Bala Krishna New Movie Super Man: సూపర్ మ్యాన్' గా బాలయ్య, బోయపాటి!

Bala Krishna New Movie Super Man: హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

Krishna
Published on: 5 July 2020 5:30 PM IST
Bala Krishna New Movie Super Man: సూపర్ మ్యాన్ గా బాలయ్య, బోయపాటి!
X

Bala Krishna New Movie Super Man: హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఎంత ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే .. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బోయపాటి మరోసారి బాలయ్య ని ఫుల్ మాస్ యాంగిల్ లో చూపిస్తున్నాడన్నది ప్రేక్షకులకి అర్ధం అయిపోయింది.

ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి మామూలు పాత్ర కాగా ఇంకోటి అఘోర పాత్ర.. ఇందులో బాలయ్య సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకి మొనార్క్ అనే టైటిల్ ని పరిశీలనలో ఉంచినట్టుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా 'సూపర్ మ్యాన్' అనే మరో టైటిల్ కూడా బాగా వినిపిస్తోంది. గతంలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా సూపర్ మ్యాన్ అనే ఓ సినిమా వచ్చింది. దీనితో ఇదే టైటిల్ ని ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.. దీనికి సంబందించి టైటిల్‌‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఇక కరోనా వలన కొన్ని రోజులు సినిమా షూటింగ్ వాయిదా పడగా...మళ్లీ షూటింగ్ మొదలైంది.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని దసరాకి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి.

h

Krishna

Krishna

Next Story