బాలయ్య బాబు లుక్స్ అదరహో!

బాలయ్య బాబు లుక్స్ అదరహో!
x
Highlights

రోజు రోజుకీ పెద్ద హీరోలు కుర్ర హీరోలకు పోటీగా మారిపోతున్నారు. మన్మధుడు2 సినిమా లుక్స్ లో యంగ్ హీరోలకు పోటీలా నాగార్జున కనిపించారు. తరువాత ఇటీవల...

రోజు రోజుకీ పెద్ద హీరోలు కుర్ర హీరోలకు పోటీగా మారిపోతున్నారు. మన్మధుడు2 సినిమా లుక్స్ లో యంగ్ హీరోలకు పోటీలా నాగార్జున కనిపించారు. తరువాత ఇటీవల చిరంజీవి 'సైరా' తరువాతి మూవీ కోసం తన లుక్స్ పూర్తిగా మార్చేసి మళ్లీ అప్పటి చిరులా మెరుస్తున్నారు. ఇక ఇప్పుడు బాలయ్య బాబు వంతు. నందమూరి బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు. కానీ, అభిమానులు మాత్రం #NBK105 గా పిలుచుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల చేసింది సినిమా యూనిట్. కొత్తరకం గెడ్డం తో.. నిండైన సూటుతో బాలకృష్ణ సరికొత్తగా కనిపిస్తున్నారు.

'ఐరన్ మ్యాన్' లో టోనీ స్టార్క్ పాత్ర పోషించిన రాబర్ట్ డౌనీ జూనియర్ ను గుర్తుకు తెస్తున్న ఈ లుక్ అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. కళ్ళజోడు.. సూటు.. గెడ్డం అసలు సిసలు నందమూరి సింహం ఇలా ఉంటుంది అంటూ నందమూరి అభిమానులు సంబ్రపదిపోతున్నారు. ఇప్పుడు ఈ నందమూరి ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది.

ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్.. వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories