Bigg Boss 3 Telugu Episode 51: బిగ్ బాస్ మంట పెట్టాడు..అసలు ఆట మొదలైంది!

51 వ ఎపిసోడ్ లోకి బిగ్ బాస్ అడుగుపెట్టింది. ఇక అంతా సీరియస్సే అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి. అదేవిధంగా నామినేషన్ ప్రక్రియ అందరి మధ్యలో మంట పెట్టి మరీ ముగించాడు. ఇప్పుడు అసలు ఆట మొదలైంది.. ఎవరు మిగిలేనో .. ఎవరు పోయేనో ..?

K V D Varma
Published on: 9 Sept 2019 10:43 PM IST
Bigg Boss 3 Telugu Episode 51: బిగ్ బాస్ మంట పెట్టాడు..అసలు ఆట మొదలైంది!
X

అలీ వెళ్లిపోయినప్పుడు ప్రారంభమైన కన్నీటి వరద హౌస్ లో ఈ ఎపిసోడ్ లోనూ కొనసాగింది. బాబా భాస్కర్ తొ మొదలైన ఈ ఏడుపు సీన్.. శివజ్యోతి తొ ఎక్కువై.. రవికృష్ణతో పరాకాష్టకి చేరుకుంది. ఆఖరుకి శ్రీముఖి కలుగ చేసుకుని తనదైన శైలిలో ఆపండేహే మీ గోల.. ఆడు చచ్చిపోలేదు. అంటూ విరుచుకు పడింది. దాంతో అంతా సర్దుకుంది.

50 వారాలు ముగిసిపోయాయి.. ఇక బిగ్ బాస్ ఫినాలే ప్రారంభం అవుతోంది. ఇక్కడ నుంచి మీ గురించి మీరు ఆడండి అలా అయితేనే మీరు గెలవగలుగుతారు. గెలవడం కోసం ఆడండి అంటూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని హెచ్చరించారు.

బాబా భాస్కర్ కి బిగ్ బాస్ ట్విస్ట్..

నామినేషన్ ప్రక్రియ లో భాగంగా ఒక్కోరు ఇద్దరి పేర్లు చెప్పడం యధావిదిగానే జరిగింది. అందులో ఎక్కువ మంది శ్రీముఖి, మహేష్, శిల్ప, రవికృష్ణ, పునర్నవి, హిమజ ఆరుగురి పేర్లు సూచించారు. దాంతో ఆరుగురు నామినేట్ అయ్యారు. అయితే, ఈ దశలో బిగ్ బాస్ బాబా భాస్కర్ కి ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటి కెప్టెన్ గా ఆరుగురిలో ఒకరిని సేవ్ చేయాలని చెప్పాడు. దాంతో ఒక్క నిమిషం మాత్రమే ఆలోచించిన బాబా రవిని సేవ్ చేస్తున్నట్టు చెప్పారు. ఇక బిగ్ బాస్ శ్రీముఖి, మహేష్, శిల్ప, పునర్నవి, హిమజ లు నామినేషన్స్ లో ఉన్నట్టు ప్రకటించాడు.

మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ అందర్నీ విడదీసి ఆడించడానికి బిగ్ బాస్ ప్రయత్నిస్తున్న విషయాన్ని చెప్పింది.

ఈవారం ఎవరు బిగ్ బాస్ హౌస్ లోంచి బయటకు వెళతారని అనుకుంటున్నారో ఇక్కడ తెలపండి.







K V D Varma

K V D Varma

Next Story