Bigg Boss 3 Episode 76 : వితిక తొండి ఆట.. పునర్నవి చేయూత! వాటీస్ దిస్ బిగ్ బాస్?

Bigg Boss 3 Episode 76 : వితిక తొండి  ఆట.. పునర్నవి చేయూత! వాటీస్ దిస్ బిగ్ బాస్?
x
Highlights

బిగ్ బాస్ పీక్స్ లోకి వెళుతోంది. గేమ్ ఆఫ్ మేడాలియన్ టాస్క్ చివరి దశకు వచ్చేసింది. తన అతి తెలివితేటలతో వితిక గెలిచింది. నిజాయతీగా పోటీపడిన బాబా...

బిగ్ బాస్ పీక్స్ లోకి వెళుతోంది. గేమ్ ఆఫ్ మేడాలియన్ టాస్క్ చివరి దశకు వచ్చేసింది. తన అతి తెలివితేటలతో వితిక గెలిచింది. నిజాయతీగా పోటీపడిన బాబా భాస్కర్ గ్రూపు రాజకీయాలకు మరోసారి బలైపోయారు. ఇక పులిహోర పునర్నవి రాహుల్ మధ్య తెచ్చిపెట్టుకున్నట్టు సాగిన బూతు గొడవ కొంత టైం పాస్ చేయించింది. ఇవీ ఈ ఎపిసోడ్ విశేషాలు.

రిక్షా టాస్క్ తో గేమ్ ఆఫ్ మేడాలియన్ పూర్తి..

గేమ్ ఆఫ్ మేడాలియన్ లో భాగంగా రెండు భాగాల్లో విజేతలుగా నిలిచిన వితిక, బాబా భాస్కర్ ల మధ్య పోటీ పెట్టారు. ఈ పోటీలో ఇద్దరూ రిక్షాలో కూర్చోవాలి. ఎవరు ఎక్కువ సేపు కూర్చుంటే వారు విజయం సాధించినట్టు. దీనికి అంపైర్ గా గ్రూప్ లీడర్ పునర్నవి వ్యవహరించింది. ఇక గేమ్ లో మధ్యలో ఇచ్చే వస్తువులను పోటీదారులు ఇద్దరూ ఉపయోగించాల్సి ఉంటుంది. మిగిలిన వారు వారిని కిందకు దింపే ప్రయత్నాలు చేయొచ్చు. కానీ శారీరకంగా వారిపై దాడులు చేయకూడదు. చాల నిజాయతీగా కనిపిస్తోంది కదూ. ఎర్రటి ఎండలో మూడేసి స్వెట్టర్లు పోటీదారులు వేసుకోవాలన్నాడు బిగ్ బాస్. అది కానిచ్చారు. పది మిరపకాయలు తినాలని చెప్పాడు బిగ్ బాస్ దాన్నీ పూర్తీ చేశారు. ఇక చివరికి వారికి లీటరు ఏపీ ఫీజ్ తాలని చెప్పాడు బిగ్ బాస్ అదీ కష్టపడి కానిచ్చారు ఇద్దరు పోటీదారులు. ఇక అక్కడి నుంచి డ్రామా స్టార్ట్ అయింది. బాబా భాస్కర్, వితిక ఇద్దరూ ఒంటెలు కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. బాబా భాస్కర్ ఇబ్బంది పడ్డారు. దానికి గత బిగ్ బాస్ లో చేసినట్టుగా దుప్పట్లు అడ్డుపెట్టి అక్కడే కానిచ్చేయాలని శ్రీముఖి సూచనతో బాబా సిద్ధం అయ్యారు. అయితే, ఈ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వితిక బాబా భాస్కర్ ను రిక్షా నుంచి కిందకు తోసేసింది. దీంతో బాబా కిందకు దిగినట్టు అయింది. ఇక పునర్నవి ఇదే అదనుగా వితిక ను విజేతగా ప్రకటించింది. ఇక నిబంధనలపై పెద్ద చర్చ నడిచింది. తోయకూడదని ఎక్కడా లేదని వితిక వాదిస్తే.. తోసుకోవచ్చనీ ఎక్కడా లేదని కొందరు వాదించారు. కానీ, బిగ్ బాస్ కూడా మరి ఏ రాజకీయాలు.. ప్రయోజనాలు దాగి ఉన్నాయో వితికను విజేతగా ప్రకటించారు.

పులిహోర పునర్నవి రాహుల్ గోల!

సంత్రాలు వెస్ట్ అయిపోతున్నాయి నాకివ్వచ్చుగా అని రాహుల్ పునర్నవి ని అడిగాడు. దానికి పునర్నవి సీరియస్ అయింది. రాహల్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టింది. రాహుల్ ఎంత బ్రతిమిలాడినా నన్ను ముట్టుకోకు అంటూ చిరాకు పడింది. కొద్ది సేపు తర్వాత రాహుల్ సిగరెట్ కాలుస్తుంటే వెళ్లి పునర్నవి బ్రతిమాలింది. ఈసారి రాహుల్ ఆమెను విసుక్కున్నాడు. ఈ మధ్యలో వీరి మధ్య వరుణ్ కొంత రాయబారం నడిపాడు. ఇద్దర్నీ కూల్ చేశాడు.

మొత్తమ్మీద విజేతను ముందే ఫిక్స్ చేసి ఆడించిన ఆట గా ఇది కనిపించింది. నిబంధనలోని చిన్న లోసుగును ఆధారంగా చేసుకుని అన్యాయపు విజయాన్ని వితికకు కట్టిపెట్టి.. బాబా భాస్కర్ కు అన్యాయం చేశారు. ఎలాగైనా వీతిక చివరి వరకూ ఉండాలనే ఆలోచన తొ చేసిన పనిగా ఇది కనిపించింది. ప్రేక్షకులకూ ఈ తీరు కొంత విసుగు తెప్పించింది.

బిగ్ బాస్ విశేషాలు ఇంగ్లీషులో మీకోసం.. ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories