Top
logo

Bigg Boss 3 Telugu Episode 64: హిమజను సాగనంపారు..రాహుల్ సీక్రెట్ కొనసాగుతోంది!

Bigg Boss 3 Telugu Episode 64: హిమజను సాగనంపారు..రాహుల్ సీక్రెట్ కొనసాగుతోంది!
Highlights

మొత్తానికి ఎలిమినేషన్ స్కిట్ పూర్తి చేశారు నాగార్జున. డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి.. రాహుల్ ఏలిమినేట్...

మొత్తానికి ఎలిమినేషన్ స్కిట్ పూర్తి చేశారు నాగార్జున. డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి.. రాహుల్ ఏలిమినేట్ అయ్యాడని బయటకు తీసుకువచ్చి.. ఆటలు ఆడించి.. చివరికి ఇదంతా వట్టి ఆట.. రాహుల్ ఎలిమినేట్ కాలేదు అంటూ అందర్నీ ఫూల్స్ చేసిన బిగ్ బాస్.. ఈ ఎపిసోడ్ లో హిమజ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించి, ఆమెను బయటకు పంపి మొత్తానికి ఈవారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిందనిపించారు. కొద్దిసేపు గద్దల కొండ గణేష్ హడావుడీ.. బయటకు వచ్చిన హిమజ బిగ్ బాస్ కి ఇచ్చిన గట్టి సమాధానం ఈ ఎపిసోడ్ 64 విశేషాలు.

ఓపెన్ సీక్రెట్..

ఈవారం ఎలిమినేషన్ లో రాహుల్ ను చివరి వరకూ ఆడించి.. చివర్లో సీక్రెట్ రూమ్ లోకి పంపాడు బిగ్ బాస్ ఆదివారం కూడా అక్కడే రాహుల్ ఉన్నాడు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పిన నాగార్జున హౌస్ మేట్స్ కి అదే మాట చెబుతూ ఎలిమినేషన్ లో ఉన్న హిమజ, మహేష్ లలో ఎవరు సేఫ్ అవుతారో చూడాలంటూ ఆదివారం సరదాల్ని కొనసాగించారు.

బిగ్ బాస్ లో గద్దలకొండ..

గద్దలకొండ గణేష్ గా సినిమా థియేటర్స్ లో సందడి చేస్తున్న వరుణ్ తేజ్ ఈరోజు బిగ్ బాస్ షో కి వచ్చారు. హౌస్ మేట్స్ తొ కొంతసేపు సరదా ఆటల్ని ఆడిన వరుణ్ ఎలిమినేషన్ ఎవరు అయ్యారో చెప్పి వెళ్ళిపోయారు. హిమజ ఎలిమినేట్ అయినట్టు అయన ప్రకటించారు.

నేను రానని ఖరాఖండీ గా చెప్పిన హిమజ..

బిగ్ బాస్ హౌస్ లో నిజాయతీగా ఆడుతున్నది ఎవరన్నా ఉన్నారూ అంటే అది హిమజ ఒక్కరే అనేది ప్రేక్షకుల మాట. మొదట్లో కొద్దిగా అక్కడి పరిస్థితులకు సర్దుకోవడానికి ఇబ్బంది పడ్డా.. తరువాత ఆమె తన పద్దతితో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే, హౌస్ లో మాత్రం వితిక, పునర్నవిలకు హిమజ ను ఎలాగైనా బయటకు పంపించేయాలని మొదట్నుంచీ కోరిక. దానికోసం ప్రతి వారం ప్రయత్నిస్తూనే వచ్చారు. చివరికి ఈ వ వారం సక్సేస్ అయ్యారు. వితిక తన కెప్టెన్సీ ప్రివిలేజ్ ఉపయోగించుకుని ఎలిమినేషన్ కి నామినేషన్ లో లేని హిమజను ఎలిమినేషన్స్ లో నిలబెట్టింది. ఆఖరుకు అక్కడి ఈక్వేషన్ ల ప్రకారం (మరి ప్రేక్షకుల ఓట్ల లెక్క ఎప్పటికీ అర్థం కాదు) రాహుల్ పులిహోర కోసం కావాలి. మహేష్ విట్టా కొంత వినోదం కోసం కావాలి. ఇక హిమజ తప్ప బిగ్ బాస్ కి చాయిస్ లేదు. ఇప్పుఫు హౌస్ లెక్కల ప్రకారం.. వరుణ్-వితిక, రాహుల్ - పునర్నవి ఈ ఇద్దరు జంటల్నీ విడదీసే ప్రరిస్థితి లేదు. రేటింగ్ లు ఆమాత్రం అయినా కొనసాగాలంటే.. రాహుల్ పులిహోర ప్రేమాయణం ఉండాల్సిందే. ఇక కాస్త రొమాంటిక్ టచ్ కావాలంటే వరుణ్ వీతిక ఉండాల్సిందే. ఇందులో అనుమానం లేదు. సరే, ఇదంతా పక్కన పెడితే.. మొత్తమ్మీద హిమజను బట్టలు సర్దేసుకోమని చెప్పేశారు. దాంతో హిమజ బయటకు వచ్చేసింది. అక్కడ హిమజ ఎంతో హుందాగా ప్రవర్తించింది. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్లిందో.. వచ్చేటప్పుడు కూడా అలానే బయటకు వచ్చింది. చాలా చక్కగా ఆమె నిష్క్రమణ జరిగింది. ఇక బయటకు వెళ్ళిపోతున్న వారితో బిగ్ బాస్ ఎప్పుడూ వేసే ప్రశ్న.. మళ్లీ అవకాశం ఇస్తే లోపలి వస్తారా? అని. అదే ప్రశ్న హిమజనూ వేశారు నాగార్జున. దానికి హిమజ ఇచ్చిన సమాధానం అందర్నీ మరోసారి హిమజ కు జై కొట్టేలా చేసింది. ''నేను వెళ్లను సార్.. ఒకసారి ఎలిమినేట్ అయిన తరువాత మళ్లీ వెళ్లడం అనేది ఫెయిర్ కాదు. అది వన్ టైం డ్రీమ్ మాత్రమే'' అంటూ నిక్కచ్చిగా సమాధానమిచ్చింది నాగార్జునకి. అవును అది నిజమే కదా.. ఒకసారి.. నువ్వు పనికి రావు అని బయటకు పంపిన తరువాత తిరిగి లోపలి వెళ్ళడం కరక్ట్ కాదు అనేదీ నిజమే.

మొత్తమ్మీద పడిపోతున్న రేటింగ్స్ నిలబెట్టుకోవడం కోసం ఈ వారంత ఎపిసోడ్ ను బిగ్ బాస్ వినియోగించుకోవాలని ఆశించినట్టు కనబడుతోంది. ఒక్కోసారి ఇటువంటి ఎత్తుగడలు రివర్స్ అయ్యే ప్రమాదమూ ఉంటుంది. అయినా, ప్రపంచంలోనే అతిపెద్ద రియాల్టీ షో.. ఏది ఎలా చేసి దాని క్రేజ్ నిలబెట్టాలో వాళ్లకి తెలీకుండా ఉంటుందా చెప్పండి. ఇదివరకే చెప్పినట్టు వినోదం కోసం బిగ్ బాస్ ముందు కూచుని.. పిచ్చోల్లవుతున్నామనుకోగానే పక్కకు జరగడానికి రిమోట్ మీట మన చేతుల్లోనే ఉంటుందిగా ఏమంటారు?Next Story