Bigg Boss 3 Episode 70: ఎవరు వెళ్ళిపోతారు చర్చ.. నాగార్జున క్లాస్.. వరుణ్ సేఫ్! బాబా బుక్!!

Bigg Boss 3 Episode 70: ఎవరు వెళ్ళిపోతారు చర్చ.. నాగార్జున క్లాస్.. వరుణ్ సేఫ్! బాబా బుక్!!
x
Highlights

బిగ్ బాస్ 70 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఇక ఆట రసకందాయంలో పడబోతోంది. శనివారం, ఆదివారం నాగార్జున వచ్చి అందరితో ఆటాదుకుంటారుగా.. మరి ఈవారమూ వచ్చేశారు. శనివారం క్లాస్ డే.

బిగ్ బాస్ 70 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఇక ఆట రసకందాయంలో పడబోతోంది. శనివారం, ఆదివారం నాగార్జున వచ్చి అందరితో ఆటాదుకుంటారుగా.. మరి ఈవారమూ వచ్చేశారు. శనివారం క్లాస్ డే. అవును వారమంతా హౌస్ మేట్స్ ఇష్టం వచ్చినట్టు చిన్డులేస్తారు. ఒక్క శనివారం మాత్రం వాటన్నిటికీ లెక్కలు సరిచేస్తారు నాగార్జున. ఇక ఈ వారమూ అదే చేశారు. కాకపొతే కొంచెం డోసు పెంచారంతే. అదేవిధంగా ఆదివారం ఎవరు హౌస్ లోంచి వేల్లిపోతారో తేలేముందు శనివారం ఒకరిని సేవ్ చేస్తారుగా.. ఈవారం వరుణ్ సేఫ్ పొజిషన్ లో ఉన్నట్టు ప్రకటించారు. ఇవీ ఈ ఎపిసోడ్ విశేషాలు.

ఎవరు వెళ్ళిపోతారు?


నాగార్జున రావడానికి ముందు హౌస్ లో అందరి మధ్యా ఎవరు వెళ్లిపోతారనే చర్చ గ్రూపులుగా జరిగింది. బాబా భాస్కర్, శ్రీముఖి ల మధ్య జరిగిన చర్చలో.. మన ఇద్దరిలో ఒకరు వెళ్లిపోయేలా ఉన్నామనే భావన ఇద్దరూ వ్యక్తం చేశారు. కన్నీరు పెట్టుకున్నారు. మళ్ళీ ఇద్దరూ సర్దుకున్నారు. ఇక పునర్నవి రాహుల్ మధ్య కొంత ఇంట్రస్టింగ్ ఎనాలసిస్ నడిచింది. వరుణ్‌తో ఇక మాట్లాడవా? అని పునర్నవి అడిగింది. దానికి చూద్దాం అనేశాడు రాహుల్. వరుణ్ ఈవారం ఎలిమినేషన్ అయిపోతే ఏం చేస్తావ్.. అని పునర్నవి అనడంతో.. వరుణ్ ఎందుకు ఎలిమినేషన్ అవుతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలిమినేట్ కాడు.. అయితే బాబా భాస్కర్ లేదా.. రవి ఎలిమినేట్ అవుతాడని చెప్పాడు రాహుల్.

క్లాస్..క్లాస్..మాస్ క్లాస్..

అందరికీ నాగార్జున ఎంట్రీ తో అక్షింతలు బాగానే పడ్డాయి. వరుసగా అందర్నీ నిలబెట్టి.. 70 ఎపిసోడ్ లు అయిపోయాయి అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఆట సరిగా ఆడామని హెచ్చరిస్తూ.. హద్దు దాటిన వారికి గట్టి వార్నింగ్ ఇస్తూ నాగ్ మాస్టారు క్లాసు పీకారు.

వరుణ్, రాహుల్ మధ్య టాస్క్ లో జరిగిన గొడవ లో గాయాల పరిస్థితి చూడమని డాక్టర్ ను పంపించారు. తరువాత క్లాస్ మొదలైంది. వరుణ్, రాహుల్ ఇద్దర్నీ నిలబెట్టి వారేమి తప్పు చేశారో చెప్పి ఇద్దర్నీ పరస్పరం క్షమాపనలు చెప్పించి.. కూల్ చేశారు.

