రాజశేఖర్ హిట్ సినిమాకి సీక్వెల్

రాజశేఖర్ హిట్ సినిమాకి సీక్వెల్
x
Highlights

సీనియర్ హీరో రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా మొదట చేసిన సినిమా "గరుడవేగా". ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే హిట్ టాక్ ని తెచ్చుకొని మంచి...

సీనియర్ హీరో రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా మొదట చేసిన సినిమా "గరుడవేగా". ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే హిట్ టాక్ ని తెచ్చుకొని మంచి కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి స్థాయి స్పై థ్రిల్లర్ గా తెరకెక్కింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు అంట నిర్మాతలు.

ప్రస్తుతం రాజశేఖర్ కల్కి అనే చిత్రంలో నటిస్తున్నాడు . ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ "కల్కి" జూన్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రాజశేఖర్ యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. సి.కళ్యాణ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత "గరుడవేగా" సీక్వెల్ ఉంటుంది అంట. ఇదిలా ఉంటే మరో వైపు దర్శకుడు ప్రవీణ్ సత్తారు బాహుబలి వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తరువాత పుల్లెల గోపీచంద్ బయోపిక్ పై శ్రద్ధ పెడతాడు ప్రవీణ్. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయితే గాని ప్రవీణ్ "గరుడవేగా" సీక్వెల్ పై శ్రద్ధ వహించలేడు.

Show Full Article
Print Article
Next Story
More Stories