logo

Bigg Boss 3 Telugu Episode 83: నా బొమ్మ గీయండి.. కితకితలు పెట్టండి.. బిగ్ బాస్ చిన్నపిల్లల ఆటలు!

Bigg Boss 3 Telugu Episode 83: నా బొమ్మ గీయండి.. కితకితలు పెట్టండి.. బిగ్ బాస్ చిన్నపిల్లల ఆటలు!
Highlights

బిగ్ బాస్ ఈ ఎపిసోడ్ లో కూడా పుట్టినరోజు వేడుకల నుంచి బయటకు రాలేదు. నిన్నంతా కేకులు తేనిపించి హౌస్ మేట్స్ కి తీపి పై మమకారాన్ని పోగొట్టిన బిగ్ బాస్ ఈరోజు వారితో ఇంకా ఆదుకున్నాడు. బిగ్ బాస్ పడుకున్నాడు. ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పాడు. కానీ, అందరూ ఆటలాడాలని ఆర్డర్ వేశాడు. అంటే.. చప్పుడు చేయకుండా.. మాట్లాడకుండా.. అరవకుండా ఆటలు ఆడాలి. మరి ఇది చిన్నపిల్లలాటే కదా.

బిగ్ బాస్ ఈ ఎపిసోడ్ లో కూడా పుట్టినరోజు వేడుకల నుంచి బయటకు రాలేదు. నిన్నంతా కేకులు తేనిపించి హౌస్ మేట్స్ కి తీపి పై మమకారాన్ని పోగొట్టిన బిగ్ బాస్ ఈరోజు వారితో ఇంకా ఆదుకున్నాడు. బిగ్ బాస్ పడుకున్నాడు. ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పాడు. కానీ, అందరూ ఆటలాడాలని ఆర్డర్ వేశాడు. అంటే.. చప్పుడు చేయకుండా.. మాట్లాడకుండా.. అరవకుండా ఆటలు ఆడాలి. మరి ఇది చిన్నపిల్లలాటే కదా. ఇక వారికిచ్చిన టాస్క్ లు కూడా అసలు ఒక రేంజిలో ఉన్నాయి.

అలీ గుర్రం.. శ్రీముఖి చిన్నపిల్ల ఎక్కించుకుని 20 రౌండ్లు తిరగాలి.. బాబా భాస్కర్ బొచ్చు పీక్కోవాలి..మహేష్ గోడకుర్చీ వేయాలి.. అదీ ప్లేట్ తలమీద పెట్టుకుని.. బెలూన్లకు షేవ్ చేయాలి వితిక.. ఇవన్నీ ఒకెత్తు అయితే.. అలీ జ్యోతి అక్కకి కితకితలు పెట్టాలి.. అసలు ఏమైనా అర్థం ఉందా.. పిచ్చి ఆటలు.. పిచ్చి చేష్టలు జరిపించారు. బహుశా ప్రేక్షకులకు ఇటువంటివే నచ్చుతాయని అనుకున్నారో.. ఇంతకంటే క్రియేటివ్ గా అలోచించే స్తాయిలేదో కానీ, ఈ ఆటలు కొంచెం అభ్యంతరకరం గానే అనిపించాయి.

ఇక తరువాతి అంకం పిచ్చ పీక్స్ కి వెళ్ళడం అంటే ఇదే అనిపించింది.. బిగ్ బాస్ బొమ్మ హౌస్ మేట్స్ గీయాలి. ఆగండాగండి.. బిగ్ బాస్ ఎవరో మీకు తెలుసా? హౌస్ మేట్స్ కి మరి తెలుసేమో వారు బొమ్మ గీస్తారు తెలుసుకుందామని ఆశపడ్డ ప్రేక్షకులకి జీవితానికి సరిపడే నిరాశ మిగిలింది. తెలీని బిగ్ బాస్ ని ఊహించుకుని బొమ్మ గీసి కదబడని బిగ్ బాస్ కి చూపించి మెప్పించాలి. అదిరింది కదూ.. అడరడం కాదు ఈ టాస్క్ కి హౌస్ మేట్స్ చేసిన పనులకి రిమోట్ వెతుక్కోవాలని ప్రేక్షకులు అనుకునే ఉంటారనడం లో డౌట్ అవసరం లేదు.

ఇంత గందరగోళంలో రిమోట్ జోలికి పోకుండా బిగ్ బాస్ ఈ ఎపిసోడ్ ను ప్రేక్షకులు చూసి హాయిగా ఫీలయ్యరంటే ఒక్క రాహుల్ పాటకే. హౌస్ మేట్స్ కి ఒప్పో సెల్ ఇచ్చి రాహుల్ గాత్రదానంతో ఓ వీడియో రూపొందించాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. రాహుల్ అప్పటికప్పుడు(?) రాసి పాడిన పాట చాలా బావుంది. ఆ పాటకు బాబా భాస్కర్ డైరెక్షన్ అండ్ కెమెరాపనితనంలో వీడియో అద్భుతంగా వచ్చింది. ఈ హౌస్ నుంచి బయటకు వెళ్ళిన తరువాత హౌస్ మేట్స్ కి ఈ పాట గొప్ప కానుకగా మిగులుతుంది.

మొత్తమ్మీద బిగ్ బాస్ క్రియేటివిటీ టాస్క్ లు విసుగు తెప్పించాయి. చిన్నపిల్లల ఆటలు పెద్దలతో ఆడిస్తే ఫన్ వస్తుందని అనుకున్నట్టున్నారు. అలీ కాబట్టి శ్రీముఖిని మోసాడు.. అయినా జ్యోతక్కకి అలీ కితకితలు పెట్టడం ఏమిటండీ.. విచిత్రం కాకపోతేనూ.. వాళ్ళేమన్నా చిన్నపిల్లలా.. పోనీ అనుకుంటే.. బిగ్ బాస్ బూమ్మ వేయడం ఏమిటండీ విడ్డూరం కాకపొతే. అయితే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు బయటకు వెళ్ళడానికి గంటలు కట్టేసినట్టు కనిపిస్తున్న మహేష్ విట్టా బిగ్ బాస్ బొమ్మ గీయడానికి బిగ్ బాస్ దేవుడు అంటూ చేసిన హడావుడి ఉంది.

ఇక వీకెండ్ వచ్చేసింది.. నాగార్జున వస్తారు.. ఈ రెండురోజుల్లో ఎవరిని పంపిస్తారో.. ఎవరితో ఏం ఆడుకుంటారో చూడాల్సిందే.

ఈవారం బిగ్ బాస్ నుంచి బయటకు ఎవరు వెళతారని భావిస్తున్నారు?

లైవ్ టీవి


Share it
Top