ఆసుపత్రిలో బిగ్ బీ అమితాబ్!

బిగ్ బీ అని పిలుచుకునే ఇండియన్ సినిమా బిగ్ ఐకాన్ అమితాబ్ బచన్ గత మంగళవారం ఆసుపత్రిలో చేరారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అమితాబ్ రొటీన్ పరీక్షల్లో భాగంగా ముంబై లోని ఓ ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వచ్చాయి.

K V D Varma
Updated on: 18 Oct 2019 3:21 PM IST
ఆసుపత్రిలో బిగ్ బీ అమితాబ్!
X

బిగ్ బీ అని పిలుచుకునే ఇండియన్ సినిమా బిగ్ ఐకాన్ అమితాబ్ బచన్ గత మంగళవారం ఆసుపత్రిలో చేరారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అమితాబ్ రొటీన్ పరీక్షల్లో భాగంగా ముంబై లోని ఓ ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వచ్చాయి. ఆసుపత్రిలో ఐసీయూ లాంటి గదిలో ప్రస్తుతం ఆయన ఉన్నారని తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే అయన వద్దకు రోజూ వెళ్లివస్తున్నారు.

అమితాబ్ బచన్ చాలా కాలంగా కేవలం 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నారు. కాలేయ సంబంధిత ప్రక్రియల కోసం అయన తరచూ వైద్య సహాయం పొందుతూ వస్తున్నారు. 1982 లో కూలీ సినిమా షూటింగ్ లో భాగంగా అయన సంబంధీకులు ఇచ్చిన రక్తం ద్వారా ఆయనకు హెపటైటిస్ బి వైరస్ సోకింది. అప్పటి నుంచి అయన లివర్ సంబంధిత ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా యూనిసెఫ్ కోసం అయన రూపొందించిన అవగాహనా వీడియోలో వెల్లడించారు.

ఇక ప్రస్తుతం అయన రెగ్యులర్ చెకప్ కోసమే ఆసుపత్రిలో చేరారనీ, కంగారు పడాల్సిన పని లేదని ఆసుపత్రి వర్గాలను ఊటంకిస్తూ పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా అమితాబ్ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ట్వీట్ లు వెల్లువెత్తుతున్నాయి.


K V D Varma

K V D Varma

Next Story