడం విషయంలో ఎవరికీ ఏమీ అనుమానాలు లేవు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం విపరీతంగా వైరల్ అవుతోంది. సో ఈ వారం మహేష్ అవుట్ అవడం ఖాయం. ఇక కొద్దీ గంటల్లో దానికి స్పష్టత వస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ లీకులు దాదాపుగా నిజం అవుతున్నట్టు కనిపిస్తోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories