Bigg Boss 3 Episode 69 highlights: వచ్చాడయ్యో సామీ.. అలీ రాకతో సంబరాలు! శ్రీముఖికి కెప్టెన్ కలర్!!

Bigg Boss 3 Episode 69 highlights: వచ్చాడయ్యో సామీ.. అలీ రాకతో సంబరాలు! శ్రీముఖికి కెప్టెన్ కలర్!!
x
Highlights

బిగ్ బాస్ లో వైల్డ్ ఎంట్రీ ఇచ్చిన అలీ రాకతో ఎవరికీ వారు సంబరపడిపోతున్నారు. కొందరు అలీ రావడాన్నిమంచి మిత్రుడు మళ్లీ వచ్చినట్టుగా ఆనందిస్తుంటే, మరికొందరు బయటి సంగతులు తెలుస్తాయని సంతోషిస్తున్నారు. ఇక కెప్టెన్సీ కోసం రంగుల ఆట ఆడి శ్రీముఖి ఇంటి కెప్టెన్ గా గెలిచింది. పునర్నవి-రాహుల్ జంటగా ఒంటరి వారయ్యారు. ఇవీ ఎపిసోడ్ 69 విశేషాలు.

బిగ్ బాస్ లో వైల్డ్ ఎంట్రీ ఇచ్చిన అలీ రాకతో ఎవరికీ వారు సంబరపడిపోతున్నారు. కొందరు అలీ రావడాన్నిమంచి మిత్రుడు మళ్లీ వచ్చినట్టుగా ఆనందిస్తుంటే, మరికొందరు బయటి సంగతులు తెలుస్తాయని సంతోషిస్తున్నారు. ఇక కెప్టెన్సీ కోసం రంగుల ఆట ఆడి శ్రీముఖి ఇంటి కెప్టెన్ గా గెలిచింది. పునర్నవి-రాహుల్ జంటగా ఒంటరి వారయ్యారు. ఇవీ ఎపిసోడ్ 69 విశేషాలు.

వచ్చాడయ్యో సామీ..

అలీ వైల్డ్ ఎంట్రీతో హౌస్ అంతా ఆనందంలో మునిగిపోయింది. రవి, శివజ్యోతి లైతే గాలిలో తేలిపోతున్నారు. మేము మళ్లీ మొదటి వారం బిగ్ బాస్ లోకి వచ్చినట్టుంది అంటూ బిగ్ బాస్ కి కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమం చేశారు. అసలు అలీ తిరిగి రావడమే మాకు పెద్ద కానుక ఇచ్చినట్టు అంటూ చెప్పుకున్నారు. ఇక అలీ వచ్చాడు.. బయటి విశేషాలు తెలుసుకోవాలని ఎక్కువ మంది హౌస్ మేట్స్ ఆరాటపడ్డారు. వితిక, వరుణ్, మహేష్, బాబా, శ్రీముఖి ఎక్కువగా ఆ విషయాలు వినడానికి ఆసక్తి చూపించారు. అలీ కూడా వారితో ఎక్కువ సమయం గడిపాడు. వరుణ్ తమకి రాహుల్ తొ వచ్చిన గొడవ గురించి అలీకి ఎకరువు పెట్టాడు.

నువ్వు పూర్వ జన్మలో కుక్కవి అయి ఉంటావు..

శివజ్యోతి వితిక కి గూబపగిలిపోయే పంచ్ వేసింది. అలీ రాక గురించి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. నేను అలీ వచ్చాడని గుర్తు పట్టేశా. అలీ దగ్గర ఒకరకమైన వాసన వస్తుంది. ఆ వాసన గుర్తు పట్టి అలీనే అని అనుకున్నా అంటూ తనకున్న మన్మధ పరిజ్ఞానం బయట పెట్టింది. దానికి శివజ్యోతి పూర్వజన్మలో కుక్కవై ఉంటావు అని సూపర్ పంచ్ వేసింది.

అంతా ఆ రెండు జంటల గురించే..

ఇక అలీ బయట విశేషాలు చెప్పడం మొదలు పెట్టాడు. గేమ్ ఇక బిగ్ బాస్ ఆడతాడంటూ చెప్పుకొచ్చాడు. తన ఆప్త మిత్రులు రవి, శివజ్యోతి లకు ఈ విషయాలు చెప్పాడు. ఆనలుగురు.. పునర్నవి-రాహుల్, వితిక-వరుణ్ వీరి మధ్యే ఆట అని బయట అందరూ అనుకుంటున్నారు. అందరూ అదే చర్చించుకుంటున్నారు. ఇక మనం ఆడటానికి ఏమీ లేదు. బిగ్ బాస్ మొత్తం ఆట ఆడతాడు. ఆ నలుగురు కలిసి ఉన్నంత వరకే గేమ్ మన చేతిలో ఉంటుంది. వారు విడిపోతే.. ఇక మొత్తం బిగ్ బాస్ ఆడతాడు అంటూ చెప్పాడు.

