Nagarjuna with Praveen Sattaru: గరుడవేగ' దర్శకుడికి నాగ్ గ్రీన్ సిగ్నల్!

Nagarjuna with Praveen Sattaru: హీరో అక్కినేని నాగార్జున మరో సినిమాకి ఒకే చెప్పారు. గత ఏడాది మన్మధుడు 2 సినిమాతో ఆకట్టుకోలేకపోయిన నాగ్ ప్రస్తుతం వైల్డ్ డాగ్’

Krishna
Published on: 27 July 2020 9:18 PM IST
Nagarjuna with Praveen Sattaru: గరుడవేగ దర్శకుడికి నాగ్ గ్రీన్ సిగ్నల్!
X
Nagarjuna, Praveen Sattaru (File Photo)

Nagarjuna with Praveen Sattaru: హీరో అక్కినేని నాగార్జున మరో సినిమాకి ఒకే చెప్పారు. గత ఏడాది మన్మధుడు 2 సినిమాతో ఆకట్టుకోలేకపోయిన నాగ్ ప్రస్తుతం వైల్డ్ డాగ్' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో నాగ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మహర్షి సినిమాతో మంచి రైటర్ గా పేరు సంపాదించుకున్న అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం కరోనా వలన ఈ సినిమా వాయిదా పడింది.

ఇక నాగార్జున తాజాగా గరుడవేగ ఫేం ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తగా నిర్మించనున్నాయి. ఈ రోజు( సోమవారం ) ఏషియన్‌ గ్రూప్‌ చైర్మన్‌ నారాయణదాస్‌ నారంగ్‌ జన్మదినం సందర్భంగా ఈ సినిమాని ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఈ సినిమాకి నారాయణదాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ మరో నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ సినిమాకి 'నా రాత నేనే రాసుకుంటా' అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. సినిమాకి సంబంధించిన నటీనటులని, సాంకేతిక నిపుణులని ప్రకటించనున్నారు. గరుడవేగ లాంటి సక్సెస్ తరవాత ప్రవీణ్‌ సత్తార్‌ నుంచి నాగార్జున లాంటి హీరోతో సినిమా వస్తుండడంతో సినిమా పైన అంచనాలు భారీగా నెలకొన్నాయి.

Krishna

Krishna

Next Story