వితిక రాహుల్ తో గొడవ పడ్డాకా వరుణ్ నాతో ఎక్కువగా కలిసి ఉంటున్నారు అంటూ నాగార్జునకి చెప్పింది. అవును అందుకే వారిద్దరి మధ్య గొడవలు పెట్టావు అంటూ నాగ కౌంటర్ వేశారు.

బూతుల సెంటర్ బోర్డు పెట్టుకో..

నువ్వు బయటకు వెళ్ళాకా బూతుల సెంటర్ అని బోర్డు పెట్టుకో అంటూ పునర్నవికి గట్టి క్లాస్ పీకారు. ఆమె రవిని ఎదవ అనడం.. రాహుల్ ని హౌలే అంటూ చెప్పడం.. బుల్ షిట్ అంటూ బిగ్ బాస్ ను అనడం అన్నిటినీ వీడియో లు వేసి చూపించి మరీ పునర్నవికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు నాగార్జున.

బాబా భాస్కర్ బాబా మాస్కర్ అంటూ తేల్చి.. దానికి సంబంధించిన వీడియోలూ చూపించారు. ఇక బాబా కామెడీగా చెప్పా బోతుంటే.. ప్రతీ విషయం కామెడీ చేయొద్దు బాబా అంటూ సీరియస్ అయ్యారు. మీరు హ్యాపీ అయితే, నేనూ హాపీ అని బాబా అనడంతో నాగ్ మరింత సీరియస్ అయ్యారు.

బాబా వల్ల గుండె పగిలింది..

హార్ట్ బ్రేకింగ్ గేమ్ ఆడించారు నాగార్జున. తమను హార్ట్ చేసిన వారి వద్దకు వెళ్లి హార్ట్ షేప్ ఉన్న అట్టను విరిచేయాలని చెప్పారు. ఎక్కువ మంది బాబా తమ హార్ట్ బ్రేక్ చేశారంటూ ప్రకటించారు.

వరుణ్ సేఫ్..

నామినేషన్స్ లో ఉన్న వరుణ్, శ్రీముఖి, రవికృష్ణ, బాబా భాస్కర్ లలో ఒకరు సేఫ్ అవుతారని చెప్పిన నాగ్ అందరికీ తాళాలు ఉన్న పెట్టె ఇచ్చారు. దానిలో ఎవరి పేరు ఉంటె వారు సేఫ్ అయినట్టు చెప్పారు. వరుణ్ పేరు వచ్చింది. దాంతో వరుణ్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు.

మొత్తమ్మీద మిగిలిన 30 రోజుల్లో ఎలా ఉండబోతోందో చెప్పడానికి లీడ్ గా ఈ ఎపిసోడ్ ను బిగ్ బాస్ ఉపయోగించుకున్నట్టు కనిపిస్తోంది. ఇక ఎవరి ఆట వారు ఆడకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిక కనిపించింది. టార్గెట్ బాబా భాస్కర్ గా నాగార్జున వ్యవహరించడం స్పష్టంగా కనిపించింది. ఇక పునర్నవి బూతు పురాణాన్ని ఎత్తి చూపి ఆమెకు వార్నింగ్ ఇవ్వడం బావుంది. ఇక వచ్చే వారం జరగబోయే విషయాలకు ఈ ఎపిసోడ్ స్పష్టమైన లీడ్ తయారు చేసిందని చెప్పవచ్చు. శనివారం ఆట ముగిసింది. ఇక ఆదివారం.. ఎవరు వెళతారు? బాబా భాస్కర్.. రవిక్రిష్ణ.. శ్రీముఖి.. ముగ్గురిలో శ్రీముఖి సేఫ్ లో ఉన్నట్టు కెప్టెన్ గా ఎంపిక స్పష్టం చేస్తోంది. మిగిలిన ఇద్దరిలో రవి కృష్ణ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మరి అది కరెక్ట్ అవుతుందా? బాబా సేఫ్ అవుతారా? కొద్ది గంటలు వేచి చూడాల్సిందే!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories