Bigg Boss 3 Telugu Episode 55: శ్రీముఖి ఓవర్ యాక్షన్..వరుణ్ రియాక్షన్! నాకు ఇంగ్లీషు రాదన్న బాబా!!

Bigg Boss 3 Telugu Episode 55: శ్రీముఖి ఓవర్ యాక్షన్..వరుణ్ రియాక్షన్! నాకు ఇంగ్లీషు రాదన్న బాబా!!
x
Highlights

ప్రశాంతంగా మొదలై.. సరదాగా సాగి.. బిగ్ బాస్ మార్క్ రచ్చ రేగి.. మళ్లీ ప్రశాంతంగా ముగిసింది బిగ్ బాస్ ఎపిసోడ్ 55

ప్రశాంతంగా మొదలై.. సరదాగా సాగి.. బిగ్ బాస్ మార్క్ రచ్చ రేగి.. మళ్లీ ప్రశాంతంగా ముగిసింది బిగ్ బాస్ ఎపిసోడ్ 55.ప్రశాంతంగా మొదలై.. సరదాగా సాగి.. బిగ్ బాస్ మార్క్ రచ్చ రేగి.. మళ్లీ ప్రశాంతంగా ముగిసింది బిగ్ బాస్ ఎపిసోడ్ 55. లగ్జరీ బడ్జెట్ టాస్క్ తో ఎపిసోడ్ అంతా సాగింది. డిన్నర్ పార్టీ కోసం ఇంటి సభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు. ఇంటి సభ్యులు ఒక్కోరు కన్ఫెషన్ రూమ్ కి వెళ్లి బిగ్ బాస్ చెప్పింది చేయాలి. తరువాత వారు బాటకు వచ్చి లోపల ఏం చేశారో హౌస్ మేట్స్ కి చెప్పాలి. అయితే, అది నిజమా కాదా అన్నది హౌస్ మేట్స్ ఊహించగాలగాలి.

నాకు ఇంగ్లీషు రాదు..

మొదటగా బిగ్ బాస్ బాబా భాస్కర్ ను పిలిచాడు. ఒకటి నుంచి వంద వరకూ అంకెలు లెక్కపెట్టమన్నాడు. ఓస్ ఇంతేనా అని లెక్క పెట్టేశారు బాబా. తరువాత వంద నుంచి ఒకటి వెనక్కి లెక్క పెట్టమన్నాడు బిగ్ బాస్ ఇప్పుడు దొరికారు బాబా. లెక్క తప్పారు. తరువాత ఎ నుంచి జడ్ చెప్పమన్నారు. నాకు రాదు బిగ్ బాస్ అంటూ చెప్పారు. అయితే, హౌస్ మేట్స్ దగ్గర నుంచి అవి నేర్చుకుని వచ్చి చెప్పమన్నాడు బిగ్ బాస్.

రవి, హిమజ లకు స్వీట్లు తినమమన్నారు. తరువాతి వంతు వితిక, వరుణ్ ల వంతు. వారిని ఇంటి సభ్యుల ముందు మాట్లాడలేని విషయాలు మాట్లాడుకోమన్నాడు. శివజ్యోతిని తెలుగు పద్యాలు.. పునర్నవి నర్సరీ రైమ్స్ చెప్పాలన్నాడు. తరువాత రాహుల్ వంతు. 50 సిటప్స్ చేసి.. ఫిజ్ తాగమన్నాడు.

శ్రీముఖి ఓవర్ యాక్షన్..వరుణ్ రియాక్షన్!

రాహుల్ విషయంలో నిజం చెబుతున్నాడా..అబద్ధం చెబుతున్నడా అని అడిగితే శ్రీముఖి నిజం అని చెప్పింది. వరుణ్ వారిస్తున్నా వినకుండా శ్రీముఖి నిజం అని చెప్పింది. మెజార్టీ రాహుల్ చెప్పేది నిజం అని చెప్పారు. ఈ సమయంలో శ్రీముఖి మాట్లాడిన ఓ మాటని వరుణ్ ఎత్తి చూపించి మాట్లాడాడు. దాంతో ఇద్దరి మధ్యా పెద్ద వాగ్వాదం జరిగింది. ఇది చాలా దూరం వెళ్ళింది. కొంత సేపటి తరువాత అందరూ సర్దుకున్నారు. తరువాత బిగ్ బాస్ ఇచ్చిన డిన్నర్ ఎంజాయ్ చేశారు హౌస్ మేట్స్.

మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ మొత్తం సరదాగానే జరిగింది. గత రెండు రోజులు జరిగిన గొడవలు అన్నీ మర్చిపోయేలా ఎపిసోడ్ డిజైన్ చేసినట్టు కనిపించింది.


ఈవారం బిగ్ బాస్ నుంచి బయటకు ఎవరు వెళతారని మీరనుకుంటున్నారు? ఇక్కడ చెప్పండి..






Show Full Article
Print Article
More On
Next Story
More Stories