బిగ్ బాస్ హైలైట్స్: తమన్నా జుగుప్సాకర ప్రవర్తన

K V D Varma
Published on: 6 Aug 2019 11:07 PM IST
బిగ్ బాస్ హైలైట్స్: తమన్నా జుగుప్సాకర ప్రవర్తన
X

తమన్నా అసహ్యకరమైన ప్రవర్తన బిగ్ బాస్ ని కంపు పట్టిస్తోంది. రవికృష్ణ తనని నామినేట్ చేశాడన్న కక్షతో అతనిని టార్గెట్ చేసింది తమన్నా. ఇక ఎపిసోడ్ 17లో మొత్తం ఆమె బూతు పురాణమే నడిచింది. ఒక దశలో రవికృష్ణ బాబా భాస్కర్ ని పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంతలా అతనిని మాట్లాడిందో. అది ఆట కాబట్టి.. అక్కడ తగ్గి ఉండాలి కాబట్టి తగ్గాడో మరి నిజంగానే అంత ఓపిక తనకి ఉందొ తెలీదు కానీ, రవికృష్ణ తన ఓరిమితో అందర్నీ ఆకట్టుకున్నాడు. అయితే, తనని ఎమన్నా పట్టించుకోని రవికృష్ణని '' వీడిని ఎమన్నా పట్టించుకోడు.. వీడసలు మొగాడే కాదు'' అని నీచంగా మాట్లాడింది తమన్నా.

రాహుల్ సిప్లిగంజ్ కలుగ చేసుకుని ట్రాన్స్ జెందర్స్ కి ఆదర్శంగా ఉండాలని ఇక్కడకు వచ్చి ఇలా ప్రవర్తిస్తున్నావు. అంటూ ఆమెకు చెప్పబోయాడు. దానికి రాహుల్ ని కూడా నాలుగు బూతు మాటలతో కడిగేసింది తమన్నా.

అంతకు ముందు శివజ్యోతిని కూడా జర్నలిస్టులు అంటూ చాలా అసహ్యకరంగా మాట్లాడింది తమన్నా. దానికి శివజ్యోతి గట్టిగా బదులిచ్చింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోనంటూ గట్టిగా దేబ్బలాడింది.. దాంతో కొంచెం తగ్గిన తమన్నా.. తరువాత రవికృష్ణని వదలకుండా టార్చర్ పెట్టింది.



K V D Varma

K V D Varma

Next Story