Bigg Boss 3 Episode 74:పునర్నవి అంపైరింగ్ లో వితిక విజయగీతిక..జోతక్కకి సాయం చేయబోయి చిక్కుల్లో అలీ!

Bigg Boss 3 Episode 74:పునర్నవి అంపైరింగ్ లో వితిక విజయగీతిక..జోతక్కకి సాయం చేయబోయి చిక్కుల్లో అలీ!
x
Highlights

బిగ్ బాస్ లో బ్యాటిల్ ఆఫ్ మేడాలియన్ మొదలైంది. ఆటాడిస్తా అంటూ బిగ్ బాస్ మొదలెట్టాడు. ఇక గుస గుసలూ.. విస విసలూ మాములుగానే కొనసాగాయి. శ్రీముఖి బాబా...

బిగ్ బాస్ లో బ్యాటిల్ ఆఫ్ మేడాలియన్ మొదలైంది. ఆటాడిస్తా అంటూ బిగ్ బాస్ మొదలెట్టాడు. ఇక గుస గుసలూ.. విస విసలూ మాములుగానే కొనసాగాయి. శ్రీముఖి బాబా భాస్కర్ డ్యాన్స్ జోష్ నింపింది. మేడాలియన్ టాస్క్ మొదటి భాగం విన్నర్ గా వితిక నిలిచింది. ఈ పోటీ నుంచి అలీ, శివజ్యోతి లు అర్హత కోల్పోయారు. ఇవీ ఈ ఎపిసోడ్ విశేషాలు.

పునర్నవి అంపైర్ గా వితిక విజయం..

మేడాలియన్ టాస్క్ మొదటి అంకం మొదలు పెట్టాడు బిగ్ బాస్. 'కుళాయి కొట్లాట' అనే ఊర మాస్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో వితికా, శివజ్యోతి, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీలు మాత్రమే పోటీ దారులుగా ఉన్నారు. నామినేషన్ లో ఉండడంతో మిగిలిన వారికి ఈ అవకాశం లేకుండా పోయింది. అయితే, పునర్నవిని అంపైర్ గా ఉంచారు. టాస్క్ ప్రకారం ట్యాప్‌ల నుండి బకెట్‌లలో నీళ్లు పట్టుకుని డ్రమ్స్‌ నింపాల్సిఉంటుంది. గేమ్‌లో లేని రాహుల్, మహేష్, వరుణ్‌లు వీళ్లకు సాయం చేయవచ్చు లేదా.. నీళ్లు నింపకుండా అడ్డుకుని ఎవరికి విజయం చేకూర్చాలో వారికి మద్దతు ఇవ్వవచ్చు.

ఇక మొదలైంది రచ్చ.. హౌస్‌లో రెండే టాప్‌లు ఉండటంతో ఒక ట్యాప్ శ్రీముఖి, శివజ్యోతి, వితికాలు నీళ్ళు పట్టుకునేందుకు పోటీపడ్డారు. ఇక బాబా భాస్కర్ వాటర్ పట్టుకోకుండా వరుణ్ సందేశ్ అడ్డుపడటంతో వివాదం రేగింది. ఇద్దరూ వాదులాటకు దిగారు. దీంతో పునర్నవి కల్పించుకుని సర్ధిచెప్పే ప్రయత్నం చేసింది. అనంతరం అలీ, శ్రీముఖిల మధ్య రచ్చ రేగింది. అలీ తన గేమ్ తను ఆడకుండా.. శివజ్యోతికి సహాయం చేస్తుండటంతో అభ్యంతరం చెప్పింది శ్రీముఖి. దీనిపై పెద్ద యుద్ధమే నడిచింది. నాయిష్టం అంటూ అలీ రెచ్చిపోయాడు. కానీ, నిబంధనలకు విరుద్ధంగా ఆడుతున్నావు అంటూ పునర్నవి చెప్పినా వినలేదు. శ్రీముఖి.. దేవుడు చూస్తున్నాడు అంటూ సెంటిమెంట్ గా చెప్పినా అలీ ఖాతరు చేయలేదు. దీంతో పునర్నవి బిగ్ బాస్ ను అలీ, శివజ్యోతిలు కరెక్ట్ గా ఆడుతున్నారో లేదో చెప్పవలసిందిగా కోరింది. కొంత సేపటికి బిగ్ బాస్ అలీ, శివజ్యోతి నిబంధనలు అతిక్రమించారు అంటూ అలీ, శివజ్యోతి లను గేమ్ నుంచి బయటకు పంపించాడు. ఇక వితిక డ్రంలో నీళ్ళు ఎక్కువ ఉండడంతో ఆమెను విజేతగా ప్రకటించాడు బిగ్ బాస్.

మొత్తమ్మీద శ్రీముఖి, బాబా భాస్కర్ ల ముక్కాబులా డ్యాన్స్ తో ప్రారంభం అయిన ఈ ఎపిసోడ్ వితిక విజయంతో ముగిసింది. ఫిజికల్ టాస్క్ ఇచ్చి కొట్టుకోవద్దనండం బిగ్ బాస్ కి మామూలైపోయింది. టాస్క్ లో అందరూ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడటం హౌస్ మేట్స్ కి అలవాటుగా మారింది. దాంతో ఎపిసోడ్ యధావిధిగా రచ్చగా సాగింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories