Bigg Boss 3 Episode 77: వెళ్ళిపోయిన పునర్నవి.. గుండె పగిలిన రాహుల్..బిగ్ బాస్ లో ముగిసిన ప్రేమాయణం!

Bigg Boss 3 Episode 77: వెళ్ళిపోయిన పునర్నవి.. గుండె పగిలిన రాహుల్..బిగ్ బాస్ లో ముగిసిన ప్రేమాయణం!
x
Highlights

అందరి అంచనాలు తల్లకిందులయ్యాయి. డబుల్ ఎలిమినేషన్.. మహేష్ విట్టా ఎలిమినేషన్ ఇలా రకరకాలుగా వెలువడిన ఊహాగానాలకు తెరపడింది. కచ్చితంగా రాహుల్ సేఫ్ అయ్యాడు...

అందరి అంచనాలు తల్లకిందులయ్యాయి. డబుల్ ఎలిమినేషన్.. మహేష్ విట్టా ఎలిమినేషన్ ఇలా రకరకాలుగా వెలువడిన ఊహాగానాలకు తెరపడింది. కచ్చితంగా రాహుల్ సేఫ్ అయ్యాడు కాబట్టి ఓటింగ్ తో సంబంధం లేకుండా పునర్నవి సేఫ్ అవుతుందని.. మహేష్ విట్టా బయటకు వెళ్లిపోతాడనీ బాగా ప్రచారం జరిగింది. అయితే, దానికి విరుద్ధంగా పునర్నవి ఎలిమినేట్ అయిపొయింది. ఇక సండే ఫన్దేలో భాగంగా నవరాత్రులు-నవరసాలు అనే సరదా టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. ఆ విశేశాలివే..!

నవరాత్రులు-నవరసాలు..

నాగార్జున వస్తూనే ఆదివారం హడావుడి మొదలెట్టేశారు. నవరాత్రులకు సంబంధించి సరదా టాస్క్ ఇచ్చారు. దీనిలో తొమ్మిది రకాల పాటలకు హౌస్ మేట్స్ ఆడాలి. ఇక ఇటువంటిది దొరికితే మనోళ్ళు మామూలుగా రెచ్చిపోరుగా. అదే జరిగింది. పునర్నవికి శృంగార రసం వచ్చింది. 'సిగ్గేస్తోంది.. నిను చూస్తుంటే.. సిగ్గేస్తోంది నిను చూస్తుంటే' అంటూ పింక్ లంగా ఓణీలో పునర్నవి ఒక రేంజిలో రెచ్చిపోయింది. ఆమె హావభావాలకు రాహుల్ ఫ్లాట్ అయిపోయాడు. ఇక నాగార్జున కూడా ఆమె పెర్ఫార్మెన్స్ కు ముచ్చట పడిపోయారు. వరుణ్ కు శాంత రసం అనగానే.. పాపం సరిగా చేయలేకపోయి నాగార్జున తో ఫ్రూట్ అనిపించుకున్నాడు. కరుణ రసం దొరకడంతో శివజ్యోతి ఇరగదీసింది. బాబా భాస్కర్ బీభత్సం చేశారు. అసలే డాన్స్ మాస్టర్ కదా కాంచన పాటకి అయన అదరగొట్టారు. ఇక అమ్మవారిగా శ్రీముఖి రౌద్ర రసాన్ని అద్భుతంగా పలికించింది. ఇద్దరూ వందకు వంద మార్కులు సాధించారు. ఇక వితికను అద్భుత రసం అప్పచెప్పారు. దానిని నీరస రసం చేసింది వితిక. వరుణ్ సహాయపడినా అసలు అర్థం కాని విధంగా ఆమె ఆడింది. అలీ వీర రసంతో సో..సో.. గా నెట్టుకొచ్చాడు. ఇక చివర్లో మహేష్ విట్టా.. బాబా భాస్కర్‌తో కలిసి చేసిన హాస్య రసం హౌస్ మేట్స్, ప్రేక్షకులు, నాగార్జున అందరికీ పొట్టచెక్కలు అయ్యేలా చేసింది. దీంతో మహేష్‌కి కూడా వందకు వంద మార్కులు వచ్చాయి. ఈ స్కిట్ లు సాగుతుండగానే మధ్యలో వరుణ్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు నాగార్జున.

ప్రేమికులను విడదీశారు..

తన గ్లామర్ షో తో ఇన్నాళ్ళూ నెట్టుకొచ్చిన పునర్నవి బిగ్ బాస్ ప్రయాణం ముగిసింది. రాహుల్ తో కలిసి ప్రేమ పురాణం పేరుతొ ప్రతిసారి గట్టెక్కిన పునర్నవి ఈసారి మాత్రం తప్పించుకోలేకపోయింది. ప్రేక్షకులు ఆమె తీరును మొదటి నుంచీ తప్పు పడుతూనే ఉన్నారు. అంతే కాకుండా, ఓటింగ్ లోనూ ఆమెకు తక్కువ ఓట్లే వస్తున్నాయి. దీంతో షో కి ఆమె అవసరం ఎంత ఉందని అనిపించినా.. ఆమెను ఎలిమినేట్ చేయక తప్పలేదు బిగ్ బాస్ కి. ఆమె ఎలిమినేట్ అయిన తరువాత అందరికీ వీడ్కోలు చెప్పే సమయంలో రాహుల్ కు మాత్రం ఆమె వెళుతున్నట్టు చెప్పలేదు. పైగా రాహుల్ మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా.. వద్దు అంటూ సీరియస్ అయ్యింది. ఇక ఆమె బయటకు వెళ్ళిన వెంటనే రాహుల్ విపరీతంగా బాధపడ్డాడు. తరువాత పునర్నవి బయట నాగార్జున దగ్గరకు వచ్చింది. ఆమెతో నాగార్జున మాట్లాడుతూ.. రాహుల్ ఫోటో అడిగితె ఎందుకు ఇవ్వలేదని అడిగారు.. దానికి 'ఎవరు ఏమనుకున్నా తనూ నేను మంచి ఫ్రెండ్స్.. కాని గత రెండు వారాలుగా అతను నా ఫ్రెండ్ షిప్‌కి విలువ ఇవ్వలేదు.. అందుకే నచ్చలేదు' అంటూ పునర్నవి చెప్పింది.

రాహుల్ బాధ!

పునర్నవి వెళ్లిపోవడంతో రాహుల్ విపరీతంగా బాధ పడ్డాడు. 'ఏమైపోతానే' అనే పాటను అందుకుని గుక్కపెట్టి ఏడ్చేశాడు రాహుల్. ఎంతమంది అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించినా అతన్ని ఊరుకో పెట్టలేకపోయారు. పునర్నవి.. నాగార్జునా ఎంత ప్రయత్నించినా అతని దుఃఖాన్ని ఆపలేక పోయారు. పునర్నవి లేకపోవడం నాకు పెద్ద లోటు. ఆమె నన్ను చాలా బాగా చూసుకుంది అంటూ ఎమోషన్ అయ్యాడు. నీ ప్రేమ ఏంటో ఎవరికి అర్ధమైనా కాకపోయినా నాకు బాగా అర్ధమైందంటూ నాగార్జున సర్ది చెప్పి అతని బాధను తగ్గించే ప్రయత్నం చేశారు.

మొత్తమ్మీద బిగ్ బాస్ ఈ ఎపిసోడ్ కొంత సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయంపై కొంత సస్పెన్స్ నిలబెత్తగాలిగారు. ఇంతకుముందు ఎలిమినేషన్స్ లా ఇది జరగకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన దానికి విరుద్ధంగా ఎలిమినేషన్ జరిగింది. పునర్నవి బయటకు వెళ్ళిపోయింది. ఇక రాహుల్ ఏం చేస్తాడనేది ఆసక్తికరం. కాగా.. పైకి కనిపించినా కనిపించకపోయినా వితిక, వరుణ్ లకు మాత్రం పునర్నవి లేకపోవడం పెద్ద షాక్ అనే చెప్పాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories