Bigg Boss 3 Telugu Episode 47: అలా బాబా భాస్కర్ కెప్టెన్ అయ్యాడు!

K V D Varma
Updated on: 6 Sept 2019 11:58 AM IST
Bigg Boss 3 Telugu Episode 47: అలా  బాబా భాస్కర్  కెప్టెన్ అయ్యాడు!
X

రెండు రోజులు హింస తొ హింసించిన బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ తొ కొంచెం రిలీఫ్ ఇచ్చాడు. అయితే, వితిక రాగాలతో వరుణ్ టెన్షన్ లో పడ్డాడు.మొగుడూ పెళ్ళాల గొడవ ఎక్కడైనా ఇలానే ఉంటుందా? అనిపించింది వరుణ్ వితికలను చూస్తె.. కామన్ సెన్స్ వాడు అంటూ వరుణ్ వితికాకి చెప్పాడు అంతే వితికా వాయుగుండం మొదలై తుపానులా మారిపోయి భోరున ఎడవడంతో ముగిసింది. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణతొ.. ఎపిసోడ్ సగం కరిగిపోయింది. మరో వైపు జైల్లో ఉన్న రాహుల్ పునర్నవిని హార్ట్ అయ్యేలా మాట్లాడాడు. దాంతో ఆమె కొంత సేపు ఎద్చుకుంది.

కెప్టెన్ బాబా..

బిగ్ బాస్‌కి కెప్టెన్‌గా బాబా భాస్కర్..

ఈవారం హౌస్‌కి కొత్త కెప్టెన్‌ని ఎన్నుకోవడానికి కొత్త స్కెచ్ ఇచ్చాడు బిగ్ బాస్. కెప్టెన్ కోసం అర్హులైన ముగ్గురు.. అనర్హులుగా ముగ్గురు పేర్లను మొత్తం ఆరుగురు పేర్లను ఏకాభిప్రాయంతో చెప్పాలని బిగ్ బాస్ కోరారు. దీంతో.. బిగ్ బాస్ హౌస్‌కి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన శిల్ప, రవి, రాహుల్‌లను అనర్హులుగా.. బాబా భాస్కర్, హిమజ, శ్రీముఖిలను అర్హులుగా అందరూ కలిసి ప్రకటించారు. ఈ విషయంపై రాహుల్ తీవ్రంగా అభ్యంతరం చెప్పాడు. మేము చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాము. మళ్లీ మీరు కెప్టెన్ టాస్క్ కి మేము అనర్హులమని ఎలా ప్రకటించారు? అంటూ ఫైర్ అయ్యాడు. ముందు శివజ్యోతి, తరువాత వరుణ్ వెళ్లి సర్ది చెప్పే ప్రయతనం చేసినా రాహుల్ అదే తీరులో స్పందించాడు. దీంతో ఈ విషయం పై హౌస్లో కొద్ది సేపు డిస్కషన్ నడిచింది.

ఇక కెప్టెన్ అయ్యేందుకు ఈ టాస్క్‌లో అనర్హులుగా ఉన్న వాళ్లు అర్హులైన వాళ్ళు కెప్టెన్ అయ్యేందుకు సహకరిస్తారని ఎవరు ఎవరు కోసం ఆడతారో తేల్చుకోవాలని బిగ్ బాస్ ఆదేశించగా.. బాబా భాస్కర్ కోసం శిల్పా చక్రవర్తి, హిమజ కోసం రాహుల్, శ్రీముఖి కోసం రవి ఆడటానికి ముందుకు వచ్చారు. 'ఆపిన వాడిదే అధికారం' అంటూ సాగిన ఈ టాస్క్‌లో శిల్పా చక్రవర్తి సాయంతో హౌస్ మిస్టర్ పర్ఫెక్ట్ బాబా బాబా భాస్కర్ కెప్టెన్ అయ్యారు.


K V D Varma

K V D Varma

Next Story