logo

Bigg Boss 3 Telugu Episode 48: ఇది బాబా భాస్కర్ స్టైల్!

Bigg Boss 3 Telugu Episode 48: ఇది బాబా భాస్కర్ స్టైల్!
Highlights

బిగ్ బాస్ 3 లో సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. బాబా కెప్టెన్సీ హంగామా సరదాగా మొదలయింది. ఎవరు నవ్విస్తారు టాస్క్ అందరినీ నవ్వించింది. ఇక చివర్లో హౌస్ మేట్స్ ఇంటి నుంచి వచ్చిన ఆత్మీయ సందేశాలతో అందరూ భావోద్వేగానికి గురయ్యారు.

బిగ్ బాస్ 3 లో సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. బాబా కెప్టెన్సీ హంగామా సరదాగా మొదలయింది. ఎవరు నవ్విస్తారు టాస్క్ అందరినీ నవ్వించింది. ఇక చివర్లో హౌస్ మేట్స్ ఇంటి నుంచి వచ్చిన ఆత్మీయ సందేశాలతో అందరూ భావోద్వేగానికి గురయ్యారు.

ఇది బాబా మార్క్ కెప్టెన్సీ..

శ్రీముఖి బాబా భాస్కర్ ను కాకా పట్టింది. బతిమిలాడింది. తాను కావాలని ఏమీ చేయలేదని ఏదేదో చెప్పి మీరు నామీద కోపం వదిలేయలంది. బాబా కూడా అటువంటిదేమీ లేదన్నారు. ఇక కెప్టెన్ గా బాబా తనదైన శైలిలో రెచ్చిపోయారు. ఇక్కడ బాబా భాస్కర్.. నేనే కెప్టెన్.. నేను చెప్పిందే జరగాలి అంటూ హౌస్ మేట్స్ అందర్నీ కూచోపెట్టి అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. పొట్టి బట్టలు కట్.. కెప్టెన్ అని నన్ను ఎవరూ పిలవకూడదు. నిద్ర వస్తే అందరూ పడుకోండి. కుక్క మొరిగినా లేవకండి. దమ్ముంటే.. ఇంగ్లీషులో మాట్లాడుకోండి.. ఇలా చెపుతూ అందర్నీ నవ్వించారు. ఇక రాహుల్ అలీలకు లివింగ్ రూమ్, వరుణ్, వితిక లకు బాత్రూం, హిమజ, శివజ్యోతి, శిల్పాలకు కిచెన్ అప్పచెప్పారు భాస్కర్. ఇక శ్రీముఖిని తన పీఏ అని చెప్పిన బాబా ఆమెకు స్విమ్మింగ్ పూల్, కోర్ట్ యార్డ్, డైనింగ్ ఏరియా శుభ్రం చేసే పని అప్పగించారు. ఆ తరువాత ఆమెను దగ్గరనుండి కోర్ట్ యార్డ్ ను క్లీన్ చేయించారు. దీంతో నాకీ కెప్టెన్ వద్దు అంటూ శ్రీముఖి కొద్ది సేపు కామెడీ చేసింది.

అందరికీ పార్టీ ఇవ్వాలి..

ఏయ్ వాచ్ మాన్ రెండు కేసులు బీర్లు.. రెండు ఫుల్ బాటిల్స్, బాయిల్డ్ పల్లీ తీసుకువచ్చి ఇవ్వు. నేను కెప్టెన్ అయ్యాను పార్టీ ఇవ్వాలి. నీకు బయటకు వచ్చాక నేను చూసుకుంటాను అంటూ కొంత సేపు హంగామా చేశారు బాబాభాస్కర్.

నవ్వించే సమాధానం..

హౌస్ మేట్స్ అందర్నీ ఇద్దరు ఇద్దరుగా విడగొట్టి.. కొన్ని ప్రశ్నలు వేసి.. వాటికి కామెడీగా సమాధానం ఎవరు ఇస్తారో వారితో హౌస్ మేట్స్ అందరూ నవ్వుతూ మాట్లాడాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అందరికంటే కామెడీగా మహేష్ సమాధానం చెప్పడంతో అతనిని గెలిచినట్టు ప్రకటించారు.

సందేశ్ ఆయా..!

హౌస్ మేట్స్ అందరికీ ఇంటి దగ్గరనుంచి సందేశాలు వచ్చాయి. వారికి ఇష్టమైన పదార్థాలు ఇంటి నుంచి పంపించారు. వాటిని చూస్తూ.. సందేశాలు చదువుతూ అందరూ భావోద్వేగానికి గురయ్యారు.

మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ కాస్త రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. అందరూ సరదాగా కాలక్షేపం చేశారు. అదీకాక ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేసేలా కంటెంట్ ఉంది.

ఈవారం బిగ్ బాస్ నుంచి బయటకు ఎవరు వెళతారని మీరు అనుకుంటున్నారు?




లైవ్ టీవి


Share it
Top