Bigg Boss 3 Telugu Episode 78: బాధ తీరని భగ్న ప్రేమికుడు..గ్రూపులుగా గుస..గుసలు!

Bigg Boss 3 Telugu Episode 78: బాధ తీరని భగ్న ప్రేమికుడు..గ్రూపులుగా గుస..గుసలు!
x
Highlights

ఒక్క ఎలిమినేషన్ తో హౌస్ మొత్తం మారిపోయింది. ప్రారంభం నుంచీ గ్రూపుగా ఉండి తమకు నచ్చని వాళ్ళను బయటకు పంపించిన వరుణ్ వితిక గ్రూప్ పునర్నవి వెళ్లిపోవడంతో...

ఒక్క ఎలిమినేషన్ తో హౌస్ మొత్తం మారిపోయింది. ప్రారంభం నుంచీ గ్రూపుగా ఉండి తమకు నచ్చని వాళ్ళను బయటకు పంపించిన వరుణ్ వితిక గ్రూప్ పునర్నవి వెళ్లిపోవడంతో పూర్తిగా నిస్సత్తువగా మారిపోయింది ఉన్నా ఎనిమిది మందీ మూడు గ్రూపులుగా మారి గుసగుసలు చెప్పుకుంటున్నారు. ఎవరి గోల వారిది అన్నట్టు.. పునరానవి వెళ్లిపోయిందన్న బాధ తట్టుకోలేని రాహుల్.. మేడాలియన్ కొట్టేసిన ఆనందంలో వితిక.. పునర్నవి వెళ్ళిపోయింది.. ఇప్పుడు ఏమిటి వాళ్ళ పరిస్థితి అనుకుంటూ బాబా..శ్రీముఖి.. జ్యోతక్కతో అమ్మలక్కల ముచ్చట్లతో అలీ.. ఇలా ఎవరికీ వారుగా కాలక్షేపం చేస్తున్నారు. ఇక నామినేషన్ కోసం ఇచ్చిన టాస్క్ లో నలుగురు సభ్యులు నామినేషన్ కి వెళ్లారు. దానిలో వితిక తన మేడాలియన్ అడ్వాంటేజే ని ఉపయోగించుకుని ఈవారం సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. ఇవీ బిగ్ బాస్ ఎపిసోడ్ 78 విశేషాలు.

భగ్న ప్రేమికుడి పాట్లు..

పునర్నవి-రాహుల్ కొంత కాలంగా బిగ్ బాస్ లో మోగుతున్న పేర్లు. ఇద్దరి మధ్యా ఎదో ఉందని.. ఉంటోందని.. చూపిస్తూ ప్రేక్షకులను కూడా దానికి అలవాటు చేశేశారు. ఇప్పుడు పునర్నవి బయటకు వెళ్ళిపోయింది. దీంతో రాహుల్ విరహవేదన అనుభవిస్తున్నాడు. పైగా అసలు పునర్నవి బయటకు వెళితే తనను కనీసం పలకరిస్తుందా అంటూ బాధ పడిపోతున్నాడు. ఆమె బాయ్ ఫ్రెండ్స్ ఆమె మనసు మార్చేస్తారని ఫీలయిపోతున్నాడు. అతన్ని ఓదార్చే బాధ్యత వరుణ్, వితికాలు తీసుకున్నారు.

పార్కింగ్ టాస్క్..

ఎలిమినేషన్స్ కోసం నామినేషన్స్ కి పార్కింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. . నాలుగు రౌండ్ లుగా ఈ టాస్క్ నడిచింది. ఈ టాస్క్ కోసం అందరూ తమ ప్రయత్నాలు చేశారు. అందరిలోకీ బాబా భాస్కర్ టాస్క్ లో చురుగ్గా వ్యవహరించి స్మార్ట్ గా ఆడారు. ఇక మొదటి రౌండ్ లోనే వరుణ్ టాస్క్ రీచ్ కాలేకపోయాడు దీంతో అతన్ని నామినేషన్ లో ఉన్నట్టు ప్రకటించారు. వరుణ్ వరుసగా మూడోసారి నామినేషన్ లోకి వచ్చినందుకు విపరీతంగా ఫీల్ అయ్యాడు. ఇక రెండో రౌండ్ లో వితిక ఫెయిల్ అయి నామినేషన్స్ కి వెళ్ళిపోయింది. ఇక ఇద్దరూ కల్సి బయట కూచుని రాహుల్ కి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. రాహుల్ బాబా భాస్కర్ తో మీరు అడ్డు వస్తున్నారు అంటూ గొడవ వేసుకున్నాడు. వరుణ్, వితిక అతనిని సమర్థిస్తూ మాట్లాడారు. ఇక మూడో రౌండ్ లో రాహుల్ కింద పడ్డాడు అయినా గోల్ చేరాడు. అయితే ఒకే పార్కింగ్ స్లాట్ లోకి మహేష్, రాహుల్ ఇద్దరూ వెళ్లడంతో.. బిగ్ బాస్ రాహుల్ బండి మొత్తం స్లాట్ లోకి వెళ్లినందున అతన్ని విజేతగా ప్రకటించి మహేష్ ను నామినేట్ చేశాడు. చివరి రౌండ్ లో రాహుల్ గోల్ చేరుకోలేకపోయారు. దీంతో రాహుల్ నామినేట్ అయ్యాడు. ఇక ఇదే రౌండ్ లో శివజ్యోతి కాలు బెణికింది. దాంతో అలీ హంగామా చేశాడు. ఆమెను ఎత్తుకుని డాక్టర్ రూమ్ కి తీసుకు వెళ్ళాడు. ఎత్త్తుకుని మోస్తూ హడావుడి చేశాడు.

వితిక సేఫ్..

తనకిచ్చిన మేడాలియన్ తో లభించిన ఇమ్యూనిటీని వితిక ఉపయోగించుకుంది. నామినేషన్స్ నుంచి ఆ ఇమ్యూనిటీ తో సేవ్ అయింది. దీంతో నామినేషన్స్ లో వరుణ్, మహేష్, రాహుల్ మిగిలారు.

మొత్తమ్మీద ఎపిసోడ్ అంతా పునర్నవి వెళ్లిపోవడం.. గాసిప్ గుసగుసలు.. నామినేషన్స్ హడావుడితో అలా..అలా.. సాగిపోయింది.

ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళతారని అనుకుంటున్నారు?



Show Full Article
Print Article
More On
Next Story
More Stories