ఇప్పుడు అసలు మజా..

మరోవైపు రవి, శివజ్యోతిలు అలీ గురించి ఫుల్ ఖుషిలో ఉన్నారు. అలీ ఈసారి మరింత సూపర్ గా ఆడతాడని శివజ్యోతికి రవి చెప్పాడు. బయట విషయాలు తెలుసు. హౌస్ లో ఎవరెంతో తెలుసు. ఇప్పుడు ఎలా ఆడితే కరెక్ట్ గా వుంటుందో ఓ లెక్కతొ అలీ ఉంటాడు. ఇప్పుడు అసలు మజా వచ్చింది. ఇక అలీ షో మొదలవుతుంది. అందర్నీ ఆదేసుకుంటాడు అంటూ సంబర పడిపోతూ శివజ్యోతి దగ్గర అలీ ఆనందాన్ని పంచుకున్నాడు.

అబ్బే.. వీళ్ళని నమ్మితే నష్టమే!

ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు చాలా మంది వస్తుంటారు.. ఔట్ సైడ్ ఇన్ఫర్మేషన్ వల్ల మన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. మన ఆట మనం ఆడలేం. వీటిని అసలు నమ్మకూడదు కూడా. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఏం ఉండదు అంటూ వితికా దగ్గర అలీ రాకపై పెదవి విరిచింది శ్రీముఖి.

కలర్ ఫుల్ కెప్టెన్..

శ్రీముఖి కెప్టెన్సీ కలను రంగులతో నెరవేర్చాడు బిగ్ బాస్. కెప్టెన్సీ కోసం పోటీ పడిన బాబా భాస్కర్, శ్రీముఖి, రవి, శివజ్యోతి లకు రంగుల బౌల్స్ ఇచ్చాడు. వాటిని రెండు చేతులతో పట్టుకుని ఉండాలి.వాటిలో రంగు కింద పడిపోకూడదు. హౌస్ మేట్స్ తమ కిష్టమైన వారిని రక్షించవచ్చు. ఇష్టం లేని వారి వద్ద నుంచి రంగు కింద పడేలా లేదా బౌల్ కింద పెట్టేలా చేయొచ్చు. శివజ్యోతి ఒక్క చేతితో పట్టుకుని అవుట్ అయిపొయింది. బాబా దగ్గర రంగు కింద పడిపోయేలా అలీ చేయడంతో ఆయనా అవుట్. రవి, శ్రీముఖిల మధ్య చాల సేపు పోటీ నడిచింది. అయితే, అలీ, వితిక సహకరించడంతో శ్రీముఖి చివరి వరకూ నిలిచి కెప్టెన్ అయింది.

ఒంటరి అయి పోయామూ..

మొన్నటి గొడవ దెబ్బకి.. రాహుల్-పునర్నవి జంటగా ఒంటరిగా మిగిలిపోయారు. వాళ్ళని ఎవరూ పట్టించుకోవడమే మానేశారు. దాదాపు హౌస్ మొత్తం ఒక్కటై పోయి వారిద్దరినీ పక్కన పెట్టేశారు. వారిద్దరూ హౌస్ లో ఒక్కోరి గురించి విశ్లేషించుకుంటూ.. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.

మొత్తమ్మీద అలీ రాక ఈ ఎపిసోడ్ మొత్తం నడిచింది. అలీ హడావుడే ఎక్కువ ఉంది. ఈ సందట్లో కెప్టెన్సీ టాస్క్ కూడా పెద్దగా కనిపించలేదు. ఇక కెప్టెన్సీ టాస్క్ కూడా ముందే నిర్ణయం అయిపోయిన రీతిలో సాగింది. శివజ్యోతి, బాబా ఒకసారి కెప్టెన్ అయ్యారు. రవి ఈ వారం ఎలిమినేట్ అవుతాదాని హౌస్ మేట్స్ బలంగా నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. దీంతో అందరూ కలిసి శ్రీముఖిని కెప్టెన్ చేయడానికి ప్రయత్నించినట్టు అనిపించింది. ఇక శనివారం నాగార్జున వచ్చి ఏం చేస్తారో.. ఎటువంటి ట్విస్ట్ లు పెడతారో చూడాల్సిందే!



Show Full Article
Print Article
More On
Next Story
More Stories