Top
logo

Bigg Boss 3 Telugu Episode 45: ఉన్మాద వినోదం!రాక్షస క్రీడ!

Bigg Boss 3 Telugu Episode 45: ఉన్మాద వినోదం!రాక్షస క్రీడ!
Highlights

బిగ్ బాస్ ఎపిసోడ్ 45 హింసాత్మకంగా మారింది. దొంగల నుంచి ప్రజలు తమని తాము రక్షించుకోవడం అనే హింసని ప్రేరేపించే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో హౌస్ మేట్స్ ఎక్కడా తగ్గలేదు. రక్తాలు కారేటట్టు.. ఒంటి మీద బట్టలు ఊదేటట్టు ఆటడారు. దీంతో వినోదం కాస్త వెగటు పుట్టించింది.

నాలుగు రోజులు చక్కని వినోదాన్ని.. కుటుంబం అంతా కలిసి చూసేలా మంచి కంటెంట్ పంచింది బిగ్ బాస్. ఆరువారాలుగా లేని ఎంటర్టైన్మెంట్ కనిపిస్తోందని వీక్షకులు సంబరాపదినంత సేపు కూడా ఆ ఆనందం నిలబడలేదు. ఈ ఎపిసోడ్ లో హౌస్ మొత్తం గందరగోళ విన్యాసాలతో సాగింది. పరమ చెత్త రకపు టాస్క్ తో హింసాత్మకంగా మారిపోయింది హౌస్.

ర్యాగింగ్ ఫర్ శిల్పా..

శిల్పాచక్రవర్తి బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా ఒక కొత్త వ్యక్తి మన మధ్యలో పోటీకి దిగితే మిగిలిన వారు ఎలా ప్రవర్తిస్తారో అదే విధంగా హౌస్ మేట్స్ ప్రవర్తించారు. దాదాపుగా అందరూ శిల్ప గురించి మాట్లాడుకున్నారు. రాహుల్ పునర్నవి ల మధ్య పెద్ద చర్చ ఈ అంశంపై నడిచింది. పునర్నవి రాహుల్ తొ గుసగుసలాడింది. శ్రీముఖి, శిల్ప లకు మొదట్నుంచీ పడదనీ, ఇప్పుడు ఇక్కడ అది కంటిన్యూ కావచ్చనీ ఆమె చెప్పింది. దానికి రాహుల్ ఎక్కువ ఊహించుకోవద్దంటూ చెప్పాడు. దీనితో ఆమె రాహుల్ పై విరుచుకుపడింది. ఇక బాబా భాస్కర్, శిల్ప ల మధ్య కొంత డిస్కషన్ నడిచింది. హౌస్ లో పరిస్థితుల పై మాట్లాడుతూ శిల్ప మధ్యలో రావడం వల్ల కొంచెం పరిస్థితులకు అలవాటు పడాలి అని బాబా తో చెప్పింది. ఇది పెద్ద టాస్క్ అంది. ఇప్పుడే వచ్చాను కదా.. ఈ ఒక్కరోజు అన్నీ గమనిస్తా.. రేపట్నుంచి నేనేంటో చూపిస్తా అంటూ చాలెంజ్ విసిరింది. ఒక్క రోజు కాకపోతే వారం రోజులు గమనించు.. లేకపోతే వారంలో బయటకు పోతావ్ అంటూ తనదైన స్టైల్ పంచ్ వేశాడు భాస్కర్. దానికి శిల్ప బాబా పై సీరియస్ అయింది మీరంతా నన్ను ర్యాగింగ్ చేస్తున్నారా? నాకిదేం నచ్చలేదు అంటూ రుసరుస లాడింది.

తన్నుకు ఛావండి!

ఈ వారం టాస్క్ లో భాగంగా దొంగలు దోచిన నగరం అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. రెండు గ్రూపులుగా అందర్నీ విడదీసి.. ఒక గ్రూపు దొంగలు.. రెండో గ్రూప్ ప్రజలు.. దొంగల రాణి శిల్ప. దొంగలు దోచుకోవడానికి ప్రయత్నించాలి.. ప్రజలు కాచుకోవాలి. సింపుల్ గా కనిపిస్తోంది కదూ. కానీ, ఇందులో ఎంత హింసాత్మకంగా ప్రవర్తించొచ్చో అంతగానూ చేశారు హౌస్ మేట్స్. హైడ్ అండ్ సీక్ లాంటి ఆట కాదిది. శారీరకంగా ఒకరితో ఒకరు పెనుగులాడుకోవాల్సిన ఆట. హౌస్ లో ఆడా, మగా తేడా లేకుండా ఒకరిని ఒకరు తోసుకుంటూ.. కొట్టుకుంటూ .. అదీ రక్తాలు కారేలా.. ఇక ఈ పోటీలో గెలవకపోతే జీవితమే పోతుంది అన్నట్టుగా.. రచ్చ చేశారు హౌస్ మేట్స్.. బిగ్ బాస్ మధ్యలో గంభీరంగా హెచ్చరించినా ఫలితం లేకపోయింది. కాదు.. అటువంటి హింసాత్మక టాస్క్ ఇచ్చినపుడు ఎవరేం చెప్పినా ఫలితం ఉండదు. బిగ్ బాస్ రిఫరీగా తెరవెనుక నుంచి చెబుతున్నాడు కాబట్టి సరిపోయింది.. ఈ దరిద్రపు టాస్క్ లో రిఫరీగా ముందుంటే.. అతనికి కూడా నాలుగు తగిలించి ఈడ్చేసేవారు హౌస్ మేట్స్.

నేను ఫ్రూట్ కాదు అని నిరూపించాలనుకున్నట్టున్నాడో.. తన భార్యే కదా ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నాడో వరుణ్ ఈ టాస్క్ లో చాలా దారుణంగా ప్రవర్తించాడు. వితిక దగ్గర గన్ లాక్కొనే ప్రయత్నంలో ఆమెను ఈడ్చి ఈడ్చి హింసించాడు. ఇక అలీ, రాహుల్ కొట్టుకున్నారు. పునర్నవి, శ్రీముఖి కొట్టుకోకపోవడమే మిగిలింది. ఇలా చెప్పుకుంటూ పోవడం కూడా హింసాత్మకంగానే అనిపిస్తుంది.

మొత్తమ్మీద నాలుగురోజులుగా గాడిలో పడింది అనుకున్న షో ఇప్పుడు చెప్పడానికి వీలులేనంత రచ్చగా మారడం విషాదం. షో నిర్వాహకులు అసలు ఏం ఆశించి వీక్షకుల ఇళ్ళ మధ్యలోకి హింసను ప్రేరేపించే టాస్క్ లు చోప్పిస్తున్నారో దేవుడికే తెలియాలి. రేటింగ్ లు హింసాత్మక కార్యక్రమాలతో రావనే నిజాన్ని ఎంత తొందరగా బిగ్ బాస్ వర్గాలు గుర్తిస్తే అంత మంచిది.

ఈవారం బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారని అనుకుంటున్నారో ఇక్కడ తెలపండి


Next Story

లైవ్ టీవి


Share it