Bigg Boss 3 Episode 81: ప్చ్..నాగార్జున వచ్చిన జోష్ కనిపించలేదు!

Bigg Boss 3 Episode 81: ప్చ్..నాగార్జున వచ్చిన జోష్ కనిపించలేదు!
x
Highlights

బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున పండుగ సంబరాలు కంటిన్యూ అయ్యాయి. హౌస్ లో సోగ్గడిలా వచ్చిన నాగ్ హౌస్ మేట్స్ తో సరదాగా గడిపారు. ఈ ఎపిసోడ్ మొత్తం నాగార్జునతో...

బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున పండుగ సంబరాలు కంటిన్యూ అయ్యాయి. హౌస్ లో సోగ్గడిలా వచ్చిన నాగ్ హౌస్ మేట్స్ తో సరదాగా గడిపారు. ఈ ఎపిసోడ్ మొత్తం నాగార్జునతో గడిచిపోయింది. స్టార్ ఆఫ్ ది హౌస్.. పాటలు.. ఆటలు ఇలా కొన్ని పోటీలు పెట్టారు. సాధారణ పోటీల్లానే అవి ముగిసిపోయాయి. స్టార్ ఆఫ్ ది హౌస్ అంటూ నాగార్జున ఇచ్చిన

బంపర్ ఆఫర్ శివజ్యోతి, వరుణ్ కలిసి గెలుచుకున్నారు. దీనిలో భాగంగా ఎవరు హౌస్ లో స్టార్ అనుకుంటే వారికి స్టార్ పెట్టాలి. ఇందులో ట్విస్ట్ లు ఉండే అవకాశం లేదుగా. అలీ శివజ్యోతికి, శివజ్యోతి అలీకి - వరుణ్ వితిక కి వితిక వరుణ్ కి - బాబా భాస్కర్ శ్రీముఖి కి శ్రీముఖి బాబా భాస్కర్ కి ఇలా సరిగ్గా సమానంగా స్టార్ లు పెట్టేసుకున్నారు. ఇక రాహుల్ సహజంగానే వరుణ్ ని ఎంచుకున్నాడు. మహేష్ శివజ్యోతిని ఎంపిక చేశాడు. దీంతో వరుణ్, శివజ్యోతి ఇద్దరూ స్టార్ ఆఫ్ హౌస్ గా ప్రకటించి ఇద్దరికీ వారం పాటు బిగ్ బాస్ స్పెషల్ డిన్నర్ కార్డ్ కానుకగా ఇచ్చారు నాగార్జున.

ఇక సరదాగా వారితో రకరకాల ఆటలు ఆడించారు నాగార్జున. బెల్లీ డ్యాన్స్ చేయాల్సిందిగా శ్రీముఖి కి చెప్పారు. ఆమె ముందు కొంచెం బెట్టు చేసినా చివరికి ఆదరగోట్టింది తన స్టైల్ లో. అలా నాగార్జున ఎపిసోడ్ నడిపించి వెళ్ళిపోయారు.

మొత్తమ్మీద ఎపిసోడ్ అలా సాగిపోయింది. నాగార్జున వచ్చిన జోష్ ఎపిసోడ్ లో కనిపించలేదు. సాదా..సీదాగా ఎపిసోడ్ నడిచిపోయి ప్రేక్షకులకు పెద్దగా వినోదాన్ని ఇవ్వలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటివరకూ బిగ్ బాస్ 3 లో చప్పటి ఎపిసోడ్ ఇదే నని ప్రేక్షకులు భావిస్తే ఆ తప్పు వారిది కాదు.


ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు వెళ్ళిపోతారని మీరు భావిస్తున్నారు?



Show Full Article
Print Article
More On
Next Story
More Stories